• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, August 31, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

Maari by Maari
August 31, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics
0
ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

విలువలకు వారసురాలు.. మా “సీతారామయ్య గారి మనవరాలు” ఈరోజు నుంచే ప్రారంభం..
బుల్లితెరపై భావోద్వేగభరిత దృశ్యకావ్యం… అందమైన అనుబంధాలకు అపురూప ఆవిష్కరణ.. ఆస్తులకు కాదు, ఆశయాలకు వారసత్వం ఉండాలంటూ సగర్వంగా చాటే విలక్షణ ధారావాహిక ‘సీతారామయ్య గారి మనవరాలు’. బలమైన కథ, ఉత్కంఠభరిత కథనం, కన్నులపండువైన సన్నివేశాలు, తూటాల్లా పేలే మాటలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు మేళవించిన ఈ మెగా డైలీ సీరియల్ వీక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రముఖ నిర్మాత శ్రీధర్ గూడూరు నిర్మాణంలో రూపొందింది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు మీ ఈటీవీలో ఈ సీరియల్ ప్రసారం కానుంది.
కథా నేపథ్యం:
చెక్కుచెదరని ఆదర్శాలతో నిర్మించిన కోట… ఆ కోటను కూల్చేయాలని సొంతవారి కుట్ర! ఈ రెండింటి నడుమ నలిగే ఆ మహా సామ్రాజ్యానికి దిక్కెవరు? రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయిన పెద్దాయనను మనవరాలు ఎలా కాపాడుకుంది? దిగ్భ్రాంతికి గురైతే వెళ్లాల్సిన దారినే మరిచిపోయే బలహీనతను ఆమె ఎలా జయించింది? ఇలాంటి ఆసక్తిరేపే అంశాలతో తొలి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను టీవీ స్క్రీన్ కు కట్టిపడేసేలా కథనం సాగుతుంది.
కుటుంబ బంధాలు బలహీనపడుతున్న ఈ రోజుల్లో… ప్రతీ ఇంటికీ ఓ “సీతారామయ్య” లాంటి పెద్ద దిక్కు ఉండాలనీ, ప్రతీ కుటుంబానికీ ఆ పరువు నిలబెట్టే ఓ “మనవరాలు” ఉండాలనీ అనిపించేలా మహేంద్ర వర్మ ఎల్.డి దీనికి స్క్రీన్‌ప్లే అందించారు.
దర్శకుడు ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ) మాట్లాడుతూ:
“‘పుత్తడిబొమ్మ’, ‘స్వాతిచినుకులు’, ‘మనసంతా నువ్వే’ వంటి విజయవంతమైన సీరియల్స్ తర్వాత బుల్లితెరపై సరికొత్త సాంకేతిక విప్లవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాం. గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా తీర్చిదిద్దాం. సొంత ఇల్లే శత్రువుగా మారిన వేళ, శిథిలమైన ఇంటికే శ్రీరామరక్షగా నిలబడే ఓ ఆడపిల్ల ధైర్యం చూసే ప్రతీ గుండెను హత్తుకుంటుంది. సుమారు 1000 ఎపిసోడ్ల పాటు సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది” అని తెలిపారు.
నటీనటులు:
‘స్వాతిచినుకులు’ ఫేమ్ రచిత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పరమేశ్వరి, శివపార్వతి, ప్రశాంత్, అక్షయ, ఆట మౌనిక, పరమేశ్వరి, హీరోలు హేమంత్, రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
* దర్శకత్వం: ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ)
* నిర్మాత: శ్రీధర్ గూడూరు
* స్క్రీన్‌ప్లే: మహేంద్ర వర్మ ఎల్.డి
* సంగీతం: షకీల్ (ర్యాప్ రాక్)
* సినిమాటోగ్రఫీ: ప్రకాష్ కోట్ల
* ఎడిటింగ్: రవి
* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కుర్రా వెంకట చలపతి రావు
* లైన్ ప్రొడ్యూసర్: సందీప్ యడ్లపల్లి
ప్రసార వివరాలు:
ఈ రోజు నుండి.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు మీ ఈటీవీలో….

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

Next Post

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

Next Post
“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

"రోమాంచకం" సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు - హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

by Maari
August 31, 2026
0

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

by Maari
August 31, 2026
0

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

by Maari
August 31, 2026
0

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

by Maari
August 31, 2026
0

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

by Maari
August 31, 2026
0

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

by Maari
August 30, 2026
0

మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

by Maari
August 30, 2026
0

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

by Maari
August 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.