సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేతుల మీదుగా “పురుషః” చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్ అంటూ వరుసగా ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది,స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ క్యాప్షన్స్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుష:’ చిత్రయూనిట్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ క్రమంలో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ పాత్రల స్వభావం, వాటి తీరుని ప్రతిబింబించేలా పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్ మీద ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ ఉన్న కంటెంట్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ ఓదెల “పురుషః” చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌లతో పాటుగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా రానున్న ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఆద్యంతం అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
నటీనటులు : పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్,రాజీవ్ కనకాల తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్










