ఆది సాయికుమార్ చాలా కాలంగా సరైన కథ… కథనం ఉన్న సినిమా పడకపోవడంతో ఇండస్ట్రీలో ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదట లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్నా… ఆ తరువాత డిఫరెంట్ జోనర్లను టచ్ చేసి తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. అయితే ఆ ఇమేజ్ కు తగ్గట్టు మూవీ చాలా కాలంగా రాలేదు. అందుకే చాలా కాలంగా వేచి చూసి… ఇప్పుడు పూర్తిగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూపర్ నాచురల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి.
కథ: వెయ్యేళ్ల చరిత్ర వున్న ‘శంబాల’ అనే గ్రామంలో ఒక రోజు ఆకాశం నుంచి ఓ పెద్ద ఉల్క పడుతుంది. ఖగోళంలో జరిగే ఇలాంటి విషయాల గురించి తెలియని ఆ అమాయక గ్రామప్రజలు దాన్ని భూతంగా అనుమానిస్తారు. వారి అనుమానం ప్రకారమే… ఆ ఉల్కపడినప్పటి నుంచి ఆ గ్రామంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూవుంటాయి. దాంతో ఆగ్రామంలో అసలు నిజాలు తెలుసుకోవడానికి విక్రమ్(ఆది సాయికుమార్) బయలుదేరుతాడు. ఆ గ్రామంలో పడిన ఉల్క శకలానికి… ఆ గ్రామంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలకు ఏమైనా సంబంధం వుందా? అసలు నిజానిజాలను విక్రమ్ ఎలా నిగ్గు తేల్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇలాంటి సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ మూవీస్ ఈ మధ్య తెలుగులో వచ్చింది చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఇలాంటి స్టోరీస్ ఎక్కువగా హాలీవుడ్ లో తెరకెక్కుతుంటాయి. ఎప్పుడో ఒకసారి వచ్చే ఇలాంటి సినిమాలకు మన తెలుగు ప్రేక్షకులూ అట్రాక్ట్ అవుతుంటారు. ఇలాంటి అరుదైన సబ్జెక్ట్ ఇక నేరుగా తెలుగులో వస్తే ఆదరించకుండా వుంటారా? మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సూపర్ నాచురల్ చిత్రం ఆది సాయికుమార్ కు మంచి కంబ్యాక్ మూవీనే అని చెప్పొచ్చు. ఎక్కడా బోరింగ్ లేకుండా కథ.. కథనాలను నడిపించడానికి డైరెక్టర్ యుగంధర్ తీసుకున్న కేరింగ్ చాలా ఎగ్జైటింగ్ గా వుంటుంది. ముఖ్కంగా ప్రీ ఇంటర్వెల్… పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ సినిమాకి మంచి ఆయువుపట్టుగా నిలిచాయి.
ఆది సాయికుమార్ చాలా సెటిల్డ్ గా నటించారు. గ్రామంలో జరిగే సంఘటనల వెనుక వున్న మిస్టరీని ఛేదించడంలో అతని చూపించిన నటన ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. ఈ సమయంలో ఆదిసాయికుమార్ ఇలాంటి ప్లాట్ సినిమా పడటం నిజంగా లక్కీనే అని చెప్పొచ్చు. దాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకేనేమో ఈ సినిమాని తన భుజస్కంధాలపై వేసుకుని మాగ్జిమం ప్రోమోషన్స్ ను చేసి… ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేయగలిగారు. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ లో బాగా బజ్ తెచ్చుకున్న మినిమం బడ్జెట్ మూవీల్లో ‘శంబాల’ ఒకటని చెప్పొచ్చు. ఇందులో ఆది సాయికుమార్ కు జంటగా నటించిన హీరోయిన్ అర్చనా అయ్యర్ అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. రవి వర్మ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హర్ష వర్దన్ కూడా తన పరిధి మేరకు నటించి మెప్పించారు. మీసాల లక్ష్మణ్ పాత్ర కూడా మెప్పిస్తుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు యుగంధర్ ముని… ఈ సినిమాను సూపర్ నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాలని భావించి… అందుకు తగ్గట్టుగా ఎంచుకున్న ప్లాట్… దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆడియన్స్ ను ఎంగేజింగ్ చేస్తుంది. ఈ సినిమాతో యుగంధర్ కి మంచి భవిష్యత్ ఉంటుందనే చెప్పొచ్చు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సాంగ్ కూడా వర్కవుట్ అయింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా గ్రిప్పింగ్ గా వుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు నిర్మాతలు మహిధర్, రాజశేఖర్ శక్తి మేరకు ఖర్చుచేసి సినిమాను ఎంతో క్వాలిటీగా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్..
రేటింగ్: 3.25










