ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం షణ్ముఖ. ఈ చిత్రానికి షణ్ముగం సప్పాని దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. డివోషనల్ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన ఆది సాయికుమార్… చాలా కాలం తరువాత ఓ ఫీల్ గుడ్ డివోషనల్ సినిమాతో వచ్చారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: షణ్ముఖ (ఆరు తలల వ్యక్తి ) ఆరు తలలతో వింతగా వికృతంగా పుడతాడు. అతన్ని మాములు మనిషిగా అందంగా చేయడానికి అతని తండ్రి ఉగాండ(చిరాగ్ జానీ) క్షుద్ర దేవతలను పూజిస్తుంటాడు. అంతేకాదు తాంత్రిక పూజలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన ఆరు రాశుల్లో పుట్టిన అమ్మాయిల రక్తంతో షణ్ముఖుడిని సూర్య గ్రహణం వచ్చే అమావాస్య రోజున రక్త తర్పణం చేస్తే తన కుమారుడు మాములు మనిషి అవుతాడని… దాంతో పాటు ఈ ఆరుగురు అమ్మాయిల రక్త తర్పణం తర్వాత నవగ్రహాలు ప్రత్యేక స్థానంలో ఉండగా పుట్టిన ఓ అమ్మాయి క్లీంకార(అవికా గోర్) పేరుతో పుట్టిన అమ్మాయి రక్తంతో చివర్లో షణ్ముఖుడికి తర్పణమిస్తే.. అతను అందగాడు నిత్య యవ్వనుడు అవుతాడని తాంత్రికులు చెప్పగా.. షణ్ముఖ తండ్రి ఆరు ప్రత్యేక రాశుల్లో పుట్టిన అమ్మాయిలను వెతికి పట్టుకొస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. మరోవైపు ఇంట్లో మిస్సింగ్ అయిన అమ్మాయిల కేసును సూర్య (ఆది సాయికుమార్) టేకప్ చేస్తాడు. అతనికి సారా అలియాస్ క్లింకార (అవికా గోర్) ఎలా సహాయ పడింది. మరి షణ్ముఖుడు మాములు మనిషి కావడానికి షణ్ముఖ తండ్రి కిడ్నాప్ చేసిన ఆ ఆరుగురు అమ్మాయిలను సూర్య ఎలా రక్షించాడు అనేదే మిగతా స్టోరీ.
సినిమా ఎలా వుందంటే…
ఆది సాయికుమార్ చాలా కాలం తరువాతో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో నటించారని ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రచారం చేస్తూ వచ్చారు. డివోషనల్ థ్రిల్లర్ గా ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్… సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేయగలిగారు. దానికి తోడు సంచలన సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అనగానే… ఇందులో నేపథ్య సంగీతానికి ఇక అవధులు వుండని.. సినిమాపై మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ రోజు ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైంది. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం వమ్ము చేయకుండా ఈ సినిమా వుందా అంటే… దాదాపు వుందనే చెప్పొచ్చు.
దర్శకుడు షణ్ముగం సప్పాని తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా డీవియేట్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. మనం నిత్యం ఎక్కడో ఒక చోట పుట్టిన శిశువు వింత ఆకారంలో వున్నాడనో లేదా రెండు తలలతోను పుట్టాడనో, నాలుగు చేతులతో జన్మించాడనో, రెండు గుండెలతో పుట్టారనో ఎక్కడో ఒక చోట నుంచి న్యూస్ వస్తూనే వుంటుంది. అలాంటి వాటిని బేస్ చేసుకుని… దాని చుట్టూ రాసుకున్న తాంత్రిక పూజలు, క్షుద్రపూజలు, నక్షత్రాలు, తాయిత్తులూ వగైరా మూడ నమ్మకాలతో స్క్రీన్ ప్లేను రాసుకుని కథను నడిపించిన విధానం ఆడియన్స్ ను బాగానే సీట్ లో కూర్చొబెట్టారు దర్శకుడు.
నక్షత్రాలు.. గ్రహ కూటమి ఆధారంగా కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలను బలి ఇస్తే వికృతంగా వింతగా పుట్టిన షణ్ముఖుడిని మాములు మనిషి చేయాలన్న తండ్రి తాపత్రయం పక్కన పెడితే.. హార్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుందనే చెప్పాలి. ఇందులో క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు పూజలు విషయంలో దర్శకుడు కేర్ బాగా తీసుకుని తెరకెక్కించారని అర్థం అవుతోంది. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి.
ఆదిసాయికుమార్ చాలా కాలం తరువాత ఓ మంచి మాస్ లుక్ లో కనిపించారు. ఇందులో చాలా సెటిల్డ్ గా కనిపించి మెప్పించారు. అతనికి జోడీగా నటించిన అవికాగోర్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. రొమాంటిక్ సీన్స్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. చిరాగ్ జానీ కూడా రౌద్ర రూపం బాగా చూపించారు. మనోజ్ నందన్ పాత్ర పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ఎంచుకున్న కథ… కథనం గ్రిప్పింగ్ గా వుంది. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి కావాల్సిన అన్నీ ఇందులో వున్నాయి. దీనికి తోడు రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలిపింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్ గా నిర్మించారు. ఈవారం డివోషనల్ థ్రిల్ కావాలంటే ఈ సినిమాను ఓసారి చూసేయండి.
రేటింగ్: 3