• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, August 25, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

శింగనమల రమేష్…మా పెట్టుబడితో “కొమరంపులి, ఖలేజా” సినిమాలను తీసి. మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు

ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి భర్త సదానంద్

Maari by Maari
February 8, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
శింగనమల రమేష్…మా పెట్టుబడితో “కొమరంపులి, ఖలేజా” సినిమాలను తీసి. మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు

Share and Enjoy !

Shares
Twitter

ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి శింగనమల రమేష్ బాబు చెప్పినవన్నీ అబద్దాలు, అవాస్తవాలు

మా పెట్టుబడితో “కొమరంపులి, ఖలేజా” సినిమాలను తీసి. మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు

మాతో పాటు ఇంకెందరో బాధితులు ఉన్నారు

ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు శింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి

హైదరాబాద్ సివిల్ కోర్టులో అతనిపై కేసు నడుస్తోంది

క్రిమినల్ కేసు పై హైకోర్టులో అప్పీల్ కు సీఐడీ తో పాటు మేము కూడా వెళ్ళబోతున్నాం.

మాకు న్యాయం జరిగేవరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం.

శింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తులపై అతని బాధితులందరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని కలుస్తాం

ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి, ఆమె తరపున భర్త సదానంద్ ప్రెస్ మీట్

“కొమరంపులి, ఖలేజా” చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు మేము ఎంతదూరమైనా పోరాటం చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి తరపున ఆమె భర్త సదానంద్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సదానంద్ మాట్లాడుతూ, శింగనమల రమేష్ బాబు పచ్చి మోసగాడు అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ లో శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని మరీ అన్నీ అబద్దాలు చెప్పారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని, ఆ పెట్టుబడితో “కొమరంపులి, ఖలేజా” సినిమాలను తీసి, తాను నష్టపోయాను అని అతను అవాస్తవాలు చెప్పారు. అంతేకాదు ఆ రెండు సినిమాల షూటింగులు జరిగేటప్పడు, సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి, లొకేషన్స్ లో కూర్చునేవారు. దాంతో షూటింగులు చేసేందుకు హీరోలు, ఆరిస్టులు ఎలా వస్తారు. శింగనమల రమేష్ బాబు తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లనే ఆ రెండు సినిమాల షూటింగులు ఆలస్యం అయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్స్ వల్ల కానేకాదు. వారివల్ల నష్టపోయినట్లు అతను ఆరోపించడంతో ఎంతమాత్రం వాస్తవం లేదు. అతను స్వయంకృతాపరాధంతో సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి.కళ్యాణ్ గారు సినిమాలను రిలీజ్ చేశారు.

సినిమాల రిలీజ్ తర్వాత మేము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వమని శింగనమల రమేష్ బాబును అడిగితే,… అతని రౌడీ గ్యాంగ్ తో పాటు భానుకిరణ్,, అతనికి చెందిన గ్యాంగ్ నా తలపై తుపాకి గురిపెట్టి చంపివేస్తాం అంటూ బెదిరించారు. దాంతో అప్పట్లో మేము హైదరాబాద్ సీసీఎస్ లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూరి చనిపోయిన తర్వాత సీసీఎస్ లో మేము పెట్టిన కేసును సీఐడీకి బదిలీ చేయడం జరిగింది.

శింగనమల రమేష్ బాబు తదితరులపై మేము పెట్టిన కేసును నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవల జనవరి 31వ తేదీన కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు దానిపై సీఐడీ వారితోపాటు మేము కూడా తెలంగాణ హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళబోతున్నాం. అయితే దీనిపై శింగనమల రమేష్ బాబు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన అంశాలలో మా కేసులోనే స్థలాలను ముగ్గురికి అమ్మినాను అని చెప్పి, ఫలానా వ్యక్తి తనపై కేసు పెట్టినట్లుగా ఆయన చెప్పడంతో పాటు ఆ కేసులో నేను గెలిచాను అని అతను చెప్పినారు.

వాస్తవానికి మాకే కాదు ప్రొద్దుటూరుకు చెందిన ఇంకెందరో ఫైనాన్సియర్స్ దగ్గర సినిమాల కోసం శింగనమల రమేష్ బాబు ఫైనాన్స్ తీసుకుని వారందరికీ జవాబు చెప్పకుండా ఎగ్గొట్టి, తిరుగుతున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయల మేర డబ్బులు అతను ఇవ్వాల్సిన బాధితులు ఉన్నారు. ఫైనాన్సియర్స్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై లలో అతను కుటుంబ సభ్యులు, ఇతర బినామీల మీద ఆస్తులు పెంచుకుని, ఫైనాన్సియర్స్ ను మోసం చేసి, అడిగినవారిని చంపేస్తామంటూ బెదిరించారు. ఐఇతని అరాచకాలపై క్రిమినల్ కేసుపై సీఐడీ తో పాటు మేము కూడా హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళబోతున్నాం.. అలాగే హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాం. అలాగే మాకు న్యాయం జరిగేంతవరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. మిగతా బాదితులందరినీ కలుపుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎంను కలిసి అన్ని విషయాలను వివరిస్తాం.

ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి, ఆమె తరపున భర్త సదానంద్*

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు

Next Post

‘ఒక పథకం ప్రకారం’ సినిమాను చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు… సక్సెస్ మీట్‌లో హీరో సాయి రామ్ శంకర్

Next Post
‘ఒక పథకం ప్రకారం’ సినిమాను చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు… సక్సెస్ మీట్‌లో హీరో సాయి రామ్ శంకర్

'ఒక పథకం ప్రకారం' సినిమాను చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు... సక్సెస్ మీట్‌లో హీరో సాయి రామ్ శంకర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

by Maari
August 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.