• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల

admin by admin
September 18, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ తో ‘మ్యాడ్’ గ్యాంగ్ పునరాగమనాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

– సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ ని సరికొత్తగా పరిచయం చేసిన చిత్ర బృందం
– సెప్టెంబర్ 20న ‘మ్యాడ్ స్క్వేర్‌’ నుంచి మొదటి గీతం విడుదల

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, వైభవంగా ప్రారంభ వేడుకను నిర్వహించింది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఒక తీపికబురు చెప్పారు. ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ తీపి కబురుని తెలపడమే కాకుండా, సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్‌’ పోస్టర్ ను చూడగానే ‘మ్యాడ్’ అభిమానులు ప్రేమలో పడిపోతారు అనడంలో సందేహం లేదు.

మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేశారు.

అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.

శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

‘మ్యాడ్’ కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

మ్యాడ్ స్క్వేర్:

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్

రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవ నాగవంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు : నవీన్ నూలి
ఛాయాగ్రహణం : షామ్‌దత్
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్

Sithara Entertainments announce the big comeback of MAD gang with MAD MAXX Entertainment with First Look

Sithara Entertainments, the leading production house of Telugu Cinema, has delivered a huge blockbuster with MAD, previous year. The movie starring young actors like Narne Nithin, Ram Nithin and Sangeeth Shoban surprised everyone with its hilarious unadulterated MAD content.

The team has announced sequel to the blockbuster movie, MAD Square, few months ago with a grand opening ceremony. Now, the first single from the MAD Maxx Entertainer is gearing up for release on 20th September.

Announcing this big news, the team released a poster with the MAD gang of boys in traditional attire. The poster showcases their attitude and style in a different manner from the first one but in a likeable and adorable way.

Songs composed by Bheems Ceciroleo became huge chartbusters for the first one and makers promise another chartbuster album with the second too.

Writer-director Kalyan Shankar has once again treated this sequel in similar unadulterated way like the first one say makers. They promise everyone who liked the first one to love the second one even better.

Haarika Suryadevara and Sai Soujanya are producing the film on Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, along with Srikara Studios. Suryadeva Naga Vamsi is presenting the movie.

Ace Cinematographer Shamdat Sainudeen is back behind the camera while National Award winning editor Navin Nooli is editing the film. More details to be announced soon.

MAD SQUARE

Starring: Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin

Written And Directed By: Kalyan Shankar
Presenter: S. Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music : Bheems Ceciroleo
Editor : Navin Nooli
DOP : Shamdat
Production Designer: Sri Nagendra Tangala
Pro: Lakshmivenugopal
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios

Previous Post

కాశీనగర్-1947 భక్తిరస చిత్రాన్ని ఆదరించాలి  – రిటైర్డ్ డిజిపి డా. సి.యన్.గోపీనాథ రెడ్డి

Next Post

Deccan Film Daily Digital Edition -19-09-2024

Next Post
Deccan Film Daily Digital Edition -19-09-2024

Deccan Film Daily Digital Edition -19-09-2024

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.