• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, June 26, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

Maari by Maari
April 21, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా,
యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ చిత్రానికి మురళీకృష్ణ మన్యం ఎడిటర్ గా పని చేయగా రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు. బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల చిత్ర డైలాగులు లిఖించారు. దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్, కిష్కింధపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా “సూర్య బి పాజిటివ్” అనే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నటుడు బలగం సత్యా మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నన్ను సంప్రదించి నాకోసం నా వరకు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. నాపై నమ్మకంతో నాతో సరికొత్త క్యారెక్టర్ చేయించిన ఆ వ్యక్తి ఈ సినిమా హీరో చరణ్. నాతో చాలా బాగా నటించేలా చేశారు. చాలా మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, అందరూ ఈ సినిమాను ఆశీర్వదించలవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు రోహిత్ సత్యన్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కౌశిక్ పెగల్లపాటి గారికి, మురళీకాంత్ దేవసోత్ గారికి నా ధన్యవాదాలు. నేను 2017 నుండి చిత్ర పరిశ్రమలో పాత్రలు చేస్తూ ఉన్నాను. కాని ఈరోజు ఈ సినిమా వల్ల తొలిసారి స్టేజ్ పై మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని దాటుకుని ఇక్కడ వరకు వచ్చాను. నా వయసుకు మించిన క్యారెక్టర్ నాతో దర్శకులు చేయించారు, అది నాకు ఛాలెంజ్ గా నిలిచింది. ఆయన కొన్ని కారణాల వల్ల అమెరికాలో ఉన్నారు. ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఎప్పుడూ ప్రోత్సప్రోత్సహిస్తూనే ఉంటారు, మా సినిమాను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి సుజాత మాట్లాడుతూ… “సూర్య బి పాజిటివ్ చిత్ర తొలి వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఇద్దరు దర్శకులకు ధన్యవాదాలు. సాధారణంగా నేను చాలా గట్టిగా మాట్లాడే మనిషిని, కానీ ఈ చిత్రంలో నా పాత్ర చాలా సైలెంట్. నేను ఇప్పటివరకు నటించిన పాత్రలలో ఎక్కువ డైలాగులు ఉండేవి కాని ఈ సినిమాలో నా కళ్ళతో నటించేలా చేశారు. నా పాత్రకు, నాకు పూర్తిగా వ్యతిరేకం. సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. సినిమా టీజర్ చాలా బావుంది. సినిమాలో చరణ్ చాలా బాగా నటించారు. మన చుట్టు పక్కల ప్రాంతాలలో మనం చూసే ఒక సాధారణ కథను సినిమాగా మీ ముందుకు తీసుకుని రాబోతున్నాము” అన్నారు.

నటి దివ్య విశ్వకర్మ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను ఈ రోజు ఒక తెలుగు సినిమాలో నటించి ఈ స్టేజిపై నిలబడడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. నా భాష కానప్పటికీ నన్ను ఆదరించి, నాకు అవకాశం ఇచ్చినందుకుగాను ఆనందంతో పొంగిపోతున్నాను. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో నటించిన నటీనటులు, టెక్నికల్ టీం నాకు చాలా సాయం చేశారు” అన్నారు.

నటి యానీ డయానా మాట్లాడుతూ… “మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి థాంక్స్. మా దర్శకునికి, నటినటులకు, సాంకేతిక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా చిత్ర టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా తొలి సినిమా. అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు చరణ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఒక కొత్త సినిమా చేసేటప్పుడు ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలిసి, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ కష్టాన్ని మర్చిపోకుండా మరొక కొత్త సినిమా వస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించే దశగా మా సినిమాకు సపోర్టుగా వచ్చిన దర్శకులు కౌశిక్ పెగల్లపాటి గారికి, మురళీకాంత్ దేవసోత్ గారికి రుణపడి ఉంటాను. మా దర్శకులు అమెరికాలో ఉంటారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. మా నిర్మాత ఆయన ఎన్ని సంవత్సరాల కష్టాన్ని మాపై నమ్మకంతో ఈ సినిమాపై పెట్టారు. నా పేరు చరణ్, నేను ఒక నటుడుని. నన్ను నేను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నాను. మా సినిమా టీజర్ మీకు నచ్చుతుంది. నటుడిగా గుర్తింపు పొందాలంటే అర్హత ఉండాలని నేను భావిస్తున్నాను. గతంలో ఎంతో పెద్దవారికి అటువంటి అర్హతను ప్రేక్షకులు ఇచ్చారు. నేను ఆ అర్హతను అడుగుతున్నాను. నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా, కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది నాలుగవ సినిమా, ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ ఆగిపోను, ముందుకు వెళ్ళిపోతాను. నన్ను అవమానించిన పర్లేదు, భవిష్యత్తులో సత్కారంగా మారుతుందని నమ్ముతున్నాను. నాకు నటుడిగా అర్హత ఇవ్వమని మరోసారి కోరుకుంటున్నాను” అన్నారు.

లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ… “ఈ సినిమాకు నేను పాటల రాయడానికి గల కారణం సంగీత దర్శకులు గ్యాని. ఈ సినిమాలో పాటలకు మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డారు, మంచి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమంలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. దర్శకులు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ నాకు ఇన్పుట్స్ ఇవ్వడంతో పాటలు చాలా బాగా వచ్చాయి. పాటలు త్వరలో రాబోతున్నాయి, సినిమాను కూడా మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దండోరా చిత్ర దర్శకులు మురళికాంత్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చినప్పుడు వీరు చేసిన కష్టం గురించి తెలుసుకున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సినిమా చేయడం చాలా కష్టమైన విషయం. నేను నా సినిమా చేసేప్పుడు అవి అన్నీ చూసాను. ప్రేక్షకులు అంతా సినిమాను ఓటీటీలో మంచి ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. ఈ చిత్రంలో నటించిన రోహిత్ సత్యన్ గారిని చూసి ఆశ్చర్యపోయాను. చిత్ర బృందం చిన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుండిపోయేలా చేశారు. సినిమాలో అవకాశం వచ్చిన మొదటిసారి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది అని అర్థమైన రోజున సినిమా బాగా చేస్తారు. సుబ్బ మాధవరపు గారు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి సినిమా చేశారు. అలా చేయడం నావల్ల కాలేదు, దానికి నేను ఆయనను అభినందిస్తున్నాను. డీఓపీ విజువల్స్ బావున్నాయి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కిష్కిందపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ సినిమా టీజర్ చూసినప్పుడు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మురళి గారు నా సీనియర్, అలాగే చరణ్ నా జూనియర్. మేమంతా ఒకటే కాలేజీ నుండి వచ్చాము. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. హీరో అవ్వడం అంత సులువు కాదు, ప్రేక్షకులు వారిని హీరోల చూసుకోవాలి. వారికి ఉన్న కష్టాలు మర్చిపోయి సినిమాలో హీరో గెలిచినప్పుడు తామే గెలిచినట్లు ఫీల్ అవ్వాలి. తెరపై చరణ్ గెలుపును చూసి ప్రేక్షకులు గెలిచినట్లు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో నా సీనియర్ మురళి అన్న, రమణ అన్న, విజయ్ అన్న చాలా నేర్పించారు. అమెరికా నుండి వచ్చి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసుకుని వెళ్లారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. రోహిత్ సత్య గారి పాత్ర చాలా బాగా అనిపించింది. సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటీనటులు :
చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ, రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు.

సాంకేతిక బృందం :
రచన, దర్శకత్వం : సుబ్బా మాధవరపు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల
డిఓపి : అరుణ్ కుమార్ పర్వతనేని
ఎడిటర్ : మురళీకృష్ణ మన్యం
మ్యూజిక్ డైరెక్టర్ : గ్యాని
లిరిసిస్ట్ : రాంబాబు గోసాల
టీజర్ ఎడిటర్ : రిషికేశ్వర్ యోగి
లైన్ ప్రొడ్యూసర్ : ఎం సందీప్ వర్మ
పి ఆర్ ఓ : సోమిశెట్టి నాగేశ్వరరావు(ఎస్ ఎన్ ఆర్)

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

Next Post

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Next Post
‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను - ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

by Maari
June 20, 2026
0

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

by Maari
June 19, 2026
0

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

by Maari
June 19, 2026
0

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

by Maari
June 15, 2026
0

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

by Maari
June 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.