డ్రగ్స్ కి నో చెప్పండి… మీ భవిష్యత్ ను… మీ జీవితాన్ని కాపాడుకోండి.. అనే నినాదంతో కదం తొక్కారు. యువ దర్శకుడు బి.సురేష్ పాణి. ఈయన రూపొందించిన యాడ్ ఫిల్మ్ గత జూన్ 26/2025న గద్దర్ అవార్డుల వేడుకలో “ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే” సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న 99రోజుల “ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ పోస్టర్ ను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో k.క్రాంతి కిరణ్ రెడ్డి,(జనప్రియ మేనేజింగ్ డైరెక్టర్) v.కమల్ కిషన్ (డైరెక్టర్ మార్కేటింగ్), N.సతీష్ కుమార్ cfo, తెలంగాణ ఈగల్ ఫోర్స్ అవేర్నెస్ వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ థియేట్రికల్ యాడ్ ప్రచారం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ప్రకటన ప్రజలలో బలమైన ప్రభావాన్ని సృష్టించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అనే సందేశాన్ని మరింత బలంగా చాటుతుంది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిలింలో నటించి, సపోర్టు చేసిన హీరోలు గోపీచంద్, అల్లరి నరేష్, నిఖిల్ సిద్ధార్థ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గార్లకు కృతజ్ఞతలు. ఈ యాడ్ ఫిలిం దర్శకత్వం బి.సురేష్ పాణి, స్పాన్సర్స్ జనప్రియ అప్ స్కేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మట్ట, మేనేజర్ వెంకట్రావు పెద్దపూడి, ఎడిటర్ కె.సి.బి హరి.డిఓపి బన్నీ..
కాగా ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్, మార్చి మొదటివారం నుండి తెలంగాణలోని అన్ని థియేటర్స్ లో ప్రద్శించనున్నారు.









