వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక మందన (Rashmika Mandanna)నేషనల్ వైడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో మెయిన్ లీడ్ లో ప్రయోగాత్మకంగా ఈ ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. నేషనల్ అవార్డ్ వస్తుంది ఈ సినిమాతో రష్మికకు అని భారీగా ప్రచారం చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ: భూమా(రష్మిక) హైదరాబాద్ లోని ఓ కాలేజీలో MA ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్(దీక్షిత్ శెట్టి) MSc కంప్యూటర్స్, దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) జాయిన్ అవుతారు. కాలేజీలో మొదటిరోజు ర్యాగింగ్ లో విక్రమ్ హీరో అయిపోవడంతో దుర్గ అతన్ని ఇష్టపడుతుంది. ఓ రోజు రాత్రి పూట రోడ్ మీద చిన్న యాక్సిడెంట్ విషయంలో మొదటిసారి భూమాని చూసి ఇష్టపడతాడు. ఇక అప్పట్నుంచి విక్రమ్ భూమా వెనకాలే తిరిగి దగ్గరవుతాడు. ఓసారి విక్రమ్ రూమ్ కి భూమా రావడంతో ఇద్దరూ దగ్గరవుతారు. ఆ తర్వాత ఈ వీళ్ళ ప్రేమ విషయం విక్రమ్ కాలేజీ అంతా తెలిసేలా చేయడంతో తనకు తెలియకుండానే భూమా విక్రమ్ ని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. విక్రమ్ భూమా నాది, ఏ అబ్బాయిలతో మాట్లాడొద్దు, కాలేజీ ఈవెంట్స్ లో పాల్గొనద్దు అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ భూమాకు నచ్చకపోయినా సైలెంట్ గా ఉంటుంది. ఒక రోజు విక్రమ్ భూమాని తన తల్లి(రోహిణి) దగ్గరికి తీసుకెళ్తే ఆమెలాగే తన జీవితం కూడా అయిపొతుందెమో అని ఫీల్ అవుతుంది. భూమా విక్రమ్ తల్లిని చూసి ఎందుకు షాక్ అయింది? అసలు భూమా విక్రమ్ ని నిజంగా ప్రేమిస్తుందా? విక్రమ్ – భూమా ఎలా విడిపోతారు? మధ్యలో భూమా తండ్రి(రావు రమేష్), దుర్గ కథేంటి అనేది మిగతా కథ.
కథనం – విశ్లేషణ: ప్రమోషన్స్ లో మాత్రం ఈ సినిమాని బాగా లేపారు. అసలు అమ్మాయిలు కచ్చితంగా చూడాలి, కొత్తగా ఉంటుంది, రష్మిక నేషనల్ అవార్డు కొడుతుంది అని హడావిడి చేసారు. అయితే సినిమాలో.. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, అతనితో ఇబ్బంది పడుతున్న గర్ల్ ఫ్రెండ్, అతన్ని ఎలా వదిలించుకుంది అనే ఓ కాంటెంపరరీ కథతో ఈ సినిమా సాగింది.
ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ పాత్రల పరిచయాలు, వీరిద్దరూ దగ్గరవడం, మెల్లిమెల్లిగా హీరోయిన్ కి హీరో కండిషన్స్ పెట్టడంతో బాగా ల్యాగ్ తో సాగుతుంది. స్లో నేరేషన్ తో నడిపించారు సినిమాని. ఇక సినిమాలో చాలా వరకు కథ కాలేజీలో జరుగుతుంది. అసలు అలాంటి కాలేజీ రియల్ లైఫ్ లో ఉండదేమో. అమ్మాయిలు అబ్బాయిల హాస్టల్స్ కి, అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్స్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడం, రాత్రుళ్ళు అక్కడే ఉండటం, కాలేజీలో కూడా జంటలు కలిసి తిరగడం లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో సాగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో విక్రమ్ ని భూమా ఎలా వదిలించుకుంది? దానికి విక్రమ్ ఏం చేసాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాలేజీలో స్టూడెంట్స్ అడల్ట్స్ వాళ్ళు ఎలాగైనా ఉంటారు అని భూమా తండ్రికి ప్రొఫెసర్(రాహుల్ రవీంద్రన్) మాట్లాడే మాటలు నేటి ఆధునిక యుగంలో యువత మసలుకుంటుంది అనేదానికి… తల్లిదండ్రులు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అనేదానికి అద్దం పడతాయి. రష్మిక సినిమా అంతా సైలెంట్ గానే ఉంటుంది. చివర్లో భూమా విక్రమ్ మీద ఫైర్ అయ్యే సీన్ హైలైట్.
కామెడీ వర్కౌట్ అయింది. హీరో తల్లి పాత్ర చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఎక్కువగానే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు అని చూపించారు. నాన్న కూడా కూతుర్ని పట్టించుకోడు, నాన్న సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రష్మిక పాత్ర… వన్ మ్యాన్ షో.
రష్మిక మందన్న ఓ సింపుల్ రెగ్యులర్ అమ్మాయి పాత్రలో బాగానే మెప్పించింది. కొన్ని సీన్స్ లో మాత్రం రష్మిక పర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. దీక్షిత్ శెట్టి నెగిటివ్ షేడ్స్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. అను ఇమ్మాన్యూల్ పాత్ర అప్పుడప్పుడు కనిపించి మెరిపిస్తుంది. సినిమాలో ఓ ప్రొఫెసర్ పాత్ర ఉంది. దానికి సందీప్ రెడ్డి, వెన్నెల కిషోర్.. ఇలా చాలా మందిని అనుకోని చివరకు తానే చేశాను అని, పాత్ర అదిరిపోతుంది అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆ ప్రొఫెసర్ పాత్ర అప్పుడప్పుడు వచ్చి మోటివేషన్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. రావు రమేష్, రోహిణి.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు ఒక్కసారి వినొచ్చు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ లో షార్ప్ ఎడిటింగ్ చేసి కట్ చేయాల్సింది. కాలేజీ లొకేషన్ ని కూడా మంచిగా పట్టుకున్నారు. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, అతనితో అమ్మాయి పడే ఇబ్బందులు అనే పాత కథని కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. Go and Watch it..!
Rating: 3.25










