• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, September 5, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘తెల్లకాగితం’ ఓ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను – టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

Maari by Maari
September 5, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘తెల్లకాగితం’ ఓ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను – టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

Share and Enjoy !

Shares
Twitter

* ‘తెల్లకాగితం’ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి.. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకుండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి – డైరెక్ట‌ర్ బాబీ

* ప్రొడ‌క్ష‌న్‌, ప‌బ్లిసిటీని ప‌క్కాగా హ్యండిల్ చేసి ముందుకు తీసుకెళ్లే పర్‌ఫెక్ట్ ప్రొడ్యూస‌ర్ కృష్ణ‌గారు చేసిన ‘తెల్ల‌కాగితం’ బాగా ఆడాలని కోరుకుంటున్నాను – బివిఎస్ రవి

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. అక్టోబ‌ర్‌2న మూవీ రిలీజ్ అవుతుంది. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. నక్ష‌త్ర హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్ర‌మంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రోజున రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా భాను బోగ‌వ‌ర‌పు, సినిమాటోగ్రాఫ‌ర్ కెవి.గుహ‌న్‌, న‌టుడు అజ‌య్‌, నందు, రామ్ అబ్బ‌రాజు, బెక్కెం వేణుగోపాల్‌, బివిఎస్‌.ర‌వి, ఈటీవీ విన్ సాయికృష్ణ‌, హ‌ర్ష్ రోష‌న్‌, న‌క్ష‌త్ర‌, శ్రావ్య‌, డైరెక్ట‌ర్ ర‌మేష్ బండ్రెడ్డి స‌హా ఇత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘జీవితంలో తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తుంటారనే విషయాన్నే ఈ సినిమాతో చెప్పాల‌నుకున్నారు. అదే తెల్ల కాగితం మీద ఎర్ర మ‌చ్చ ప‌డితే ఎలా ఉంటుంద‌నేదే క‌థ‌. అదే ఈ సినిమా. తెల్ల‌కాగితం మూవీ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరి. కొత్త బంగారు లోకం తీసిన‌ప్పుడు నేనెగైతే ఫీల‌య్యాను. అలాగే వీళ్లు 2000 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌ను ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీగా రూపొందించారు. హ‌ర్ష్ రోష‌న్‌, న‌క్ష‌త్ర‌.. మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్‌..న‌లుగురు మ‌ధ్య న‌డిచే క‌థ‌. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్ముతున్నాను.ఎందుకంటే ఆ క‌థ‌లో అమాయ‌క‌త్వాన్ని నందు అందంగా రాస్తే, ర‌మేష్ చ‌క్క‌గా తీశాడు. గుహ‌న్ అద్భుత‌మైన విజువ‌ల్స్‌గా చెప్పాడు. విజ‌య్ సౌండ్ రూపంలో ఆవిష్క‌రించాడు. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి క‌నెక్ట్ అయ్యే సినిమా. అజ‌య్ ఇందులో తండ్రి పాత్ర‌ను చేశాడు. రోష‌న్ బ్ర‌ద‌ర్ పాత్ర‌లో ర‌ఘురాం.. ఇలా స్టోరీలో చాలా ఇన్వాల్ అయ్యే పాత్ర‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇప్పుడున్న జ‌నరేష‌న్ తెల్ల‌టి జీవితంపై ఎర్ర మ‌చ్చ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌నేదే ఈ క‌థ‌. నిర్మాత కృష్ణ‌తో నాకు ఇర‌వైయేళ్ల జ‌ర్నీ. ఈ సినిమాకు అన్నీ ర‌కాలుగా వెనుకుండి స‌క్సెస్ వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేస్తుంటాం. కృష్ణ‌కు, టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

డైరెక్ట‌ర్ బాబీ మాట్లాడుతూ ‘‘ఈ తెల్ల‌కాగితం సినిమా నిర్మాత కృష్ణ‌గారు, స్టోరీ, మాట‌లు అందించిన నందుతో ఉన్న అనుబంధం వ‌ల్ల ఈవెంట్‌కు వ‌చ్చాను. ఈ క‌థ నాకు షూటింగ్ కంటే ముందే వినిపించారు. దిల్ రాజుగారు చెప్పిన‌ట్లు ఇదొక ఇన్నోసెంట్ ల‌వ్ స్టోరీ. ఇందులో చాలా లేయ‌ర్స్ ఉన్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అజ‌య్‌గారు చాలా మంచి పాత్ర చేశారు. రోష‌న్ మంచి సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగ‌మ్మాయి న‌క్ష‌త్ర‌కు వెల్‌క‌మ్‌. ర‌మేష్ బండ్రెడ్డి తొలి ప్ర‌య‌త్నంలో మంచి ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. విజ‌య్ బుల్గానిన్ మ్యూజిక్‌తో మెప్పించాడు. కోర్ట్ త‌ర్వాత నాకు ఆ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. కృష్ణ‌గారు.. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

బివిఎస్ ర‌వి మాట్లాడుతూ ‘‘తెల్ల కాగితం క‌థ గురించి నేను చాలా రోజులుగా వింటూ వ‌స్తున్నాను. సాయికృష్ణ అయితే ఈ క‌థ‌ను మ‌న‌మే చేయాల‌ని చెప్పేవాడు. ఎట్ట‌కేల‌కు ఆ మూవీని కృష్ణ‌గారు స్టార్ట్ చేయ‌టం.. క్ర‌మ‌శిక్ష‌ణ‌, మంచి ఫ్యూచ‌ర్ ఉన్న న‌టుడు హ‌ర్ష్ రోష‌న్ ఈ సినిమాలో న‌టించ‌టం.. తెలుగ‌మ్మాయి న‌క్ష‌త్ర ఇందులో క‌థానాయిగా క‌నిపించ‌నుంది. క‌చ్చితంగా సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇంత మందికి న‌చ్చిన క‌థ‌..ఇంత మంది చేయాల‌నుకున్న క‌థ‌..ఎంతో మందికి న‌చ్చే క‌థ అవుతుంది. విజ‌య్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ ర‌మేష్ తొలి సినిమాగా ల‌వ్ స్టోరీని డైరెక్ట్ చేశాడు. త‌ను కూడా త్రివిక్ర‌మ్‌, సుకుమార్‌లాగా పెద్ద డైరెక్ట‌ర్ కావాలని కోరుకుంటున్నాను. కృష్ణ‌గారు 20-25 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంటున్నారు. ఇండ‌స్ట్రీలో పూర్తి అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లో నేను జ‌వాన్ సినిమా చేశాను. శ‌త‌మానం భ‌వ‌తి సినిమా ప్రొడ‌క్ష‌న్ అంతా ఆయ‌నే చూసుకున్నాడు. అలాగే దాన‌య్య‌గారి సినిమాల‌కు వ‌ర్క్ చేశాడు. ప్రొడ‌క్ష‌న్‌ను, ప‌బ్లిసిటీని క‌రెక్ట్‌గా హ్యండిల్ చేసి ముందుకు తీసుకెళ్లే ప‌ర్‌ఫెక్ట్ ప్రొడ్యూస‌ర్ కృష్ణ‌గారు. అలాంటి నిర్మాత చేసిన సినిమా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాను. చాలా పెద్ద ప్రొడ్యూస‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ర‌ఘురాం మాట్లాడుతూ ‘‘రోషన్‌తో ఇది నా రెండో సినిమా. ఇందులోనూ నేను బ్ర‌ద‌ర్ రోల్ చేస్తున్నాను. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. మా టీమ్‌కు విష్ చేయ‌టానికి వ‌చ్చిన నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఇంత మంచి అవ‌కాశాన్ని నాకు ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

న‌టుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఇందులో నేను మావ‌య్య పాత్ర‌లో క‌నిపిస్తాను. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే పాత్ర‌. అక్టోబ‌ర్ 2న అంద‌రం థియేట‌ర్స్‌లో క‌లుసుకుందాం’’ అన్నారు.

న‌టుడు అజ‌య్ మాట్లాడుతూ ‘‘నిర్మాత కృష్ణ‌గారి కోసం సినిమా ఆడుతుంది. నాకు పోకిరి కంటే ముందే ప‌రిచ‌యం. ఈ సినిమాతో పెద్ద స‌క్సెస్ అవుతుంది. ఇందులో మెడిక‌ల్ షాప్ మూర్తి అనే ఎమోష‌న‌ల్ పాత్ర చేశాను. నాకెంతో ద‌గ్గ‌రైన పాత్ర‌. రాము, ఆశ పాత్ర‌ల్లో ఇండే అమాయ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. నందుగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. ఈ సినిమాను నేను బాగా సెల‌బ్రేట్ చేసుకుంటాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ రామ్ అబ్బ‌రాజు మాట్లాడుతూ ‘‘నందు చాలా మంచి స్టోరీ ఇచ్చాడు. నేను సినిమా చూశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కంటెంట్ ప‌రంగా.. విజువ‌ల్‌గా సినిమా ఆక‌ట్టుకుంటుంది. ర‌మేష్ నాద‌గ్గ‌ర సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమాకు వ‌ర్క్ చేశాడు. డైరెక్ట‌ర్‌గా త‌న‌కిది తొలి మూవీ. అజ‌య్‌గారు స‌ర్ప్రైజ్ రోల్‌లో క‌నిపిస్తారు. ఆయ‌న‌కొక కొత్త గ్రాఫ్ రెడీ అవుతుంది. రోషన్ అద‌ర‌గొట్లాడు. త‌నింకా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. న‌క్ష‌త్ర కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

భాను బోగ‌వ‌ర‌పు మాట్లాడుతూ ‘‘నందు ఈ క‌థ‌ను ముందు నాకే చెప్పాడు. నెక్ట్స్ లెవ‌ల్ క‌థ‌. డ‌బ్బులుండుంటే నేనే ప్రొడ్యూస్ చేసుండేవాడిని. ఈ సినిమాకు ప‌ని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ నిర్మాత కృష్ణ‌గారి మీద ప్రేమ‌తో చేశారు. ర‌మేష్ బండ్రెడ్డి.. తొలి సినిమాను చాలా సెన్సిటివ్‌గా తెర‌కెక్కించాడు. విజ‌య్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ అందించాడు. రోష‌న్‌, న‌క్ష‌త్ర చాలా లైవ్‌లీగా న‌టించారు’’ అన్నారు.

రైట‌ర్ నందు స‌విరిగాన మాట్లాడుతూ ‘‘పేపర్లో ఓ ఆర్టిక‌ల్ చ‌దివిన‌ప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు అప్పుడు ఇండ‌స్ట్రీకి వ‌స్తాన‌ని, రైట‌ర్ అవుతాన‌ని తెలియ‌దు. అయితే నేను రైట‌ర్ అయిన త‌ర్వాత ఆ ఇన్సిడెంట్‌ను తీసుకుని మంచి మెసేజ్‌తో సినిమా చేయాల‌నిపించి దాన్నుంచి వ‌చ్చిందే ఈ తెల్ల కాగితం సినిమా. రిలేట‌బులిటీ, జెన్యూనిటీ ఉన్న క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. అలాంటి క‌థే ఇది. ఇందులో ప్ర‌తీ పాత్ర మ‌న‌కు క‌నెక్ట్ అవుతుంటుంది.. క‌థ‌లోని జెన్యూనిటీ మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తుంటుంది. హ‌ర్ష్ రోష‌న్‌..ను ఈ క‌థ‌కు లాక్ చేశాం. క‌థే రోష‌న్‌ను హీరోగా పెట్టి ముందుకు న‌డిపించింది. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్ వ‌స్తుంది. మ‌న లోక‌ల్ క‌థ కాబ‌ట్టి న‌క్ష‌త్ర‌ను తీసుకున్నాం. త‌ను చాలా ఇన్నోసెంట్‌గా ఇంపాక్ట్ చేసి యాక్ట్ చేసింది. దీప‌క్‌.. శ్రావ్య ఫ్రెండ్స్ పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. రాజ్‌కుమార్ క‌సిరెడ్డిగారు ఇందులో రేలంగి మావ‌య్య పాత్ర‌లాంటి రోల్‌లో క‌నిపించారు. ర‌ఘురాంగారు నేచుర‌ల్‌గా న‌టించారు. కోర్ట్ సినిమా త‌ర్వాత శివాజీగారిని ఎలాగైతే గుర్తు పెట్టుకున్నారో..తెల్ల‌కాగితం త‌ర్వాత అజ‌య్‌గారిని అలాగా గుర్తు పెట్టుకుంటారు. కృష్ణ‌గారిని ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత తెల్ల కాగితం కృష్ణ అని పిలుస్తారు. ఈ సినిమా క‌థ‌ను న‌మ్మి ప్రొడ్యూస్ చేసిన ఆయ‌న‌కు ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావాలి. అలాగే డైరెక్ట‌ర్ ర‌మేష్ ఈ కథ‌ను న‌మ్మి నాలుగేళ్లు జ‌ర్నీ చేశాడు. త‌న‌కోసం ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావాలి. త‌ను ఈ సినిమాతో పెద్ద డైరెక్ట‌ర్‌గా అడుగు పెట్ట‌బోతున్నాడు’’ అన్నారు.

బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత పెద్ద హిట్ కావాల‌నుకుంటాం. అలాగే కృష్ణ‌గారు కూడా చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెల్ల కాగితం సినిమా చేశారు. ఈ సినిమాతో ఆయ‌న అతి పెద్ద హిట్ కొట్ట‌బోతున్నారు. త‌న‌కు కంగ్రాట్స్‌. రోష‌న్‌కు కోర్ట్ పెద్ద హిట్ అయితే.. తెల్ల‌కాగితంతో త‌నొక స్టార్ కాబోతున్నాడు. చాలా కాలం పాటు ఈ ల‌వ్ స్టోరీ గుర్తుండిపోతుంది. ఎంటైర్ టీమ్‌కు ఈ సినిమా ఓ ఇంటిపేరుగా మారుతుంది. ఈ క‌థ‌తో నేను చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్నాను. అక్టోబ‌ర్ 2న వ‌స్తోన్న ఈ సినిమా టీమ్‌ను ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

న‌క్ష‌త్ర మాట్లాడుతూ ‘‘మా తెల్ల కాగితం సినిమాకు అందరూ రిలేట్ అవుతారు. మీ జీవితాల్లో రోజూ చూసేలా సినిమా ఉంటుంది. అంద‌రికీ టీజ‌ర్ న‌చ్చిఉంటుంద‌నిపిస్తుంది. అక్టోబ‌ర్ 2న మా సినిమాను చూసి స‌పోర్ట్ చేస్తార‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.

హర్ష్ రోషన్ మాట్లాడుతూ ‘‘అందరూ ఇలా ఇక్క‌డ‌కు వ‌చ్చి మా సినిమా గురించి ఇంత సపోర్ట్ చేస్తుంటే.. మా సినిమాని ఇంత బ్లెస్ చేస్తుంటే… ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళడానికి చాలా భయమేస్తున్నప్పుడు నాన్న చేయి పట్టుకొని తీసుకెళ్తే ఎంత ధైర్యంగా ఉంటదో, వీళ్ళందరూ మా సినిమా గురించి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు అంత ధైర్యంగా ఉంది.దిల్‌రాజు గారికి, బి.ఎస్. రవి గారికి, మా డైరెక్టర్ గారు స‌హా అందరికీ ధన్యవాదాలు. ఇక ‘తెల్లకాగితం’ విషయానికి వస్తే… ఇదొక‌ సినిమా మాత్ర‌మే కాదండి..ఓ మంచి ఫీలింగ్. తెల్ల కాగితం అంటే ఏదో ఈ రాము కథో లేదా ఆశా కథో, లేకపోతే ఇంకెవరో స్నేహితుల కథో అని అనుకుంటారు. కానీ ఇది మనందరి కథ. పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. తెల్లకాయితం అనేది ఒక ప్యూర్, ఇన్నోసెంట్ మరియు ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమాని చూడండి అని చెప్పడం కంటే, ఈ సినిమాని ఫీల్ అవ్వండి అని చెప్పడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నాకు తెలిసి నేను ఇప్పుడే చేయగలుగుతాను. మళ్ళీ ఈ ఏజ్ దాటితే ఈ సంవత్సరంలోనో, వచ్చే సంవత్సరంలోనో లేదా ఇంకెప్పుడూ చేయలేను. ఇలాంటి కథ నాకు ఎప్పుడు రావాలో కరెక్ట్ టైమ్‌లో వచ్చింది. ఇలాంటి కథను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు మనం చూస్తాం, కొన్ని సినిమాలు మనం గుర్తుపెట్టుకుంటాం, మరికొన్ని సినిమాలు మనం ఫీల్ అవుతాం…‘తెల్ల కాగితం’ సినిమా అచ్చంగా అలాంటి ఫీలింగ్ ఇచ్చే సినిమానే. నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మాట అయితే చెప్పగలను… అక్టోబర్ 2న‌ మీరు సినిమా చూసి బయటకి వచ్చినప్పుడు, ఒక అద్భుతమైన ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఇది నా ప్రామిస్. ఒక ‘7G బృందావన్ కాలనీ’, ఒక ‘ప్రేమిస్తే’… ఆ కోవకు చెందినదే మన ‘తెల్లకాగితం’. మీ అందరికీ టీజర్ నచ్చిందనుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ర‌మేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ ‘‘మన అందరి జీవితాల్లో కొన్ని దశలుంటాయి. అయితే అందరూ మా తెల్ల కాగితం దశను దాటే వచ్చుంటారు. మా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంద‌రూ రిలేట్ అవుతారు. సాంగ్స్ స‌హా అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ తీశామ‌ని న‌మ్ముతున్నాం.. ప్రేక్ష‌కులు కూడా బ్లాక్ బస్ట‌ర్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర, అజయ్, దీపక్, శ్రావ్య తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
దర్శకత్వం : రమేష్ బండ్రెడ్డి
నిర్మాత : కృష్ణ కొమ్మాలపాటి
కథ, స్క్రీన్‌ప్లే, మాట‌లు : నందు సవిరిగాన
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.వి. గుహన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
కో-డైరెక్టర్: రమేష్ బోనం
పిఆర్ఒ: వంశీ కాకా
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

Next Post

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam) సక్సెస్ మీట్

Next Post
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam)  సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam) సక్సెస్ మీట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam)  సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam) సక్సెస్ మీట్

by Maari
September 5, 2026
0

‘తెల్లకాగితం’ ఓ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను – టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

‘తెల్లకాగితం’ ఓ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను – టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

by Maari
September 5, 2026
0

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

by Maari
September 5, 2026
0

విశ్వక్ సేన్ నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’(Legacy) విడుదల తేదీ ఖరారు

విశ్వక్ సేన్ నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’(Legacy) విడుదల తేదీ ఖరారు

by Maari
September 5, 2026
0

‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

by Maari
September 5, 2026
0

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

by Maari
September 5, 2026
0

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

by Maari
September 5, 2026
0

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

by Maari
September 4, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.