• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘సారంగపాణి జాతకం’ నుంచి థీమ్ సాంగ్ విడుదల

admin by admin
April 24, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘సారంగపాణి జాతకం’ నుంచి థీమ్ సాంగ్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను
చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను‘ … అంటూ ‘సారంగపాణి జాతకం’ నుంచి థీమ్ సాంగ్ విడుదల

మల్లేశం, బలగం, 35, కోర్ట్ … ఇలా వరుస విజయాలతో ప్రియదర్శి దూసుకుపోతోన్నారు. ప్రియదర్శి హీరోగా, రూపా కొడవయూర్ హీరోయిన్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. బుధవారం నాడు టీం అంతా కూడా విజయవాడలో సందడి చేసింది. ‘సారంగపాణి జాతకం’ టీం దుర్గమ్మని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంది. రేపు వైజాగ్ లో హంగామా చేయబోతున్నారు. వైజాగ్ లో ప్రీమియర్ షో కూడా ప్లాన్ చేశారు.
ఇక ఇదే ఊపులో ‘సారంగపాణి జాతకం’ నుంచి స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కథ ఏంటో చెప్పేలా సాగే ఈ ‘సారంగపాణి జాతకం’ థీమ్ పాట ప్రస్తుతం శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

‘‘తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను
చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను

తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను
ఏదోటి చూస్తానే ఉంటది
చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను
వద్దన్నా కంటపడతనంటది

ఎవ్రిడే
కష్టమూ నష్టమూ సోది
సొంత లైఫు లోన ఉండనే ఉంది
చుట్టుపక్క తయ్యతక్క చూసి
కాస్త నవ్వుకుంటే నష్టమేమిటుంది

హో జిందగీ కామెడీ సంత
పిచ్చ కామెడీనే భూప్రపంచమంతా
అంతా’‘….
అంటూ సాగే ఈ ‘సారంగపాణి జాతకం’ థీమ్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్‌కు రామ్ మిర్యాల గాత్రం మరింత ఆకర్షణగా నిలిచింది. ‘సారంగపాణి జాతకం’ సినిమా ఎలా ఉంటుందో ఈ ఒక్క పాటలోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటతో సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ కలగేజేసే ప్రయత్నం చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘సారంగపాణి జాతకం’ ఆడియో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ‘సారంగపాణి జాతకం’ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థం అవుతోంది. ప్రియదర్శితో పాటుగా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి వారంతా నవ్వించబోతోన్నారు. ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా రూప కొడువయూర్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

నటీనటులు : ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీదేవీ మూవీస్
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకుడు : మోహనకృష్ణ ఇంద్రగంటి
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్
కెమెరామెన్ : పీజీ విందా
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

Tags: PriyadarshiTheme Song out from Sarangapani
Previous Post

ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

Next Post

ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సోదరా”

Next Post
ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సోదరా”

ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సోదరా"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“కలివి వనం” చిత్ర పోస్టర్ విడుదల

“కలివి వనం” చిత్ర పోస్టర్ విడుదల

by admin
May 19, 2025
0

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

by admin
May 17, 2025
0

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
May 17, 2025
0

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

by admin
May 14, 2025
0

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

by admin
May 12, 2025
0

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.