• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, March 8, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వాస్తవ ఘటనల… తెప్పసముద్రం

Maari by Maari
April 19, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Reviews, special
0
వాస్తవ ఘటనల… తెప్పసముద్రం

Share and Enjoy !

Shares
Twitter

వాస్తవ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు వెండితెరమీద ఆవిష్కరింపబడ్డాయి. అయితే వాటికి సినిమాటిక్ లిబర్టీతో స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించడంతో అవి కాసుల వర్షం కురిపించాయి. ఇలాంటి నేపథ్యంతో తెరకెక్కిందే… తెప్ప సముద్రం. తెలంగాణాలోని హాజీపూర్ సంఘటన ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. ఆగ్రామానికి చెందిన ఓ మెకానిక్… విద్యార్థినులను నమ్మంచి… వారిని ఎంత దారుణంగా చంపారో… అప్పట్లో సంచలనం రేపింది. అలాంటి సంఘటనను మెయిన్ ప్లాట్ గా తీసుకుని… దాని చుట్టూ రాసుకున్న కథ… కథనాలతో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ చిత్రానికి రాపోలు సతీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ‘బిగ్ బాస్’ ఫేం అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించారు. యువ హీరో చైతన్య రావు ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ సంగీతం అందించారు. మరి ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్… ఆడియన్స్ ను ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: తెప్ప సముద్రం అనే గ్రామం… ఆ ఊళ్లో చదువుకునే చిన్నారులు ఒక్కొక్కరూ మాయమవుతూ ఉంటారు. అలా ఊళ్లో ఉన్న పిల్లలు, నేత్ర ఫౌండేషన్ తో సంబంధం ఉన్న చిన్నారులు సైతం కనిపించకుండా పోతారు. అదే గ్రామంలో విశ్వనాథ్ అనే టీచర్ కం లాయర్ (రవిశంకర్) ఉంటారు. అతని కుమారుడు గణేష్(చైతన్య రావు)… ఈ మిస్సింగ్ వెనుక ఎవరున్నారనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ఊరికి ట్రాన్స్ ఫర్ అయి వస్తారు. అదే గ్రామంలో విజయ్(అర్జున్ అంబటి), ఇందు(కిశోర్ దాత్రిక్) ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే… ఇందును ఎస్.ఐ.గణేష్ కూడా ఇష్టపడతారు. ఇలా ఓ వైపు అదృశ్యమవుతున్న బాలికల కేసు ఓ వైపు… ఇందును ప్రేమలో దించడానికి నానా తంటాలు పడే తపన మరోవైపు కలిగివున్న గణేష్… చివరకు రెండింటిలోనూ సక్సెస్ అయ్యారా? విజయ్, ఇందుల ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుందనేదే మిగత కథ.

కథ… కథనం విశ్లేషణ: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగే స్క్రీన్ ప్లేను ఇంట్రెస్టింగ్ గా రాసుకోగలితే… అలాంటి సినిమాల విజయాలకు కొదువేమీ ఉండదు. ఇలాంటి కథ… కథనాలతో నడిచే సినిమానే ‘తెప్పసముద్రం’. అనగనగా ఓ ఊరు… ఆ ఊళ్లో అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా అత్యాచాలకు పాల్పడే సైకో… చివరకు అతనిని అంతమొదించడం… ఇలాంటి కథకు అనేక ట్విస్టులు ఇచ్చి… స్క్రీన్ ప్లేను చాలా ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు. చివరి వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకులు ఓ పట్టాన కన్ ఫర్మేషన్ కు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని ఆసక్తికరంగా ఆవిష్కరించారు. దాంతో ఆడియన్ ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసి… ద్వితీయార్థం అంతా ట్విస్టులతో సినిమాని భలే ఎంగేజ్ చేశారు దర్శకుడు సతీష్. తను అనుకున్న కథను యాజ్ టీజ్ గా తెరమీద చూపించారు. హాజీపూర్ సంఘటనలాంటి వాస్తవ సంఘటను కొంత బేస్… చేసుకున్నా… అందులో వచ్చే మలుపులు ఆడియన్స్ ను బాగా థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఇందులోనే ఓ సోషియల్ మెసేజ్ కూడా ఇచ్చారు దర్శకుడు. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. గో అండ్ వాచ్.

ఇందులో ఆటోడ్రైవర్ గా, హీరోయిన్ అవర్ గా విజయ్ పాత్రలో నటించిన అర్జున్ అంబటి తన నటనతో ఆకట్టుకున్నారు. డ్యాన్సులు కూడా బాగానే చేశారు. అతనికి జోడీగా నటించిన కిశోరి దాత్రిక్ కూడా తన పరిధిమేరకు నటించి మెప్పించింది. ఇందులో విలన్ పాత్రలో గజాగా నటించిన చైతన్య దాత్రిక్ కూతురే ఈ అమ్మాయి కావడం విశేషం. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఇందులో నటించడం ఆసక్తికరం. యువనటుడు చైతన్య రావు ఇందులో కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు. బహుశ ఇతను కేరీర్ లో ఇలాంటి పాత్రను పోషించలేదనే చెప్పొచ్చు. అతని తండ్రి పాత్రలో రవిశంకర్… లాయర్ విశ్వనాథ్ గా చాలా బరువైన పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. అతనికి భార్యగా నటించిన ఆమె కూడా బాగానే నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

ఓ రియల్ ఇన్స్ డెంట్ స్టోరీస్ ను బేస్ చేసుకుని దర్శకుడు సతీష్ రాపోలు రాసుకున్న ఓ వైవిధ్యమైన కథ ఇది. దీనికి మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేను రాసుకుని సినిమాను తెరకెక్కించారు. ఆద్యంతం మలుపులతో ఆడియన్స్ ను థ్రిల్ గురిచేశారు. సినిమాటోగ్రీఫి పర్వాలేదు. ద్వితీయార్థంలో విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంగీతం బాగుంది. పాటలు మాస్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి మంచి థ్రిల్లర్ మూవీ ఇది. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“హలో బేబీ” సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Next Post

ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ… టెనెంట్

Next Post
ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ… టెనెంట్

ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ… టెనెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.