• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, May 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

Maari by Maari
April 16, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

Share and Enjoy !

Shares
Twitter

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రేపు (ఈ నెల 17న) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మొదటి నుంచి “తిమ్మరాజుపల్లి టీవీ” కంటెంట్ ను బిలీవ్ చేశాను. ఒక చిన్న పాయింట్ తో మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. అందుకే బిజినెస్ డీల్స్ కోసం కూడా హడావుడి పడలేదు. రీసెంట్ గా ఓటీటీ వాళ్లు చూసి సినిమా నచ్చి తీసుకున్నారు. మా చిన్న చిత్రానికి ఒక పెద్ద స్క్రీన్ మీద ప్రివ్యూ వేశాం. మా మూవీలో నటించిన కాస్ట్ అండ్ క్రూ వారి కుటుంబ సభ్యులతో సినిమా చూసి ఎంజాయ్ చేశారు. నేను మొదట్లో ఎలాంటి సంతోషాన్ని పొందానో, ఈ కొత్త వాళ్లందరిలో అలాంటి సంతోషం కనిపించింది. వాళ్లందరిలో నన్ను నేను చూసుకున్నాను. “తిమ్మరాజుపల్లి టీవీ” లాంటి మూవీకి టికెట్ బుక్ చేసుకుని థియేటర్స్ లో చూడాలా, టీవీలో చూడాలా అనే సందేహాలు ఉంటాయి. వారిని ఎగ్జైట్ చేసేందుకే మూవీలో చిన్న మాస్ స్టఫ్ ఉంటుంది, ఎనర్జీ వైబ్ ఉంటుందని రివీల్ చేశాను. ఇంకా మరికొంత మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ప్రొడ్యూసర్ గా జర్నీ ఇలాగే కొనసాగిస్తాను. సెన్సార్ వాళ్లు చిన్న చిన్నకట్స్ చెప్పారు. అవి సరిచేసి మళ్లీ సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నాం. లేట్ అవడం వల్లే ప్రీమియర్స్ వేయలేకపోతున్నాం. రేపు డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. వ్యక్తిగతంగా నాకు మా ఊరితో చాలా అనుబంధం ఉంది. ఈ సినిమా విషయంలో మ్యాజిక్ జరిగింది. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాం. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు మీ ఊరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. లొకేషన్స్, క్యారెక్టర్స్ , ఎమోషన్స్ అన్నీ సహజంగా అనిపిస్తాయి. అందుకే మా మూవీని మీ అమ్మా నాన్నతో, మీ గ్రాండ్ పేరెంట్స్ తో చూడండని చెబుతూ వస్తున్నాం. మీరు మూవీ చూస్తున్నప్పుడు వంశీకాంత్ మ్యూజిక్ మిమ్మల్నిహాంట్ చేస్తుంది. అక్షయ్ రామ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇంత టాలెంట్ ఉన్న వాళ్లు అవకాశాలు లేక వెయిట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వారిలో పదీ పదిహేను మందికి సాలిడ్ గా అవకాశాలు వస్తాయి. అన్నారు.

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ప్రివ్యూను అతి పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మొదటి సినిమా దర్శకుడిగా స్క్రీన్ మీద నా పేరు చూసుకోవడం కూడా ఎగ్జైట్ చేసింది. నా సినిమాను చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంగేజ్ అవడం, మూవీ వాళ్లందరికీ నచ్చడం ఎంతో సంతృప్తి కలిగించింది. కిరణ్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక మంచి జ్ఞాపకాలతో వస్తారు. మూవీలో ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లతో పాటు టెక్నికల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటారు. మా ఊరివాళ్లు కొందరు సినిమా చూసి వారి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. ఇది మా ఊరు మాత్రమే కాదు ప్రతి ఊరి వాళ్లు తమ జ్ఞాపకాలు రీకాల్ చేసుకునే సినిమా. అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – నేను గతేడాది ఎఫ్ 1 సినిమాను ప్రసాద్ పీసీఎక్స్ లో చూశాను. అంత పెద్ద స్క్రీన్ మీద నేను హీరోగా నటించిన సినిమా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది కలా నిజమా అనిపించింది. మా అందరికీ ఇలాంటి ఎక్సిపీరియన్స్ ఇస్తున్న కిరణ్ అన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అన్నారు.

డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – సినిమా చూసిన వాళ్లందరి దగ్గర నుంచి విజువల్స్ బాగున్నాయనే ప్రశంసలు వస్తున్నాయి. కుప్పం ప్రాంతాలను చాలా అందంగా చూపించారని అంటున్నారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ విజువల్ పరంగా ఒక పెయింటింగ్ లా ఉందని చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అన్నారు.

నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా అంతా మ్యాజిక్ లా అనిపిస్తోంది. రేపు స్క్రీన్ మీద మా సినిమా చూస్తున్నవారికి కూడా ఆ మ్యాజిక్ ఫీలవుతారు. అలా మూవీ అంతా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడిని జాతరకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అన్నారు.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
————-
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రిన్స్ నటించిన ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ ట్రైలర్ లాంచ్

Next Post

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

Next Post
Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

by Maari
May 7, 2026
0

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

by Maari
May 7, 2026
0

‘అగధ’ టీజర్ విడుదల

‘అగధ’ టీజర్ విడుదల

by Maari
May 7, 2026
0

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
May 6, 2026
0

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

by Maari
May 6, 2026
0

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

by Maari
May 6, 2026
0

అమెజాన్ ప్రైమ్ లో మరియు  ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

by Maari
May 4, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.