• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘టిల్లు స్క్వేర్’ సెన్సార్ పూర్తి… మార్చి 29న మూవీ విడుదల

Maari by Maari
March 22, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
‘టిల్లు స్క్వేర్’ సెన్సార్ పూర్తి… మార్చి 29న మూవీ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

‘డీజే టిల్లు’ చిత్రంతో ‘టిల్లు’గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న “టిల్లు స్క్వేర్” కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటనతోనే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘రాధిక’, ‘టికెటే కొనకుండా’, ‘ఓ మై లిల్లీ’ పాటలతో పాటు ఇతర ప్రచార చిత్రాలు విడుదలై సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు, ఆద్యంతం వినోదభరితంగా ఉండే చిత్రాన్ని అందించడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని వారు ఎంతగానో ఆస్వాదించారు. ముఖ్యంగా టిల్లు పాత్ర, అతను పలికే సంభాషణలు వారిని ఎంతగానో అలరించాయి.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి “యు/ఎ” సర్టిఫికేట్ ఇచ్చింది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ‘డీజే టిల్లు’ను మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. “టిల్లు” అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆమె తన కెరీర్‌లో తొలిసారిగా “లిల్లీ” అనే బోల్డ్ క్యారెక్టర్‌ను పోషించింది. ఇప్పటికే ఆమె పాత్రకి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడే అందరూ “లిల్లీ” పాత్రను “రాధిక” పాత్రతో పోల్చడం ప్రారంభించారు. అయితే ఈ రెండు పాత్రలు భిన్నమైనవని, లిల్లీతో టిల్లు ప్రయాణం కూడా విభిన్నంగా ఉంటుందని, థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని మరియు రెట్టింపు మజాని అందిస్తామని మేకర్స్ చెప్పారు.

సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి కథనం, సంభాషణలు అందించగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరిచారు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించారు. టిల్లు యొక్క “డబుల్ ధమాకా” ఎంటర్‌టైనర్ టిల్లూ స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments’ highly anticipated Tillu Square completes censor formalities with U/A

Siddhu Jonnalagadda has risen to huge fame with “DJ Tillu” as “Tillu”. The film has acquired such cult following that the young audiences and movie-lovers are eagerly waiting for the sequel, “Tillu Square” . Since, the announcement of the film, the buzz for the movie has been sky-high and with singles like “Radhika”, “Ticket eh Konakunda” and “Oh My Lilly”, the anticipation is at it’s all-time high.

Now, the makers have completed the censor formalities and started promoting the film in full swing. Censor officials after watching the movie did praise the young team’s efforts for the laugh riot. Apparently, they have enjoyed “Tillu” mannersims, his typical one-liners and frustration filled “monologues” to the core.

Censor board has given “U/A” certification to the film. Makers are extremely confident that Tillu Square will repeat DJ Tillu success and stated that they have taken their time in making the film to give a thorough entertainer that will be liked by all sections of audiences along with “Tillu” fans.

Anupama Parameswaran is playing a bold character, “Lilly” for the first time in her career in this movie. Her looks and stills from the film have gone viral and people are starting to compare between highly popular “Radhika” character and “Lilly”. Makers clearly stated that both the characters are different and Tillu’s journey with Lilly will also be different offering “Double the entertainment” and “Double Maaza” in the theatres.

Mallik Ram has directed the film for the screenplay and dialogues written by Siddhu Jonnalagadda. Sai Prakash Ummadisingu has handled cinematography and Ram Miriyala, Achu Rajamani have composed music for the film. Bheems Ceciroleo has composed background score for it.

Suryadevara Naga Vamsi produced the film on Sithara Entertainments with Srikara Studios presenting it. Navin Nooli has edited the film. Gear up for Tillu’s “Double Dhamaka” entertainer Tillu Square releasing grandly worldwide on 29th March.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ప్రకృతిని కాపాడాలనే “లైన్ మ్యాన్”

Next Post

శ్రీ‌రంగ‌నీతులు… నుంచి “ఎక్క‌డ‌వుండాల‌ని.. ఎక్క‌డున్నావో.. ఏమీ అవుదామ‌ని…” లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

Next Post
శ్రీ‌రంగ‌నీతులు… నుంచి “ఎక్క‌డ‌వుండాల‌ని.. ఎక్క‌డున్నావో.. ఏమీ అవుదామ‌ని…” లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

శ్రీ‌రంగ‌నీతులు... నుంచి "ఎక్క‌డ‌వుండాల‌ని.. ఎక్క‌డున్నావో.. ఏమీ అవుదామ‌ని..." లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.