• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ప్రారంభమైన ‘ఇంద్రజాలం’

admin by admin
June 14, 2023
in Cinema, Movies
0
ఘనంగా ప్రారంభమైన ‘ఇంద్రజాలం’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శాసనసభ ద్వారా పరిచయం అయిన ఇంద్రసేన హీరోగా, జై క్రిష్‌ మరో ప్రధాన పాత్రలో పూర్ణాస్‌ మీడియా సమర్పణలో నిఖిల్‌ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. బుధవారం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఇంటర్నేషనల్‌ ఆర్టిట్రేషన్‌ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్‌. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేయడంతో సినిమా ప్రారంభమైంది.

అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఇంద్రసేన మాట్లాడుతూ…
నేను నటించిన శాసనసభ మూవీ గత డిసెంబర్‌లో విడుదలై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో చూసిన నిఖిల్‌గారు ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించారు. మధ్యలో కొన్ని కథలు విన్నప్పటికీ మంచి కథతో నా రెండో సినిమా రూపొందనుండడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

దర్శక, నిర్మాత నిఖిల్‌ మాట్లాడుతూ…
మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది నాకు తొలి ప్రాజెక్ట్‌. దాదాపు 8 సంవత్సరాల క్రితమే ఈ కథను అనుకున్నాను. అప్పటి నుంచి కథ మీద వర్క్‌ చేస్తున్నాం. ఈ ముహూర్తానికి సినిమా ప్రారంభించాలని నెల క్రితమే అనుకున్నాను. ది క్రైమ్‌ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఫస్ట్‌ నుంచీ ఫుల్‌ కామెడీ ఉంటుంది. శాసనసభ చిత్రం చూసిన తర్వాత ఇంద్రసేన గారైతే ఈ క్యారెక్టర్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతారని ఆయన్ను హీరోగా తీసుకున్నాం. మరో ప్రధాన పాత్రలో జై క్రిష్‌ నటిస్తున్నారు. మరికొన్ని ముఖ్యపాత్రలను సీనియర్‌ యాక్టర్స్‌ చేస్తారు. మంచి టీమ్‌ దొరికింది. ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారు. ఒకరిని మాత్రం 10రోజుల్లో రివీల్‌ చేస్తాం. మరొక హీరోయిన్‌ను చివరి వరకూ సస్పెన్స్‌గానే ఉంచుతాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుంది. ఒక షెడ్యూల్‌ బొంబాయిలో చేస్తాం. మరొకటి హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో చేస్తాం. జులై మూడో వారం నుంచి షూట్‌కు వెళతాం అన్నారు.

కో`ప్రొడ్యూసర్‌ మాట్లాడుతూ…
ఇది మాకు తొలి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌తో పాటు అన్ని అంశాలూ ఉంటాయి. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

నటుడు జై క్రిష్‌ మాట్లాడుతూ…
నేను ఇందులో ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. ఈ అవకాశం రావటానికి కారకులైన సంతోషం సురేష్‌ గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆశపడుతున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్‌ మాట్లాడుతూ…
ఈ సినిమాలో సంగీతానికి మంచి స్కోప్‌ ఉంది. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. నాలుగు సిట్యుయేషన్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. సంగీతాన్ని కొత్త తరహాలో, కొత్త పరికరాలతో చెన్నైలో చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు థ్రిల్‌ ఇస్తుంది. ఈ మూవీలో ఒక పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

న్యాయమూర్తి ఆర్‌. మాధవరావు గారు మాట్లాడుతూ…
నిఖిల్‌ గారు వచ్చి ఇలా సినిమా చేస్తున్నాను మీ ఆశీర్వాదం కావాలి అన్నారు. ముందుగా నేను హీరో ఎవరు అని అడగలేదు. పీఆర్వో ఎవరు అని అడిగాను. ఆయన సురేష్‌ కొండేటిగారు అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో సురేష్‌ కొండేటి గారు తిరుగులేని వ్యక్తి. నేను కూడా చాలా ఏళ్ల క్రితం ఒక సినిమా నిర్మించాను. ఆ కష్టాలు నాకు కూడా కొద్దిగా తెలుసు. నిఖిల్‌ గారి ఏ ధైర్యంతో సినిమా చేస్తున్నారు అని అడిగితే.. రెండు అక్షరాల ‘కథ’, మూడు అక్షరాల ‘సినిమా’ను నమ్మి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

డి.ఓ.పి.: అమర్‌ కుమార్‌, సంగీతం: ఎం.ఎం. కుమార్‌, ఎడిటర్‌: చంటి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: భైరవ ఈశ్వర్‌, పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, నిర్మాత, కోప్రొడ్యూసర్‌ పూర్ణ శైలజ, నిర్మాతదర్శకత్వం: నిఖిల్‌ కె. బాల.

Previous Post

హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడమే మా లక్ష్యం: నిర్మాత టి.జి.విశ్వప్రసాద్

Next Post

Namani Prashanth, also known as Uttara Prashanth on Screen Name, was born in Peddapalli, Karimnagar on October 11, 1994. He is a Tollywood actor best known for his work in Uttara films. He finished his education at Vani Vidya Vihar in Karimnagar.

Next Post

Namani Prashanth, also known as Uttara Prashanth on Screen Name, was born in Peddapalli, Karimnagar on October 11, 1994. He is a Tollywood actor best known for his work in Uttara films. He finished his education at Vani Vidya Vihar in Karimnagar.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.