• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, March 18, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

Maari by Maari
March 16, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

Share and Enjoy !

Shares
Twitter

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ‘గబ్బర్ సింగ్’ స్థాయి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ వేడుకకు హాజరైన అభిమానులకు, లైవ్ లో వేడుకను వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైనవి. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అని నేను ఎప్పుడూ పట్టించుకోను. సినిమా బాగుండాలని కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను.. భారతీయ సినిమా అనుకుంటాను నేను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంటుంది. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి నా కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా.. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాము. 40-45 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాము. రోజుకి ఐదారు గంటల లోపే పని చేశాను. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసాను ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే.. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. ఈ చిత్రానికి లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతఙ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకు, రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గారికి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి, నేపథ్య సంగీతం బాధ్యతలు తీసుకున్న తమన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పర్ఫార్మర్. శ్రీలీల గారి కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య పాత్రలు చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతఙ్ఞతలు. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో(అభిమానుల్లో) ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు. నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి అని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. అభిమానులకు, నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.” అన్నారు.

కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా ఈ సినిమా ఎందుకు ఆలస్యమైంది అనేది నేను మీతో పంచుకుంటాను. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాము. కాలేజ్ సమయంలో ఇగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్.. అదే ఇగోతో కాలేజ్ లో లెక్చరర్స్ గా జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. అందరూ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశాను అంటున్నారు. ఈ సినిమా ఆలస్యానికి నేనే కారణం, వేగంగా షూటింగ్ పూర్తి కావడానికీ నేనే కారణం. ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సినిమా కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కాలరే ఎత్తరా సాంగ్ కోసం మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్ వేశారు. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలుకథలుగా చెప్పుకున్నా.. రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి గారికి కృతఙ్ఞతలు. అలాగే మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవి శ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాము. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు. శ్రీలీల గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. అయితే ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నప్పుడు.. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చేశాము. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. ఆయన కటౌట్ ని మన అందరి గుండెల్లో పెట్టుకున్నాము. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం. ఉస్తాద్ ఉగాది జరుపుకుందాం.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “హరీష్ శంకర్ గారు నిజాయితీగా పని చేస్తారు. అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. హరీష్ శంకర్ గారు సరిగా నిద్ర కూడా పోకుండా ఒక యజ్ఞంలా ఈ సినిమా పూర్తి చేశారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి, ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మా హీరో పవన్ కళ్యాణ్ గారు.. పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు నేను. నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నా అని తెలిసి.. తమిళ, కన్నడ ఇలా సినిమా సెట్ కి వెళ్ళినా పవన్ గారి గురించి అడిగేవారు. ఆయనను చూసి చాలా చాలా నేర్చుకున్నాను. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం.. ఇలా ఎన్నో నేర్చుకున్నాను. పవన్ గారు సినిమాలు చేయడం అనేది సినిమాకి మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం.” అన్నారు.

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. నా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తో తెరను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. ఈ సినిమా గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది.” అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళ నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం. మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది. డిప్యూటీ సీఎం అయినా, ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా.. మాకు ఈ సినిమా చేసి పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూరిగా కృతఙ్ఞతలు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము అడగడానికి ఆలోచిస్తుంటే, మీ సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కావాలని అనుకున్నాను. గబ్బర్ సింగ్ ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఇది పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎంటర్టైనర్ సినిమా. మార్చి 19న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి, ఈ సినిమా కోసం హరీష్ శంకర్ గారు ఎంతో కష్టపడ్డారు. అభిమానులు మెచ్చేలా ఈ సినిమాని మలిచారు. మాకు ఇలాంటి గుర్తుండిపోయే సినిమాను చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదనే వెలితి మాకు ఉండేది. ఉస్తాద్ తో పరిపూర్ణంగా ఆ వెలితి తీరిపోయింది. సినిమా అవుట్ పుట్ చూసుకున్నాను. రిజల్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. ప్రజాసేవలో ఉండి కూడా ఈ సినిమాను పూర్తి చేశారు. రాత్రుళ్ళు నిద్రపోకుండా షూటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయన కష్టం ముందు మా అందరి కష్టం చాలా చిన్నది అనిపించింది. మేము ఎంతోమందిని చూసి ఉండొచ్చు, కానీ ఆయన చాలా ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ గారు మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇటీవల కొందరికి సాయం చేశారు. ఆయన కొన్నిరోజులు ప్రయాణం చేస్తే, నలుగురి సాయం చేయాలనే ఆలోచన మనంలో ఖచ్చితంగా కలుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ ఫిల్మ్. ప్రారంభం నుంచి చివరి దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక, అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. చిత్రం బృందంతో పాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

Next Post

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

Next Post
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రిలీజ్ కి ముందు “యూత్” సందడి..!

రిలీజ్ కి ముందు “యూత్” సందడి..!

by Maari
March 17, 2026
0

బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

by Maari
March 17, 2026
0

‘పిఠాపురంలో’  ‘మక్కుళు మక్కుళు కాలేజూ’ పాట విడుదల చేసిన  ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్

‘పిఠాపురంలో’ ‘మక్కుళు మక్కుళు కాలేజూ’ పాట విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్

by Maari
March 17, 2026
0

పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

by Maari
March 17, 2026
0

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

by Maari
March 16, 2026
0

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
March 16, 2026
0

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

by Maari
March 15, 2026
0

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

by Maari
March 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.