• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, May 19, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… కానిస్టేబుల్

Maari by Maari
October 11, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… కానిస్టేబుల్

Share and Enjoy !

Shares
Twitter

హ్యపీడేస్ సినిమాతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూనే వున్నారు ఈ యువ హీరో. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ క్రైం ఇన్వెస్టిగేటింగ్ స్టోరీతో ‘కానిస్టేబుల్’గా మన ముందుకు వచ్చారు. నిర్మాత బలగం జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా… ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి నటించగా… భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈవారం విడులైన సినిమాల్లో ఈ సినిమానే ఎంతో పాజిటివ్ వైబ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ: హైదరాబాద్ నగర శివారులో వున్న మోకిలా మండల పరిధిలోని శంకరపల్లి అనే చిన్న గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తుంటాయి. లింగ బేధం లేకుండా అతి కిరాతకంగా ఈ హత్యలను చేస్తుంటారు. దీని వెనుక వున్న హంతకులు ఎవరనేది గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఇది పోలీసులకు కూడా సవాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే అదే ఊరిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కాశీ(వరుణ్ సందేశ్) మేనకోడలు కీర్తి(నిత్యశ్రీ)ని చంపే దాకా వస్తుంది. దాంతో కానిస్టేబుల్ కాశీ అలర్ట్ అవుతాడు. ఈ హత్యల వెనుక ఎవరున్నారనే దానిపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. హంతకులు అని అనుమానించిన వారు కూడా చంపబడటంతో మరింత అయోమయానికి గురవుతాడు కానిస్టేబుల్. మరి కానిస్టేబుల్ అసలు హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి ఎన్వెస్టిగేషన్ చేశారు? అసలు హంతకులను ఎలా పట్టుకున్నాడు? వాళ్లు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? దాని వెనుకున్న కారణాలు ఏంటి? ఈ వరుస హత్యల వెనుకున్న పాత్రధారులను కానిస్టేబుల్ పట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైం థ్రిల్లర్ మూవీస్ కి మంచి ఆదరణ వుంది. పర్ ఫెక్ట్ స్టోరీ లైన్… ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో క్రైం థ్రిల్లర్ మూవీస్ ను తెరకెక్కిస్తే… ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. గ్రిప్పింగ్ గా మూవీని సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించి చాలా మంది దర్శకులు, నిర్మాతలు సక్సెస్ అయ్యారు. తాజాగా యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ క్రైం థ్రిల్లర్ మూవీ కూడా చాలా వైవిధ్యమైన కథ… కథనాలతో తెరకెక్కిందే. గతంలో ఇలాంటి ట్విస్టులున్న క్రైం థ్రిల్లర్ మూవీని వెండితెరపై చూసుండకపోవచ్చు. చివరి దాకా సస్పెన్షన్ ఫ్యాక్టర్ ను రివీల్ చేయకుండా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెట్టారు. ఇంటర్వెల్‌కి వచ్చే ట్విస్ట్‌ ఆడియన్స్ లో సెకెండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఆ తరువాత సెకండాఫ్ అంతా కూడా కేసుని ఛేదించే క్రమంలో కాశీ చేసే ప్రయత్నాలన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే అసలు దోషి ఎవరనేది రివీల్ చేసి ప్రేక్షకులు ఆశ్యర్యానికి గురయ్యేలా చేశాడు దర్శకుడు. గో అండ్ వాచ్ ఇట్.
ఇప్పటి దాకా లవర్ బోయ్గా… పక్కింటి కుర్రాడిగా కనిపించిన వరుణ్ సందేశ్… ఇందులో కానిస్టేబుల్‌గా కాశీ పాత్రలో కొత్తగా కనిపిస్తాడు. వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ అన్నీ కొత్తగా కనిపిస్తాయి. బాగుంటాయి. హీరోయిన్‌గా మధులిక వారణాసి పాత్ర కూడా బాగుంది. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. మిగిలిన పాత్రల్లో అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.
ఇలాంటి చిత్రాలకు సాంకేతిక బృందం సరిగ్గా సపోర్ట్ చేస్తే రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కానిస్టేబుల్ కోసం చేసిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా వుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ వుంది. నిర్మాత బలగం జగదీష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. చిత్ర నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. ఈ వారం ఈ ఇంట్రెస్టింగ్ క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఓ సారి చూసేయండి.

రేటింగ్: 3/5

Share and Enjoy !

Shares
Twitter
Tags: Conistable Movie Review RatingConistable Movie Telugu ReviewCrime Investigative ThrillerTelugu EntertainmentTollywood MovieVarun sandesh
Previous Post

మటన్ సూప్ రివ్యూ.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే

Next Post

విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభం

Next Post
విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభం

విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

by Maari
May 19, 2026
0

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

by Maari
May 19, 2026
0

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

by Maari
May 19, 2026
0

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

by Maari
May 17, 2026
0

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

by Maari
May 16, 2026
0

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

by Maari
May 16, 2026
0

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.