విక్యూబ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 100కి పైగా విద్యార్థులను ప్రశంసిస్తూ ఘనమైన అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి, వారి కృషిని విక్యూబ్ యాజమాన్యం ప్రశంసించింది.
ఈ కార్యక్రమానికి వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు, విద్యావేత్తలు, శిక్షణ నిపుణులు అయిన ఆకెళ్ల రాఘవేంద్ర, మోటివేషనల్ స్పీకర్స్ కృష్ణ చైతన్య, లోకేష్ అరకల, వంశీ, కుసుమ్ గంజి, బోరబండ చిన్న, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, యూట్యూబర్ వన్య రాజ్, సునీల్ సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ ఎక్సెలెన్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిరంతర అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్ట్ ఆధారిత నేర్పు ప్రాముఖ్యతను వివరించారు. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విక్యూబ్ శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ ప్రతిష్టాత్మక ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి విశేష విజయాలు సాధించారు. ఇందులో కొందరు విద్యార్థులు వార్షికంగా రూ.20 లక్షలు, రూ.18 లక్షలు, రూ.12.5 లక్షలు వంటి అత్యున్నత ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందగా, మరికొందరు రూ.9 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6.5 లక్షలు, రూ.6 లక్షలు వార్షిక వేతన ప్యాకేజీలతో తమ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ విజయాలు విద్యార్థుల నిరంతర కృషి, నైపుణ్యాల అభివృద్ధి మరియు వీస్యూబ్ అందించిన పరిశ్రమకు అనుగుణమైన శిక్షణకు నిదర్శనంగా నిలిచాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ అంకాల రావు మాట్లాడుతూ, నిర్మాణాత్మక శిక్షణ, నిబద్ధత కలిగిన అధ్యాపకులు, విద్యార్థులు రాణించాలనే సంకల్పం ఫలితంగానే నియామకాలు విజయవంతం అయ్యాయని చెప్పారు. బలమైన పునాదులు నిర్మించడం, రియల్-టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పోజర్, కెరీర్-ఆధారిత నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా విక్యూబ్ యొక్క లక్ష్యం నియామకాలకు మించి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. KPHBలో 10+ శాఖలతో విక్యూబ్ పనిచేస్తుందని, 10+ డిమాండ్ ఉన్న IT కోర్సులను అందిస్తుందని, నాణ్యమైన సాంకేతిక విద్యను ఈ ప్రాంతం అంతటా ఉన్న ఔత్సాహిక నిపుణులకు అందుబాటులోకి తెస్తుందని కూడా ఆయన హైలైట్ చేశారు.
విక్యూబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేయడమే లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని, వారి భవిష్యత్ ప్రయాణానికి ప్రేరణగా నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.










