* సెప్టెంబర్ 9నుంచి సీజన్ 1 పార్ట్ 2 ప్రారంభం
– ఇకపై ప్రతీ బుధవారం నుంచి 5 ఎపిసోడ్స్.. శుక్రవారం ట్రైలర్ విడుదల
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ZEE5లో ‘వీరభద్రుని రహస్యం’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రతీ శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతీ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ మొదటి సీజన్ పార్ట్1లో 30 ఎపిసోడ్స్ఆడియెన్స్‌ను అలరించాయి. వచ్చిన ప్రతీ ఎపిసోడ్‌కి అద్భుతమైన స్పందన దక్కుతోంది. ఈ తరుణంలో మొదటి సీజన్ పార్ట్ 1 పూర్తి కానుంది. ఇప్పటి వరకు 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను క్రాస్ చేయటం విశేషం.
https://zee5.onelink.me/RlQq/vy5prb9a
తాజాగా జీ5లో సీజన్ 1 పార్ట్ 2 సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు. దీనికి సంబంధించిన సరికొత్త ట్రైలర్ శుక్రవారం రిలీజ్ కానుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇక నుంచి పార్ట్ 2లో బుధవారం నుంచి ప్రతీ వారం 5 ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 90వ దశకంలోని బ్లాక్ బస్టర్ సీరియల్ ‘మర్మదేశం’కి రీ క్రియేషన్‌గా తీసిన ఈ సిరీస్ ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను చూసి నాగబాబు కూడా అభినందించారు. ఈ క్రమంలో
నాగబాబు మాట్లాడుతూ.. ‘ZEE5 సమర్ఫణలో కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ అద్భుతంగా ఉంది. ప్రతీ వారం కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయి. 90వ దశకంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మర్మదేశం’కి రీ క్రియేషన్‌లా ఈ సిరీస్ ఉంది. ఇంకా చూడని వాళ్లు ఉంటే వెంటనే చూసేయండి. అద్భుతంగా ఉంది’ అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కి మీడిగయా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ సిరీస్ అద్భుతంగా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
ఈ సిరీస్‌లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ డివోషనల్ మిస్టరీ వెబ్ సీరిస్‌కు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించారు. లాంగ్ ఫార్మాట్‌లో ఈ ఏడాది లెక్కల్ని చూసుకుంటే మోస్ట్ వాచ్డ్ షోగా ‘వీరభద్రుని రహస్యం’ నిలిచింది.










