• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, April 25, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే… ఫ్యామిలీ స్టార్

Maari by Maari
April 5, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే… ఫ్యామిలీ స్టార్

Share and Enjoy !

Shares
Twitter

దర్శకుడు పరశురామ్, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద విజయం దక్కించుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవటంతో ఫ్యామిలీ స్టార్ సినిమా పై కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి. ఈ సినిమాని తెరకెక్కించింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు కావటం తో అందరి దృష్టి ఫ్యామిలీ స్టార్ పై పడింది. విజయ్ గత సినిమా లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలితే…తర్వాత విడుదల అయినా ఖుషి సినిమా కూడా సో సో గానే నడిచింది అనే చెప్పాలి. దీంతో విజయ్ ఫ్యాన్స్ పరశురామ్, విజయ్ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనే ధీమాతో ఉన్న వేళ భారీ అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. టైటిల్ కు తగ్గట్లే హీరో విజయ్ ఫ్యామిలీ మ్యాన్. ఉమ్మడి కుటుంబం బాధ్యతలు అన్ని విజయ్ తన భుజాలపైనే మోస్తాడు. ప్రతి ఖర్చూ లెక్క వేసుకుని మరీ ముందుకు వెళుతుంటాడు. విజయ్ అన్న తాగుడుకు బానిస అయి కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోవటంతో ఈ భారం కూడా విజయ్ పైనే పడుతుంది.
ఒక రోజు సడెన్ గా విజయ్ ఇంట్లో ఉండే పెంట్ హౌస్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అద్దెకు దిగుతుంది. అక్కడ నుంచే విజయ్ ఫ్యామిలీ తో ఆమె బంధం కూడా బలపడుతుంది. కానీ ఒక్క సారిగా విజయ్, మృణాల్ ఠాకూర్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఎంతో బాగా కలిసిపోయిన వాళ్ళు ..అసలు మళ్ళీ జీవితం లో ఎప్పుడూ కలవరు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అన్నదే ఫ్యామిలీ స్టార్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు రొటీన్ కథలాగా స్లో గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ లో సినిమా ఇంకెన్ని మలుపులు ఉంటాయా అన్న ఆసక్తి పెరుగుతుంది. ఒక పుస్తకంతోనే ఈ సినిమా కథలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ పుస్తకం ఏమిటి..కథ అంతా దీని చుట్టూ ఎందుకు తిరిగింది అన్నదే ఫ్యామిలీ స్టార్ మూవీ.

ఒక అమ్మాయి ఒక అబ్బాయి కి ఐ లవ్ యు చెప్పింది అంటే అది ప్రేమించిన వాడికి మాత్రమే కాకుండా..ఆ ఫ్యామిలీ మొత్తానికి చెప్పినట్లు అంటూ విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ కి ఇచ్చే ప్రాధాన్యత చెప్పిస్తాడు డైరెక్టర్. మధ్య తరగతి కుటుంబ బాధ్యతలు మోసే పాత్రలో విజయ్ దేవరకొండ మంచి నటన కనపర్చారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమా అంతా కూడా ఎక్కువ భాగం హీరో, హీరోయిన్లకు తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కథ, కథనాల్లో ప్రేక్షకులకు పెద్దగా కొత్తదనం కనిపించదు. కాకపోతే ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకుని సినిమా ను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ కథ కావటంతో మహిళా ప్రేక్షకులకు సినిమా నచ్చే అవకాశం ఉంది. ప్రొమోషన్స్ లోనూ చిత్ర యూనిట్ ఇదే విషయంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మీద చూస్తే ఫ్యామిలీ స్టార్ ను ఓ సారి సరదాగా చూసేయొచ్చు.

రేటింగ్: 2.75

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

గత ముప్పై ఏళ్లుగా సుచిరిండియా ఫౌండేషన్ సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

Next Post

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో అశోక్ గల్లా కొత్త సినిమా…

Next Post
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో అశోక్ గల్లా కొత్త సినిమా…

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో అశోక్ గల్లా కొత్త సినిమా...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

by Maari
April 25, 2026
0

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

by Maari
April 25, 2026
0

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

by Maari
April 25, 2026
0

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

by Maari
April 25, 2026
0

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

by Maari
April 24, 2026
0

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

by Maari
April 23, 2026
0

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 22, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.