• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ

admin by admin
August 31, 2023
in Cinema, Movies, news
0
నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తన కొత్త సినిమా ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి డీటెయిల్డ్ గా చెప్పారు విజయ్. ఈ లైవ్ ఇంటర్వ్యూలో ఖుషి హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఖుషి జర్నీ గురించి మాట్లాడారు.

ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మంచి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తారు. అలా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తే సెట్ లో ఇబ్బందే ఉండదు. ఈ సినిమా ఫస్టాఫ్ లో నేను లవర్ బాయ్ లా కనిపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ బాయ్ గా కనిపిస్తా. నేను ఇప్పటిదాకా హజ్బెండ్ క్యారెక్టర్ చేయలేదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి

డైరెక్టర్ శివతో కనెక్ట్ అయ్యేందుకు నాకు ఓ నెల రోజుల టైమ్ పట్టింది. ఫస్ట్ ఏదైనా నచ్చుకుంటే బాగా లేదని ఓపెన్ గా చెప్పేవాడిని. అది చూసిన సమంత ..విజయ్ ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది..అలా ఫేస్ మీదే చెప్పకూడదు అని సజెస్ట్ చేసింది. శివ నేను కనెక్ట్ అయిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు.

ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.

ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను.

సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది.

తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.

నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. లైగర్ ఫ్లాప్ అయినప్పుడు నెక్ట్ మూవీ హిట్ కొట్టాలి అన్నా అనేవారు. వాళ్ల ముఖాల్లో సంతోషం చూసేందుకు ఖుషితో హిట్ కొట్టబోతున్నాం.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసేందుకు నా ఫ్రెండ్స్ తో కలిసి యూసుఫ్ గూడలో ఓ థియేటర్ కు వెళ్లా. అప్పటికి నేను ఎవరికీ తెలియదు. నా సీన్స్ వచ్చేటప్పుడు ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేయడం చూశా. సినిమా పూర్తయ్యాక నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చారు. పెళ్లి చూపులు సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆ థియేటర్ నవ్వులతో ఊగిపోవడం చూశా. ఆ సినిమా రిలీజైన నెక్ట్ డే నా ఫోన్ కంగ్రాట్స్ మెసేజ్ లతో నిండిపోయింది.

డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా.

నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా.

నా ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నా. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా.

నాకు ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్ లా అనిపించింది. ఖుషి షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్ అయింది. మా ఫ్రెండ్స్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్ ప్రెన్యూర్ లో కొద్ది రోజుల్లోనే నా నుంచి ఒక ప్రకటన వస్తుంది.

లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి.

నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. నేను వర్క్ లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఇయర్, నెక్ట్ ఇయర్ అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా మ్యారేజ్ జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను.

నాకు లైఫ్ లో ఎన్నో సాధించాలని ఉంది. అందుకు కావాల్సిన ఇన్సిపిరేషన్ ఉంది. అందుకే నాకు ఎవర్నో చూసి ఇన్స్ పైర్ కావాల్సిన అవసరం రాలేదు. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలనే డ్రీమ్ ఉండేది. రెంట్స్ కట్టడం, మంత్లీ నీడ్స్ కు డబ్బులకు ఇబ్బందులు పడటం వంటివి చూశాను. ఇలాంటి వాటి నుంచి బయటపడి కంఫర్ట్ గా ఉండాలనే డ్రీమ్ ఉండేది. అలాగే ఇంట్లో, ఫ్యామిలీలో, సొసైటీలో నేనంటే గౌరవం ఏర్పడాలని కోరుకున్నా. ఇవన్నీ చేయాలంటే మనం ధైర్యంగా ప్రయత్నాలుచేయాలి. లైఫ్ లో డబ్బు, గౌరవం ముఖ్యమని అనుకుంటా. నన్నెవరైనా అగౌరవంగా చూస్తే క్షమించను.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండింగ్ కంటే వర్క్ ముఖ్యమని నాన్న చెప్పేవారు. నా మనసులో అది బాగా నాటుకుపోయింది. అలా నేను రెస్ట్ లెస్ గా పనిచేస్తూ వచ్చాను. అయితే ఈ మధ్య నా మైండ్ సెట్ మారింది. కొంత రెస్ట్ తీసుకోవాలనే ఆలోచన మొదలైంది. సండేస్, హాలీడేస్ వర్క్ చేయడం లేదు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నా. షెడ్యూల్స్ మధ్య రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకుని వెకేషన్స్ కు వెళ్తున్నా.

ఫ్యాన్స్ నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ గుర్తు లేదు. చాలా మంది నా ఫొటోను ఆర్ట్ గా గీసి పంపిస్తుంటారు. నాకు నా ఫొటోస్ ఆర్ట్ లో చూడటం ఇష్టం ఉండదు. మీరు ఇంకే బొమ్మ గీసి ఇచ్చినా తీసుకుంటా.

సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా.

నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నా మూవీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను.

గ్లాడియేటర్ నా ఫేవరేట్ మూవీ. పోకిరి సినిమాలో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా మూవీలో ఒకటి పెట్టుకోవాలి. అదెప్పుడు కుదురుతుందో చూడాలి.

నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ – ఖుషి సినిమా ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ అవుతుంది. నేను చాలాసార్లు ఈ మూవీ చూశాను. ఎమోషనల్ ఫన్ నాకు బాగా నచ్చింది. రగ్డ్, మాస్ యాక్షన్ సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా చూసే సినిమా ఖుషి. విజయ్ ఫన్ యాక్టింగ్ తో పాటు ఎమోషనల్ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాను. మూవీ లాస్ట్ 30 మినిట్స్ ఒక డ్రైవ్ లా ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ రిపీటెడ్ గా చూసి ఎంజాయ్ చేశాను. పెళ్లయ్యాక ఆ జంట మధ్య వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ను డైరెక్టర్ శివ ఎంతో నేచురల్ గా ఫ్యామిలీ డ్రామాలో చూపించాడు. విజయ్ తో డియర్ కామ్రేడ్, ఖుషి చేశాం. మూడో సినిమా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వాళ్లిద్దరి కాంబో అయితే ఎలాంటి ఫైర్ ఉంటదో మీకు తెలుసు. అన్నారు.

సమంత మాట్లాడుతూ – ఖుషి మూవీని యూఎస్ లో అభిమానుల మధ్య చూడబోతున్నాను. ఇలా నా మూవీని యూఎస్ లో చూడటం ఇదే తొలిసారి. ఇక్కడ ఫ్యాన్స్ ఎంతో లవ్ చూపిస్తున్నారు. ఒక సినిమాను నిజాయితీగా ప్రేక్షకులకు నచ్చాలని చేస్తే తప్పకుండా అది హిట్ అవుతుంది. ఖుషి సినిమాను యూఎస్ లో చూసి మీకు ఎలా ఉందో పంపిస్తాను. ఖుషి టీమ్ అందరితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ మూవీలో ఆరాధ్య నా ఫేవరేట్ సాంగ్. అని చెప్పింది.

శివ నిర్వాణ మాట్లాడుతూ – అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తో పనిచేయాలని అనుకున్నా. ఖుషి కథ చెప్పాక..సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టింది. ఆ గ్యాప్ లో కుదిరినప్పుడు కలుస్తుండేవాళ్లం. ఎప్పుడూ ఖుషి కథ గురించి డిస్కస్ చేసేవాడిని. ఎలాగైనా ఈ సినిమా చేయాలనే కోరిక ఉండేది. విజయ్ ని ఫస్ట్ డే సెట్స్ లో చూసినప్పుడు డ్రీమ్ కమ్ ట్రూ అనే ఫీలింగ్ వచ్చింది. నాకు విజయ్ కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యా. ఒక బ్యూటిఫుల్ మూవీ మీ దగ్గరకు తీసుకొస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ – ఖుషి సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ నాకు ఇన్స్ పిరేషన్ గా నిలిచాయి. ఆరాధ్య పాటలో విజయ్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో శివ గారి ఇన్ పుట్స్ ఉపయోగపడ్డాయి. ఖుషి మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

Vijay Deverakonda answered every question with full of Kushi & Excitement in National Q&A

The Vijay Deverakonda and Samantha’s Kushi, much awaited pan-indian romantic drama directed by Shiva Nirvana will be released in theaters on September 1, 2023, worldwide. The songs have turned out to be a major advantage for Kushi ahead of its release.

The Team is currently busy with promotions, Vijay Deverakonda who is creative in promoting the film arranged a national Q&A with fans. The actor who wanted to spread Kushi for fans, he attended fans meet in the afternoon and gave Kushi to more than 8000 people. Then he immediately he joined National Q&A session.

The actor talked about Kushi with smile and happiness. Sharing his excitement about the film, he said “Kushi is something that I’ve loved so much as script, while making and while promoting. I think audience will love it and come out of the theatre with big smiles.”

Talking about the favourite moment in a film, he said “When I watched Mahesh Entry in Pokiri. I felt This is heroism. I want to be an actor. I want to do such Chillies shot as a tribute to Pokiri Scene.”

Answering to director question, Vijay Said that he likes Shiva’s comedy and he enjoyed doing comedy with Vennela Kishore. He said, Shiva Nirvana loves cinema so much. He only thinks about the movie and how it improves. When someone suggests a change, he considers how that change will improve the scene; if it’s positive, he’ll make the change.

Samantha Ruth Prabhu (USA) joined live interaction and Vijay and Samantha talked about the Kushi excitement. Samantha to watch Kushi Premiere with fans tomorrow in USA. Vijay was all praises for Samantha commitment and dedication for the film.

Talking about Hesham Abdul Wahab, he said “Everyone celebratred Hesham’s music and now team is raving about the background score especially in climax. I’m waiting to experience it on September 1st.”

In one line, Vijay stated about Kushi , “At the end of the film people will discuss about the film and it will be entertaining throughout.” The actor answered lot of questions about his marraige, favorite food, his inspiration and many other things and made fans happy.

Previous Post

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా… ‘మ్యాడ్’

Next Post

ఆకట్టుకుంటోన్న ‘జవాన్’ ట్రైలర్

Next Post
ఆకట్టుకుంటోన్న    ‘జవాన్’ ట్రైలర్

ఆకట్టుకుంటోన్న 'జవాన్' ట్రైలర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.