ప్రముఖ దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు ‘మత్తు వదలరా’ చిత్రంతో పరిచయం అయ్యాడు యువ హీరో శ్రీ సింహా. ఈ చిత్రంతో ఆడియన్స్ లో మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు చేసి… హీరోగా నిలదొక్కున్నాడు. ఇప్పుడు తాజాగా ‘భాగ్ సాలే’ అంటూ ఓ క్రైం కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈచిత్రంతో శ్రీ సింహా… ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించాడో చూద్దాం పదండి.
కథ: దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చెఫ్ అర్జున్ (శ్రీ సింహా)… ఓ స్టార్ హోటల్ ను స్థాపించేయాలనే పెద్ద పెద్ద కలలలో విహరించేస్తుంటాడు. తనది రాయల్ ఫ్యామిలీ అని… అలాంటి అబద్దాలు చెప్పి… మాయ (నేహా సోలంకి)ని తన బుట్టలో వేసుకుంటాడు. శ్యామ్యుల్ (జాన్ విజయ్) తన ప్రేయసి నళిని (నందిని రాయ్) కోసం… డైమండ్ రింగ్ కోసం… మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. మరి తన ప్రేయసి మాయ తండ్రిని కిడ్నాపర్ నుంచి ఎలా తప్పించాడు? చివరకు డైమండ్ రింగ్ కథ ఎలా ముగిసింది? అందుకోసం అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తీస్తే… క్రైం కామెడీ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మేకింగ్… టేకింగ్ లో కాస్త కొత్తదనం ఉండాలి. అప్పుడే బాక్సాఫీస్ వద్ద ఇలాంటి సినిమాలు నిలబడతాయి. దానికి తోడు మంచి ప్రచారం కూడా తోడైతే… సినిమాకి ప్రేక్షకుల్ని తీసుకురావచ్చు. ఇలాంటిదే ‘భాగ్ సాలే’. క్రైం కామెడీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తూ… థ్రిల్ కు గురిచేస్తూ… ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. దర్శకుడు ఓ చిన్న పాయింట్ మీద రాసుకున్న కథ… కథనాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలతో సాగి… ఇంటర్వల్ తీరువాత రింగ్ చుట్టూ నడిచే కథ.. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. వీకెండ్ లో సరదాగా ఓ లుక్కెయండి.
యువ హీరో శ్రీ సింహా సినిమా సినిమాకి తన ప్రతిభను బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. తన గత చిత్రాలకంటే ఇందులో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. తన నటనతో మెప్పించాడు. అతనికి జోడీగా నటించిన నేహా సోలంకి మాయ పాత్రలో పర్వాలేదు అనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి చివరిదాకా ఉంది. అలాగే విలన్ గా నటించిన జాన్ విజయ్… తన ప్రియురాలి కోసం డైమండ్ రింగ్ కోసం ఎంతకైనా తెగించే శామ్యుల్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అతని ప్రేయసిగా నందిని రాయ్ కూడా మెప్పించింది. రింగ్ తెస్తేనే నీతో మ్యారేజ్ అని విలన్ కే కండీషన్ పెట్టే ప్రేయసిగా మెప్పించింది. వైవా హర్ష కామెడీ ఆకట్టుకుంది. సత్య పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. రాజీవ్ కనకాల పాత్ర పర్వాలేదు.
ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రణీత్… ఆ తరువాత ‘సూర్యకాంతం’తో ఆకట్టుకున్నాడు. తాజాగా కమర్షియల్, కామెడీ జానర్‌లో ‘భాగ్ సాలే’ను తీశాడు. ఆకట్టుకునే మాటలు, పంచ్ డైలాగ్స్ తో రైటర్ గా ‘భాగ్ సాలే’ అంటూ మెప్పించాడు. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటంగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3