తెలంగాణా యాస లో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య బాగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాలను కూడా తెలంగాణా యాస, భాషతో…. ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే కథ… స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నారు. యూత్ ఫుల్ సినిమాల్లో కాస్తా మెసేజ్ కూడా ఉండేలా చూసుకొని ప్రేక్షులముందుకు వస్తున్నారు. తాజాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ రామన్న యూత్ ఇలాంటి కథ.. కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: తెలంగాణాలోని సిద్దిపేట్ నియోజక వర్గానికి సమీపంలోని ఆంక్షాపూర్ గ్రామంలో ఉండే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందన రాజు (అభయ్) మంచి లీడర్‌గా ఎదగాలని కలలు కటుంటాడు. అలాగే తమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రంగుల రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్)కు వీరాభిమాని. గ్రామ పెద్దగా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్)ను స్పూర్తిగా తీసుకొని తన ఇద్దరు దోస్తులతో రామన్న యూత్ అసోసియేషన్‌ను పెట్టి తనకు తానుగా లీడర్ అని స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఊరిలోనే హైలెట్ అయ్యేలా ఫ్లెక్సీ పెడుతాడు. ఇది నచ్చని అనిల్ సోదరుడు (విష్ణు) జెలసీతో రగలిపోతాడు. రాజు పెట్టిన ఫ్లెక్సీని చూసిన అనీల్ బ్రదర్ ఎందుకు ఈర్ష్య పడ్డాడు? ఈర్ష్యతో రాజును ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు? తన పేరున యూత్ అసోసియేషన్ పెట్టిన రాజును మాజీ ఎమ్మెల్యే రామన్న ఆదరించాడా? చివరకు లీడర్‌గా ఎదిగాలన్న రాజు కల నెరవేరిందా? తదితర వివరాలు తెలియాలంటే రామన్న యూత్ సినిమా చూడాల్సందే.
కథ… కథనం విశ్లేషణ: తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న అభి తన ప్రతిభాపాటవాలను పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం బాగుంది. అయితే కథనాన్ని, క్యారెక్టర్లు బాగానే రాసుకోవడం బాగానే ఉంది కానీ కథ లేకుండా చిన్న పాయింట్‌తో సినిమాను నడిపించే ప్రయత్నమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సీన్ల పరంగా, క్యారెక్టర డిజైన్ పరంగా బాగుంది. కానీ ప్రేక్షకుడిని ఓ ఎమోషనల్ పాయింట్‌తో కనెక్ట్ చేసే బలమైన కథను రాసుకోలేకపోయాడనిపిస్తుంది. సొంత అనుభవాలను పేర్చుకొని సినిమాను రూపొందించారని సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఒక చిన్న పాయింట్ ఆధారంగా క్యారెక్టర్లతో హాస్యాన్ని బాగానే పండించాడు. తెలంగాణ యాస, భాషపై పట్టు దర్శకుడిలో కనిపించిన ప్లస్ పాయింట్. బలమైన, భావోద్వేగమైన పాయింట్‌తో కథను ముగించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. అభయ్, అనిల్ గీలా, ఇతరులతో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి. ఎప్పుడూ తాగుబోతుగా కనిపించే రమేష్.. ఈసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకొన్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్ సీరియస్ రోల్‌లో ఒకే అనిపించారు. సినిమాకు కీలకమైన క్యారెక్టర్‌గా మారిన పాత్రలో విష్ణు, ఉన్న కాసేపు యాదమ్మ రాజు నవ్వించిన తీరు బాగుంది. రాజు ఫ్రెండ్ క్యారెక్టర్‌కు ఫాదర్‌గా నటించిన ఆనంద చక్రపాణి, విష్ణు గీలాకు తండ్రిగా నటించిన వేణు పొలసాని తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. మిగితా క్యారెక్టర్లలో తెలంగాణ యువతీ,యువకులుగా నటించిన వారు తమ పాత్రలో ఒదిగిపోయారు. రీల్స్ పిచ్చి ఉన్న తెలంగాణ మహిళగా జబర్దస్త్ రోహిణి కనిపించినప్పుడల్లా నవ్వించారు.
ఎమోషనల్, బలమైన కథను రాయడంలో తడబాటుకు గురైన అభయ్.. సాంకేతిక అంశాలపై తనకు ఉన్న పట్టును చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. తొలి చిత్ర దర్శకుడిగా కొన్ని విషయాల్లో అభయ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్, సౌండ్, సినిమాటోగ్రఫి తదితర అంశాలను సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫహాద్ సినిమాటోగ్రఫి, నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైన్ అంశాలు బాగున్నాయి.
రామన్న యూత్ సినిమా విషయానికి వస్తే.. తెలంగాణ యాస భాషతో వుండే పాత్రలు మన చుట్టూ వుండేలా వుండటంతో సరదాగా మూవీ సాగిపోతుంది. తెలంగాణ నేటివిటి, అమాయకత్వాన్ని తన పాత్రల్లో నింపిన దర్శకుడు అభయ్ ప్రయత్నం బాగుంది. శ్రీకాంత్ అయ్యంగార్, ఆనంద చక్రపాణి, వేణు పొలసాని లాంటి నటులను పెట్టుకొని సినిమాను పూర్తిగా పొలిటికల్ సెటైర్‌గా చేయడం… అందులోనూ ఓ చిన్న మెసేజ్ కూడా ఇవ్వడం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నటీనటులు కొత్తవారైనప్పటికీ వారి ఫెర్ఫార్మెన్స్ బాగుంది. టేకింగ్, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాలు అన్నీ బాగున్నాయి. తెలంగాణ నేటివిటితో తెరకెక్కిన రామన్న యూత్… ఓ టైమ్ పాస్ సినిమా. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3