హీరో కిరణ్ అబ్బవరం, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా, శ్రీకాంత్ పుప్పాల ఎపిక్ మైథాలజీ మూవీ “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ అనౌన్స్ మెంట్
“క”, “కె ర్యాంప్”, “చెన్నై లవ్ స్టోరీ” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. “క” చిత్రంతో థ్రిల్లర్, “కె ర్యాంప్” తో మాస్ ఎంటర్ టైనర్, “చెన్నైలవ్ స్టోరీ”తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా, “కెఎ 13” అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో “కెఎ 14” సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు “కెఎ15” గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ పుప్పాల కాంబినేషన్ లో కిరణ్ అబ్బవరం హీరోగా ఎపిక్ మైథాలజీ మూవీ “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ ఈ రోజు అనౌన్స్ చేశారు. మన పురాణ ఇతిహాసాల్లోని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొత్త దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల.
మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ వంటి అంశాలతో గ్రాండ్ స్కేల్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ మూవీ నిర్మాణం కానుంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించనుంది. హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో సరికొత్త అవతార్ లో కనిపించనున్నారు. భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా లార్జ్ స్కేల్ పాన్ ఇండియా చిత్రంగా “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ తెరపైకి రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ కానుంది. ఈ చిత్రానికి కీర్తన్ స్టోరీని అందించి, కుస్సుమ్ అరోరాతో కలిసి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
“ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ – “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ చిత్రంతో మేమంతా ఎంతో ప్యాషన్ తో ఒక సరికొత్త సినిమాటిక్ వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నాం. మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్న అంశాలతో నేటి ట్రెండ్ కు తగిన మేకింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మేము క్రియేట్ చేయబోతున్న మైథాలజీ యూనివర్స్ లో ఈ సినిమా తొలి అడుగు మాత్రమే. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక ఎపిక్ స్టోరీని అందించబోతున్నాం. అక్టోబర్ నుంచి మా మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం. అన్నారు.
ఈ చిత్ర కాస్ట్ అండ్ క్రూ వివరాలు, అప్డేట్స్ ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, తదితరులు
టెక్నీషియన్స్
——————–
స్టోరీ – కీర్తన్
స్క్రిప్ట్ – తన్వీ ఎన్ దత్త
కో ప్రొడ్యూసర్స్ – కీర్తన్, కుస్సుమ్ అరోరా
ప్రొడ్యూసర్స్ – జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ పుప్పాల
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
Zee Studios and Prerna Arora announce ‘Indraputra,’ the first chapter of an ambitious
mythological saga starring Kiran Abbavaram
Zee Studios and Prerna Arora have officially unveiled the title of their ambitious pan-India
mythological action-fantasy, Indraputra, starring Kiran Abbavaram in the lead and directed by
Srikanth Puppala. The film is set to commence principal photography this October.
Rooted in Indian mythology and conceived on a grand cinematic scale, Indraputra is envisioned as the first chapter of an expansive mythological universe. Blending mythology,
fantasy, action, and emotion, the film promises a visually immersive experience while
drawing inspiration from timeless legends and the eternal battle between dharma and
adharma.Kiran Abbavaram headlines the project in a powerful new avatar, while director Srikanth
Puppala brings to life an ambitious vision that seamlessly blends contemporary storytelling
with India’s rich mythological heritage. Designed as a large-scale pan-India spectacle,
Indraputra aims to appeal to audiences across languages and generations.
Prerna Arora, producer of the film, exclusively shared, “Indraputra is more than just a film, it
is the beginning of a world we have been passionately building. Inspired by the richness of
Indian mythology and crafted with a contemporary cinematic vision, the film marks the first chapter of an expansive mythological universe. With Kiran Abbavaram leading the cast and Srikanth Puppala at the helm, we are excited to bring this epic story to audiences and begin
filming this October.”
Produced by Zee Studios, Prerna Arora and co-produced by Keerthan, Indraputra is currently
in pre-production and will go on floors this October. Further announcements regarding the
ensemble cast, technical crew, and release plans will be made in the coming months.
With an expansive world inspired by Indian mythology, compelling storytelling, and franchise
potential at its core, Indraputra is poised to be one of the most anticipated pan-India
cinematic spectacles in the years ahead.
Cast – Kiran Abbavaram and others
Technicians
Story – Keerthan
Script – Tanvi N. Dutta
Co-Producers – Keerthan, Kussum Arora
Producers – ZEE Studios, Prerna Arora
Script & Direction – Srikanth Puppala
PRO – Suresh (SK Media)









