• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, September 15, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Maari by Maari
March 31, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో … దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..‘‘2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా.’’ అని చెప్పారు.

సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘‘పెళ్లి సినిమా తర్వాత నేను చేసిన కొన్ని సినిమాలకు ఇలాంటి భారీ ఓపెనింగ్స్ జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో గ్రాండ్ ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసమే నా హెయిర్ స్టైల్ మార్చాను. ఇందులో నాది పాజిటివ్ క్యారెక్టర్. డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. యానిమల్ మూవీ తర్వాత నా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం నేను 19 సినిమాలు చేస్తున్నా. అందులో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ కృష్ణ వెరీ టాలెంటెడ్ పర్సన్. మొన్న జరిగిన ఫొటో షూట్‌తో నాకు ఆ విషయం అర్థమైంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది.’’ అని చెప్పారు.

హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..‘‘నా దర్శకుడు కృష్ణకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లతగారు చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్.’’ అని అన్నారు.

నిర్మాత డాక్టర్ లతారాజు మాట్లాడుతూ..‘‘నిర్మాతగా నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. మా అబ్బాయి కోరిక మేరకు నేను నిర్మాత అవ్వాల్సి వచ్చింది. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. పృథ్వీ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ, లవ్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా ఉంటుంది. బాబీ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలబడ్డాడు. పృథ్వీగారు మా బాబును ఎంతగానో గైడ్ చేస్తున్నారు. మా టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. కార్యక్రమానికి వచ్చిన గెస్ట్‌లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని చెప్పారు.

ఫైట్ మాస్టర్ జీవన్ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ ఎంత బాగుంటుందనే విషయం మాటల్లో చెప్పలేము. విన్నప్పుడు నేనే షాక్ అయ్యా.. అంత బాగుంటుంది. హీరోగారు స్టోరీలోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకుని ఎంతో కష్టపడుతున్నారు. ఆర్టిస్టులందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

 

తారాగణం: కుశాల్ రాజు(హీరో), జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ

సాంకేతిక బృందం:
నిర్మాణ సంస్థ: ఎంఎస్ఆర్ క్రియేషన్స్
నిర్మాత: డా. లతారాజు
దర్శకుడు: మల్లిడి కృష్ణ
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రాఫర్: అమర్నాథ్ బొమ్మిరెడ్డి
ఫైట్ మాస్టర్: జీవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబీ రెడ్డి
పీఆర్వో: కె. సతీష్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

 ఫ‌స్ట్‌లుక్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమరావ‌తికి ఆహ్వానం`

Next Post

నటుడిగా నా స్థాయిని పెంచే చిత్రం “సారంగపాణి జాతకం” – ప్రియదర్శి

Next Post
నటుడిగా నా స్థాయిని పెంచే చిత్రం “సారంగపాణి జాతకం” – ప్రియదర్శి

నటుడిగా నా స్థాయిని పెంచే చిత్రం "సారంగపాణి జాతకం" - ప్రియదర్శి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”

“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”

by Maari
September 11, 2026
0

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

by Maari
September 10, 2026
0

“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

by Maari
September 9, 2026
0

ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది:  విజయ్ దేవరకొండ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

by Maari
September 8, 2026
0

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

by Maari
September 7, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.