ప్రముఖ కమెడియన్స్ అందరూ లీడ్ రోల్ పోషించి… ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారు.
కమెడియన్ ప్రవీణ్ ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో బకాసుర రెస్టారెంట్ అనే ఒక సినిమా రూపొందించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు వైవాహర్ష టైటిల్ రోల్ అని చెప్పడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురు చూశారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇది హంగర్ కామెడీ అనే కొత్త జానర్‌తో రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా ? లేదా? అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
పరమేష్ (కమెడియన్ ప్రవీణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నిజానికి అతనికి ఒక హోటల్ పెట్టి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. పరమేష్ ఇద్దరు అనాధ కుర్రాళ్లను తానే పోషిస్తూ ఉంటాడు. ఇక ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు కూడా అదే బ్యాచిలర్ రూంలో ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరందరూ కలిసి ఒక ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతారు. అందులో భాగంగా ఒక బంగ్లాకి వెళ్ళినప్పుడు ఒక చేతబడికి సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. అందులో ప్రయోగాలు చేస్తుండగా 200 ఏళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవాహర్ష) ఆత్మ నిద్రలేస్తుంది. ఒక చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన అంజి (షైనింగ్ ఫణి) శరీరంలో దూరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అంజి శరీరం నుంచి బకాసురుడి ఆత్మ బయటకు వచ్చిందా? లేదా? ప్రవీణ్ తాను స్టార్ట్ చేయాలనుకున్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడా? చివరికి ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ:
ఇదేదో కొత్త కథ. హంగర్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్‌తోనే అసలు ఏం జరగబోతోంది అనే విషయం ఈజీగా అర్థమయిపోయేలా చాలా సరళంగా రాసుకున్నాడు. స్క్రీన్‌ప్లేతో కూడా పెద్దగా మ్యాజిక్ చేయాలి అనే ప్రయత్నం చేయకుండా, సూటిగా చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ముందుగా క్యారెక్టర్‌లను పరిచయం చేసి కథలోకి చాలా త్వరగానే తీసుకువెళ్లాడు. ఫస్ట్ హాఫ్ త్వరగా ముగించి… తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం కథను వేగంగా నడిపించాడు. అలా మొత్తం మీద ఫస్ట్ హాఫ్… సెకండ్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా ఉప్పల్ బాలు బ్యాచ్ ట్రాక్ వర్కౌట్ అయింది. డైరెక్టర్ పురాణాల మీద పెద్దలు చెప్పే మాటల మీద చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా కథ రాసుకున్నాడు అనిపించింది.
ప్రవీణ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించాడు. ఒకరకంగా సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించాడు. అతని తర్వాత అంతలా నటించే స్కోప్ ఉన్న పాత్ర ఫన్ బకెట్ ఫణికి దక్కింది. వైవా హర్ష కనిపించే అంతసేపు ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా పాత్రలలో నటించిన కుర్రాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, వికాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇరగదీశాడు. ఒక స్టార్ హీరో సినిమాకి కొట్టినట్టు కొట్టాడు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఓవరాల్ గా.. ఇదొక ఎంగేజింగ్ హంగర్ కామెడీ. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3