ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కి… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడైతే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చు. దానికి కాస్త హారర్ జోడించి… కామెడి పండిస్తే చాలు సినిమా పాస్ అయిపోతుంది. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ… సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటారు. తాజాగా ఇలాంటి వినూత్నమైన కథ… కథనంతో తెరకెక్కిన “జిన్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: అనగనగా ఓ విశాలమైన కళాశాల. అందులో వింత వింత చేష్టలతో విద్యార్థులకు వింత అనుభవం కలుగుతుంది. ఇదే క్రమంలో
నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కి బయలుదేరతారు. అక్కడి చేరుకోవాలంటే మధ్యలో భూతాల చెరువు దాటాలి. సరిగ్గా ఆ కుర్రాళ్లు అక్కడికి వచ్చేసరికి షాక్ కు గురై సంఘటన చోటుచేసుకుంటుంది. వారిని ఎవరో బంధిస్తారు. ఆ కుర్రాళ్లు ఎలా బంధించబడ్డారు? ఆ బందీల నుంచి బయటకు ఎలా వచ్చారు? వారికి ఎవరు సహాయం చేశారు? అసలు జిన్ కాన్సెప్ట్ ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!
విశ్లేషణ: జిన్ అనే పేరు కొన్ని మతాలవారికి తెలుసు. భూత ప్రేతాళలకు సంబంధించింది. దానిపై దర్శకుడు అవగాహనతో కథ రాసుకున్నాడు. ఇందులో కాలేజీ ఎపిసోడ్ అనగానే కుర్రాళ్లు, అల్లరి చేష్టలు, కాలేజ్‌లోకి వెళ్లడం వంటి సీన్లతో ముందుకు సాగుతుంది. ఆ క్రమంలో వచ్చే ట్విస్ట్ ఇంటర్ వెల్. ఆ భవనం లో ఇురుక్కున వారు ఎంతకీ బయటపడలేకపోతారు. అలాంటి టైంలో ఓ చిన్న ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. కాస్త భయపెడుతూ, ఇంకాస్త నవ్విస్తూ కథనాన్ని నడిపించడంలో ఫస్ట్ హాఫ్ వరకు దర్శకుడు చిన్మయ్ రామ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
ఇక అసలు కథంతా ఇంటర్ వెల్ తర్వాతే. జిన్ కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేయడం… , పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆ కాలేజీ భవనం చరిత్ర, అందులో ఉన్న ఆత్మల గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ… ఆసక్తిగా మలిచారు. అలా ప్రీ క్లైమాక్స్ వరకు కథ మంచి పట్టుతో సాగుతుంది. క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉండటం కలిసి వచ్చే అంశం. సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్ ఇచ్చేలా జిన్ మూవీని ముగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇందులో నటించిన తారాగణం అంతా బాగా నటించారు. కథకు సూటయ్యారు. అమిత్ రావ్ అందరినీ ఆకట్టుకుంటాడు. సెకండాఫ్‌లో ఆయన రాకతో సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చాలా చోట్ల కంటి చూపుతో నటించేశాడు. ఎక్కువగా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తాడు. ఇక పర్వేజ్ సింబ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. తెలుగు ప్రేక్షకులకు వీరు కొత్తగా అనిపిస్తారు, కనిపిస్తారు. కానీ వారి నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు.
ఈ మూవీకి అలెక్స్ ఇచ్చిన ఆర్ఆర్, సునీల్ హొన్నలి విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అలెక్స్ ఆర్ఆర్ థియేట్రికల్‌గా మంచి అనుభూతిని ఇస్తుంది. హారర్, మిస్టరీ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ జిన్ ఓ మోస్తరుగా నచ్చుతుంది. నవ్విస్తూనే భయపెట్టడంలో మేకర్లు సక్సెస్ అయ్యారు. ఇక లొకేషన్ పరంగా చూస్తే, కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశారు. తగిన విధంగా నిర్మాణ విలువలు వున్నాయి. మామూలుగా ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. కానీ చూసిన వారికి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్ 3










