ప్రక్యా అనిరుధ్ శ్రీవాత్సవ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ‘MARIO’. కల్యాణ్ జీ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలావుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: అనిరుధ్(అనిరుధ్ శ్రీవాత్సవ్)కి చిన్నతనంలో ఎదురైన ఓ సంఘటన కారణంగా ఎలాగైనా కారు కొనుగోలుజేసి ఎంజాయ్ చేయాలని చూస్తూ వుంటాడు. దాంతో MARIO అనే ఓ వింటేజ్ కారును హీరోయిన్ హెబ్బా పటేల్ నుంచి కొనుగోలు చేస్తాడు. అదే సమయంలో ఓ డ్రగ్ ముఠా(రాకేందు మౌళి, కల్పిక) హీరోయిన్ హెబ్బా పటేల్ కు మూడు వింత లక్షణాలు కలిగి వుండే డ్రగ్ ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసి… ఆమెను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తుంటారు. ఆ డ్రగ్ నుంచి తను బయటపడాలంటే యాంటీ డోస్ ఇవ్వాలని… అది తమ వద్ద వుందని చెబుతూ… తాము చెప్పటినట్టు చేస్తే… దాన్ని ఇస్తామని చెబుతూ… ఆమెతో కొన్ని ముఠాలకు డ్రగ్ సరఫరాను చేయిస్తూవుంటారు. ఇందుకోసం హెబ్బాపటేల్… అనిరుధ్ సహాయం తీసుకుని… మారియో వాహనంలోనే ఈ డ్రగ్ ను సరఫరా చేస్తూ వుంటుంది. మరి ఈ క్రమంలో హెబ్బాకు, హీరో అనిరుధ్ కు ఎదురైన అనుభవాలు ఏంటి? హెబ్బా పటేల్ కు యాంటీడోస్ అందిందా? ఇంతకూ ఆమెకు ఆ వింత లక్షణాలు కలిగే డ్రగ్ ను ఎందుకు ఇంజెక్ట్ చేసినట్టు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: డ్రగ్ మాఫియా మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో చూపించిన డ్రగ్ మాఫియా మాత్రం వింతగా ప్రవర్తిస్తూ వుంటుంది. డ్రగ్ మాఫియా లీడర్ గా బాబ్ మార్లిన్ పాత్రలో రాకేందు కేళి చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయింది. అలనాటి శ్రీదేవిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ పెరిగిన ఇద్దరు స్నేహితులు ఆమె చనిపోవడంతో… అల్లరి రాముడులో అర్తి అగర్వాల్ వర్షం సాంగ్ ను చూసి ఆమెను ప్రేమిస్తారు. ఆమెకు అర్దాంతరంగా చనిపోవడంతో చివరకు హారోయిన్ హెబ్బా పటేల్ ను ‘కుమారి 21ఎఫ్’ సినిమా చూసి ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో బాబ్ మార్లిన్ ఆమెను ఎలా వేధించాడు అనేదాన్ని చాలా రొమాంటిక్ గా, ఫన్నీగా చూపించారు. సెకెండాఫ్ లో హెబ్బా పటేల్, అనిరుధ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషయానికొస్తే… తనే హీరోగా నటిస్తూ సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు అనిరుధ్ శ్రీవాత్సవ్. యూత్ ఫుల్ గా కనిపించి మెప్పంచాడు. హెబ్బా పటేల్ ఎప్పటిలాగే తన హాట్ లుక్స్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. తన సహజనటనతో మెప్పించింది. రాకేందు మౌళి డ్రగ్ మాఫియా లీడ్ గా బాబ్ మార్లీ పాత్రలో బాగా నవ్వించారు. అతనికి రాసిన సంభాషణలు కూడా బాగా నవ్విస్తాయి. అతనికి జోడీగా కల్పిక నటించారు. ఆమె పాత్ర కూడా బాగా యాప్ట్ అయింది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించాయి.
దర్శకుడు కల్యాణ్ జీ గోగన రాసుకున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఓ మోస్తారుగా ఆకట్టకుంటుంది. ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేను రాసుకుని వుంటే మరింత ఆకట్టుకునేది. హెబ్బాపటేల్ ఎపిసోడ్ ను బాగానే చూపించారు. డ్రగ్ మాఫియా ముఠాను ఇంకాస్త ఎలివేట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చాలా భాగం నైట్ మోడ్ లోనే రన్ అవుతుంది. విజువల్స్ ను బాగా చూపించారు. నిర్మాతనే హీరో కాబట్టి… ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఉన్నతంగా తీశారు. ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3










