* సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న క్రేజీ మూవీ
యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శిఖండి. ఈ చిత్రాన్ని పోలా మూవీస్ బ్యానర్ పై పోలా ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గురుమూర్తి.వి. రూపొందిస్తున్నారు. ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా శిఖండి సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
స్టోరీ రైటర్ సత్యదేవ్ మాట్లాడుతూ – నాకు రీసెంట్ గా తెలుగు యంగ్ హీరోతో కన్నడ తెలుగు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఈ ఈవెంట్ లో కన్నడ మూవీ టీమ్ ను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మహాభారతంలో శిఖండిది చాలా కీలక పాత్ర. భీష్మ పితామహుని అస్త్ర సన్యాసానికి కారణమైన పాత్ర శిఖండిది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కారణజన్ములే. ప్రతి ఒక్కరి జన్మకు కారణం ఉంటుంది. అలాంటి శిఖండి పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ నిఖిత స్వామి మాట్లాడుతూ – ఈ చిత్రంలో నాది శిఖండి పాత్ర అని మేకర్స్ చెప్పారు. నేను కన్నడలో హీరోయిన్ గా నటిస్తున్నాను. గ్లామర్ రోల్స్ చేస్తున్నాను. అలాంటి టైమ్ లో ఈ పాత్ర నాకు బాగుంటుందా లేదా అనే సందేహం వచ్చింది. అయితే డైరెక్టర్ గారు, ఇతర టీమ్ మెంబర్స్ విజువల్ గా మూవీ ఎలా ఉంటుందో వివరించారు. అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ పై, ప్రాజెక్ట్ పై నమ్మకం ఏర్పడింది. రీసెంట్ గా కన్నడలో రిలీజ్ చేసిన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా మా సినిమాను బాగా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి నీతు వనజాక్షి మాట్లాడుతూ – శిఖండి చిత్రంలో నటిస్తుండటం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ ఈ సినిమా కథ ఎంత బాగా చెప్పారో అంత బాగా తెరకెక్కించారు. ఆయన చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ మూవీలో ఉన్నాయి. మా మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. అన్నారు.
నటి చాందినీ మాట్లాడుతూ – శిఖండి మహాభారతంలోని పాత్ర అనే విషయం నాకు తెలియదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు భయంగా అనిపించింది. ఇప్పటిదాకా మమ్మల్ని కొజ్జా అని, చెక్క అని పిలుస్తున్నారు. ఈ సినిమా తర్వాత శిఖండి అని పిలుస్తారేమో అని భయపడ్డాను. కానీ దర్శకుడు గురుమూర్తి గారు మహాభారతంలోని ఈ పాత్ర గొప్పదనం గురించి చెప్పిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా అనిపించింది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రద్యోత్తన్ మాట్లాడుతూ – నేను రామ్ గోపాల్ వర్మ గారి ఐస్ క్రీమ్ సినిమాకు మ్యూజిక్ చేశాను. ఇటీవల నా కన్నడ మూవీ ఒకటి మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రానికి బీజీఎం అందించాను. నేను తెలుగు వాడిని. మొదటిసారి నేను వర్క్ చేస్తున్న చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. నేను రచ్చ గెలిచి ఇంటికి వచ్చాను. మీరంతా మా శిఖండి మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు దీపక్ శెట్టి మాట్లాడుతూ – నేను నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. మా మూవీ టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు టీమ్ అంతా ప్యాషనేట్ గా కష్టపడ్డారు. శిఖండి మూవీతో మీ అందరికీ గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.
రైటర్ ఆలపాటి మాట్లాడుతూ – నా స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. మహాభారతంలోని శిఖండి పాత్రను ఇప్పటి వర్తమాన కాలంలోని కథకు ముడిపెట్టి ఒక మంచి మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించి మరిన్ని మంచి చిత్రాలు చేసే ఉత్సాహాన్ని నా స్నేహితుడికి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత పోలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ – ప్రేక్షకులకు ఒక మంచిని చెప్పాలంటే సినిమా మాధ్యమమే సరైనది. శిఖండి లాంటి మంజి సబ్జెక్ట్ తో సినిమా నిర్మిస్తుండటం గర్వంగా ఉంది. ఈ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్..ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మా సినిమా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. మా మూవీ మోషన్ పోస్టర్ , టీజర్ ను దేశంలోని వివిధ నగరాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ లో తెలుగు ఆడియెన్స్ ముందు మా మూవీ టీజర్ రిలీజ్ చేసుకున్నాం. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఒక ఫ్యామిలీలా మూవీ కోసం కష్టపడ్డారు. త్వరలోనే శిఖండి చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.
నిర్మాత పోలా లక్ష్మి మాట్లాడుతూ – సినిమా చూసి మనం వెంటనే బాగా లేదు అనేస్తాం. కానీ ఒక సినిమా మేకింగ్ కు ఎంతమంది కష్టపడతారో చూస్తే అలా చెప్పడానికి మనసు రాదు. నేను కూడా ఏదైనా సినిమా చూడగానే బాగా లేదని చెప్పేదాన్ని. కానీ ఈ సినిమా సెట్ కి వెళ్లాక అలా చెప్పకూడదని నిర్ణయించుకున్నా. ఈ సినిమా షూటింగ్ ముగిశాక ఒక ఫ్యామిలీకి దూరమవుతున్న ఫీలింగ్ కలిగింది. అన్నారు.
హీరోయిన్ ఖ్యాతి మాట్లాడుతూ – శిఖండి సినిమాలో డాక్టర్ సంగీత క్యారెక్టర్ లో నటిస్తున్నాను. తను పేదల కోసం ఒక ఆస్పత్రి నిర్మించాలనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, ఆ సమస్యల్ని ఎవరెవరు ఎలా పరిష్కరించారు అనేది మూవీలో మా డైరెక్టర్ గురుమూర్తి ఆసక్తికరంగా తెరకెక్కించారు. అన్నారు.
నటుడు ఆనంద్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను కామెడీ రోల్ లో నటించాను. మా మూవీ టీమ్ అంతా తెలుగులో మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే వారికి తెలుగు వారు అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. అన్నారు.
డైరెక్టర్ గురుమూర్తి.వి. మాట్లాడుతూ – మాలశ్రీ ప్రధాన పాత్రలో నటించిన మారణాస్త్ర నా తొలి సినిమా. ఆ మూవీ తెలుగులో మారణాయుధం పేరుతో రీమేక్ అయ్యింది. ఎలాంటి కథతో రెండో సినిమా చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో మహాభారతంలో శిఖండి పాత్ర నేపథ్యంగా చేయాలని అనిపించింది. మా ప్రొడ్యూసర్ గారికి రెండు సార్లు కథ చెప్పినా ఆయనకు కనెక్ట్ కాలేదు. మూడో సారి వెళ్లి సినిమా బిగినింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చెప్పాను. వెంటనే మనం ఈ సినిమా చేద్దామని అంగీకరించారు. ఈ సినిమా విషయంలో మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. శిఖండి అంటే దైవ స్వరూపిణి. మహాభారతంలోని ఈ పాత్రకు ఇప్పటి కలియుగంలోని కథకు ముడిపెడుతూ ఎలా సినిమా చేశాం అనేది థియేటర్ లో చూడాలి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హార్ట్ టచింగ్ ఫీల్ తో బయటకు వస్తారు. అన్నారు.
హీరో యువరాజ్ గౌడ మాట్లాడుతూ – శిఖండి మూవీ కథ విన్నప్పుడు ఈ చిత్రంపై నాకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ ఇప్పుడు టీజర్ చూశాక వందరెట్లు నమ్మకం పెరిగింది. మేము శిఖండి అనే సినిమా చేశామని గర్వంగా చెప్పుకుంటాం. ఈ సినిమాలో మహాభారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని మా డైరెక్టర్ గురుమూర్తి గారు చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు నిఖిల్ మాట్లాడుతూ – నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ కథ వింటున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందనేది ఊహించుకోగలిగాను. దీపక్ శెట్టి గారితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉంటాయి. మేమిద్దరం యాక్షన్ సీక్వెన్సులు చేశాం. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డబ్బుల కోసం, టైమ్ షెడ్యూల్స్ కోసం ఆలోచించలేదు. ప్రేక్షకులకు ఒక మంచి మూవీ ఇవ్వాలనే అంతా ప్రయత్నించాం. మా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – యువరాజ్ గౌడ, నిఖిల్ మలియక్కల్, దీపక్ శెట్టి, నిఖితస్వామి, నీతు వనజాక్షి, రాఘవేంద్ర, ఖ్యాతి, నయన, విజయ్ చెందూర్, బలరాజవాడి, చాందినీ, తదితరులు
టెక్నికల్ టీమ్
————–
యాక్షన్ – మారుతి
ఎడిటర్ – చక్రం సాయి
డీవోపీ – స్వామి మైసూర్
బీజీఎం – ప్రద్యోత్తన్
మ్యూజిక్ – మంజుకవి
డైలాగ్ రైటర్ – దయాశంకర్ జీఎం
బ్యానర్ – పోలా మూవీస్
ప్రొడ్యూసర్ – పోలా ప్రవీణ్ కుమార్
*పీఆర్ఓ -రాధవాసంశెట్టి*
డిజిటల్ హెడ్ రమేష్
స్క్రిప్ట్, డైరెక్షన్ – గురుమూర్తి. వి.









