నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్ దర్శకత్వంలో లెల్లా రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి గారి పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం విడుదల చెసింధి. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్ శ్రీహరికి అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్ డా. శ్రీహరికి కూడా కనిపిస్తుండటంతో ఈ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శరవేగంగా ముస్తాబవుతోంది, త్వరలో చిత్ర బృందం ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించింది. ఈ ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.మిగిలిన వివరాలు త్వరలో ప్రకటించబడతాయని చిత్ర బృందం తెలిపింది.










