‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం:
*”M4M” మూవీ హీరోయిన్ జో శర్మతో (Jo Sharma) ఇంటర్వ్యూ
▪️ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” హైలైట్స్ చెప్పిన హీరోయిన్
▪️ ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు
▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంటర్నేషనల్ అవార్డులు
▪️ మే 8న “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” విడుదల
▪️ 5 భాషల్లో విడుదలకు సిద్ధమైన “M4M” మూవీ
▪️ సినిమాలో విలన్ ఎవరో చెబితే రూ. లక్ష ప్రైజ్ మనీ
ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూఈలో ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ నటి జో శర్మ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి, తన కెరీర్ గురించి ఈ భామ చెప్పిన విశేషాలు ఇవి..
* ప్రశ్న: మీ గురించి, మీ అప్‌కమింగ్ మూవీ గురించి చెప్పండి
జో శర్మ: అందరికీ నమస్కారం. నా పేరు జో శర్మ. నేను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చాను. Tollywood, బాలీవుడ్ తరహాలో వస్తున్న నా డెబ్యూ మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలవుతోంది. మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘రాధ’, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తాను.
* ప్రశ్న: అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సినిమా చేయడానికి మీకు ఉన్న అనుభవం ఏంటి?
జో శర్మ: నేను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌ని, నాకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. మోహన్ గారి దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి మోహన్ గారు, రాహుల్ అడవల గారితో కలిసి నేను కో-రైటర్‌గా కూడా పనిచేశాను. కథా చర్చల్లో పాల్గొనడం వల్ల నా పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకున్నాను.
* ప్రశ్న: రిలీజ్‌కు ముందే ఈ సినిమాకి చాలా అవార్డులు వచ్చినట్లున్నాయి, ఆ విశేషాలు?
జో శర్మ: అవును, సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ డైరెక్టర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా నాకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్ గారికి అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. అక్కడ మా సినిమాకు వచ్చిన స్పందన ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది.
ప్రశ్న: ఈ సినిమా కథలో ఉన్న ప్రధానమైన సస్పెన్స్ లేదా కొత్తదనం ఏమిటి?
జో శర్మ: ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ (కళాఖండాల) తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాము.
ప్రశ్న: ఈ చిత్ర నిర్మాణం గురించి?
జో శర్మ: ఈ చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా వారు సంయుక్తంగా నిర్మించారు. ఒక లక్ష డాలర్ల బడ్జెట్ స్థాయికి చేరుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే జరిగింది. సంగీతం చెన్నైకి చెందిన వసంత్ ఇసైపట్టాయ్ అందించారు.
ప్రశ్న: మీ నేపథ్యం ఏంటి? మీకు తెలుగు ఎలా వస్తుంది?
జో శర్మ: నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. కానీ పెరిగింది నాగ్‌పూర్, ముంబైలో. అందుకే నాకు తెలుగుతో పాటు మరాఠీ, హిందీ బాగా వస్తాయి. మా అమ్మానాన్నలది విజయవాడ, గుంటూరు ప్రాంతాలు.
ప్రశ్న: టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన హీరోలు ఎవరు? భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
జో శర్మ: నాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. ఇక ప్రభాస్ గారు ‘బాహుబలి’తో టాలీవుడ్ ఇమేజ్‌ని మార్చేశారు. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు డ్యాన్స్ ఆండ్ యాక్టింగ్ అంటే ప్రాణం కాబట్టి, రాబోయే సినిమాల్లో మంచి గ్లామర్ ఆండ్ యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది.
ప్రశ్న: మీ టైటిల్ కి అర్థం ఏమిటి? ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
జో శర్మ: M4M అంటే “మోటివ్ ఫర్ మర్డర్” (Motive For Murder). ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది అసలు పాయింట్. ఈ టైటిల్‌కే అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. నన్ను, మా టీమ్ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం.
“My Goal is to be Known as a ‘Beauty with Brains’”: Jo Sharma on Her Debut Thriller M4M
The Indian film industry is abuzz with the upcoming suspense thriller “M4M (Motive For Murder).” Starring American-based actress Jo Sharma and directed by Mohan Vadlapatla, the film is set for a grand worldwide release on May 8. Distributed by PVR Inox Pictures, the movie will hit screens in five languages: Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam.
In an exclusive interview, lead actress Jo Sharma shares insights into her journey, the film’s unique concept, and its international acclaim.
Highlights of the Interview:
– Unique Concept: A “world-first” plot involving murders modeled after legendary paintings.
– Global Recognition: Already bagged 15 International Awards before its theatrical release.
– Cannes Pride: Received a standing ovation at the prestigious Cannes Film Festival.
– Audience Challenge: A cash prize of ₹1 Lakh for identifying the villain on release day.
Q: Tell us about yourself and your upcoming film.
Jo Sharma: Hello everyone! I am Jo Sharma, originally from San Francisco, USA. M4M (Motive For Murder) is my debut feature, and it’s a massive project releasing in five languages. Directed by Mohan Vadlapatla garu, I play a character named ‘Radha’—a fierce crime investigative journalist.
Q: Coming from the US, what was your experience working in the Indian film industry?
Jo Sharma: I have a background as a theater artist in America and even run my own theater production company. However, for this film, I trained under Mohan garu for three years. I was also a co-writer for M4M alongside Mohan garu and Rahul Adavala. Being involved in the writing process helped me design Radha’s character with a lot of depth and strength.
Q: The film has already garnered significant international buzz. Could you share details about the awards?
Jo Sharma: It’s been overwhelming! We have won 15 international awards before the release. This includes Best Film at the Los Angeles Film Festival, Best Director in London, and I was honored with Best Actress awards at the New York, Hollywood, and Santa Monica film festivals. The biggest highlight was our global premiere at Cannes, where international audiences gave us a standing ovation. Seeing foreigners connect so deeply with a Telugu-rooted film was a moment of immense pride for us.
Q: What is the USP (Unique Selling Point) of M4M?
Jo Sharma: It’s a seat-of-the-edge murder mystery. The killer in this movie has a very artistic yet dark “signature”—he arranges the bodies to resemble famous masterpieces by legends like Raja Ravi Varma and Picasso. This is a concept that hasn’t been explored globally. To make things more exciting, we’ve announced a ₹1 Lakh prize for anyone who can correctly identify the villain on the first day of release!
Q: Tell us about the production and your roots.
Jo Sharma: The film is a joint venture between Mohan Media Creations and McQueen Group USA. We produced it with high technical standards on a significant budget. Though I live in the US, I was born in Hyderabad and raised in Nagpur and Mumbai. My parents are from Vijayawada and Guntur, so I am fluent in Telugu, Hindi, and Marathi.
Q: Who are your favorite actors in Tollywood?
Jo Sharma: I have immense respect for legends like Chiranjeevi garu, Balakrishna garu, Nagarjuna garu, and Venkatesh garu. I also admire Prabhas garu for changing the image of Tollywood globally with Baahubali. I love the work of Ram Charan, Allu Arjun, and Mahesh Babu, but I am particularly a huge fan of Jr. NTR’s dialogue delivery and acting prowess.
Q: What is your ultimate goal in the industry?
Jo Sharma: I want to be a versatile actor. I love dancing and acting, and I am looking forward to doing roles that blend glamour with high-octane action. Ultimately, my goal is to be recognized as a “Beauty with Brains.” I hope the audience supports M4M and blesses our team on May 8.
–










