హైదరాబాద్, జూన్ 13: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌కు చెందిన ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రదర్శన ‘టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో – 6వ ఎడిషన్’ శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. జూన్ 13, 14 తేదీల్లో హాల్ నెం.3లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్పో కొనసాగనుంది. గృహ కొనుగోలుదారులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
“సహీ టైమ్, సహీ ఘర్ ఔర్ సహీ ఫ్యూచర్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 30కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ 100కుపైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నాయి. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికపై విభిన్న ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఎక్స్పోను ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ లోక్‌సభ సభ్యుడు శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, గొప్ప వారసత్వ సంపదతో దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన మెట్రో నగరంగా ఎదిగిందని పేర్కొన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి హైదరాబాద్ ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారిందన్నారు.
ఇటీవలి కాలంలో మెట్రో రైలు విస్తరణ, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల కారణంగా నగర మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమయ్యాయని, దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గృహాలపై డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అలాగే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడిందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తోందని ఆయన వివరించారు.
కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ & జోనల్ హెడ్ ఎం. రవీంద్ర బాబు పాల్గొన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCలు) మరియు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణమని అన్నారు. ప్రస్తుతం గృహ కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) అమలులోకి వచ్చిన తరువాత తెలంగాణ డెవలపర్లు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు.
ఈ ఎక్స్‌పోకు అపర్ణ కన్స్ట్రక్షన్స్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా, మై హోమ్ గ్రూప్, ఎన్కాంటో బై లాన్సమ్ & ఎంకే రియాల్టీ పవర్డ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా ఉంది.
హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు, పెట్టుబడిదారులు మరియు రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎక్స్పో ప్రత్యేక అవకాశంగా నిలవనుంది.









