• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, July 8, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

Maari by Maari
July 8, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

Share and Enjoy !

Shares
Twitter

*అతిథులుగా పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్*

ఈ చిత్రంతో వంద మంది కొత్త వాళ్లు టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం

సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ పాటను ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

నటుడు సురేశ్ మాట్లాడుతూ – మాది గోదావరిఖని దగ్గర మార్కండేయ కాలనీ. నేనొక కిరణా షాప్ నడుపుకుంటూ ఉంటాను. నాకు సినిమాల మీద ఇష్టం ఉండేది. అజర్ గారు ఆడిషన్స్ కోసం మా గోదావరిఖని వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. వెనక నిలబడే చిన్న పాత్ర దక్కితే చాలు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చారు. అజర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కోసం నటనలో శిక్షణ ఇప్పించారు. కొత్త వాళ్లం అందరం చేసిన మా సినిమాను మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ మహమ్మద్ వాసిమ్ అక్రమ్ మాట్లాడుతూ – మా కొత్త సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. టైటిల్ కు తగినట్లే మా సినిమా నిజంగా కొత్తగా ఉంటుంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ సాగి సుధీర్ రావు. అజర్ ఈ చిత్రంతో వందమంది కొత్త వాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. ఆయన కలకు సహకరించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కొత్త సినిమాకు మీ సపోర్ట్ ఉండాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ యడండ్ల సతీష్ యాదవ్ మాట్లాడుతూ – మా కొత్త సినిమా సాంగ్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా సినిమాను ఒక సరికొత్త కంటెంట్ తో లోకల్ టాలెంట్ అజర్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. త్వరలోనే మా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటుడు రాకేష్ మాట్లాడుతూ – మా స్వస్థలం రామగుండం. నేను సింగరేణి ఎంప్లాయ్ ని. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. అయితే మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వీలు దొరకలేదు. అజర్ అన్న మా ఊర్లో ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. మెయిన్ లీడ్ కు నన్ను సెలెక్ట్ చేశారు. మా ఊర్లో ఉంటూ మా అమ్మ చేతి భోజనం తింటూ సినిమా అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త వాళ్లం చేసిన మా సినిమాను మీరంతా ఎంకరేజ్ చేయాలి. అన్నారు.

మేము కూడా సినిమా తీసినామురో పాట కంపోజర్, లిరిక్ రైటర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ – నేను మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నా. అజర్ వచ్చి ఈ సినిమాకు ప్రమోషనల్ సాంగ్ చేయమని అడిగాడు. నా గురించి, నా సంగీతం అజర్ వాళ్ల నాన్నకు నచ్చి నా పేరు సజెస్ట్ చేశాడట. గోదావరిఖని అనే ఊరి దాకా నా మ్యూజిక్ వెళ్లింది అనే సంతోషంతో ఈ పాట చేశాను. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుంది. లోకల్ టాలెంట్ తో లోకల్ లో సినిమా చేసిన అజర్ నిజంగా హీరో. ఈ టీమ్ ను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ – మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలా మంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఎందరో గొప్ప తెలుగు దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు, మనల్ని ఇన్స్ పైర్ చేశారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలని అనుకున్నా. పట్నంలోనే ఉంటదా కళామతల్లి, జర వెతికి చూడు ఉంటుంది గల్లీ గల్లీ అని ఈ పాటలో చెప్పినట్లు సినిమాను లోకల్ లో తీసి వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నా. మన ఊరిలోనే ఉంటూ మన ఊరివాళ్లతో సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశా. ఇంతమంది కొత్త వాళ్లను మీ ముందుకు తీసుకొచ్చా. నాకు సపోర్ట్ చేస్తున్న శ్రీధర్ గారికి, మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, చరణ్ అర్జున్ గారికి, సాగర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటుడు R K సాగర్ మాట్లాడుతూ – అజర్ ఈ సినిమా గురించి మూడేళ్ల క్రితం నుంచే చెబుతున్నాడు. నేను మాట్లాడినప్పుడుల్లా ఈ మూవీ గురించి ఎలా జరుగుతుందని అడిగేవాడిని. ఈ సినిమా కోసం అజర్ చాలా కష్టపడ్డాడు. వందమంది కొత్త వాళ్లను తెరకు పరిచయం చేయడం మామూలు విషయం కాదు. హుస్సేన్ గారు ఈ సినిమా కోసం తను సింగరేణి ఎంప్లాయిగా పడిన 40 ఏళ్ల కష్టాన్ని ఫణంగా పెట్టారు. ఆయన పీఎఫ్ డబ్బులను ఈ మూవీ నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తున్న మధుర శ్రీధర్ గారికి, చరణ్ కు, సాయిలు గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – కొత్త సినిమా నేను చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాను నిజంగానే కొత్తగా తీశారు. ఫిలిం మేకింగ్ లో అజర్ అన్ని రూల్స్ బ్రేక్ చేశాడు. ఆర్జీవీ అన్నట్లు మేడిన్ కరీంనగర్ కాదు మేడిన్ గోదావరిఖని అని ప్రూవ్ చేశాడు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఈ మూవీ రిలీజ్ కు, అలాగే ఓటీటీ రిలీజ్ కు కూడా అండగా నిలబడాలని అనుకుంటున్నాను. అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – ఈ సినిమాకు అజర్ కంటే వాళ్ల నాన్న హుస్సేన్ గారు రియల్ హీరో. ఆయన తన కొడుకు కలను నమ్మి డబ్బు ఖర్చు పెట్టి రిస్క్ చేశారు. హుస్సేన్ గారెని అభినందిస్తున్నా. సినిమా కోసం ఎంత కష్టపడినా ఆ సినిమానే మనకు కావాల్సిన ఫలితాన్ని ఇస్తుంది. కొత్త సినిమా కూడా మంచి విజయాన్ని ఈ టీమ్ కు అందించాలి. ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న శ్రీధర్ గారికి మిగతా అందరికీ థ్యాంక్స్. అన్నారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ – అజర్ ఒకరోజు నన్ను కలిసి సినిమా నిర్మాణం చేస్తున్నట్లు చెప్పాడు. మా ప్రాంతం నుంచి సినిమా నిర్మించి నష్టపోయినవారున్నారు. అందుకే ప్రొడక్షన్ వద్దు అని చెప్పా. కొడుకు అజర్ కలను తీర్చడం కోసం తండ్రి హుస్సేన్, ఇతర కుటుంబ సభ్యులు గొప్ప త్యాగం చేశారు. మా ఏరియాలో చాలా మంది నటులున్నారు. మన దర్శకులు నిర్మాతలు వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం తరుపున కూడా స్థానిక ఫిలింమేకర్స్ కు అందాల్సిన సాయాన్ని, సహకారాన్ని అందిస్తాం. ఈ కొత్త వాళ్లు అందరినీ, కొత్త సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – సురేశ్, రాకేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
డీవోపీ – జానీ బాషా
బీజీఎం – పెద్దపల్లి రోహిత్
కొరియోగ్రఫీ – మొయిన్ మాస్టర్
ప్రొడ్యూసర్స్ – మహమ్మద్ వసీమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్, డైరెక్షన్ – అజర్
మార్కెటింగ్ – స్టార్ సర్కిల్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)
Grand Launch of “Memu Kooda Cinema Teesinamuro” Song from Kotha Cinema

*Ramagundam MLA Makkan Singh Raj Thakur, filmmaker Madhura Sreedhar Reddy, director Sailu Kompati, and actor Sagar attend as chief guests*

*A remarkable 100 newcomers are being introduced to Tollywood through this film*

Proving that cinema is not confined to cities but thrives in villages too, debut director Azhar has made Kotha Cinema entirely with local talent from his hometown. One of the film’s biggest highlights is that it introduces 100 fresh talents to the Telugu film industry. Starring Suresh and Rakesh in the lead roles, the film is written, directed, edited, and scripted by Azhar. Mohammed Wasim Akram, Sagi Sudheer Rao, and Yadandla Satish Yadav are producing the film.

The promotional song “Memu Kooda Cinema Teesinamuro…”, written and composed by Charan Arjun, was launched grandly today in Hyderabad. Ramagundam MLA Makkan Singh Raj Thakur, producer-director Madhura Sreedhar Reddy, director Sailu Kampati, and actor R K Sagar Naidu attended the event as chief guests.

Speaking at the event, actor Suresh said, “I am from Markandeya Colony near Godavarikhani, and I run a small grocery shop. I’ve always dreamed of acting in films. When Azhar garu came to Godavarikhani to conduct auditions, I attended hoping to get even a small background role. Instead, he trusted me with the lead role. I sincerely thank him for that. He also arranged acting training for all of us. We are all newcomers, and I request everyone to support our film.”

Producer Mohammed Wasim Akram said, “Thank you to all the dignitaries who came to support our film. Just like its title, Kotha Cinema will truly offer something new. We hope audiences will watch and encourage it in theatres.”

Producer Sagi Sudheer Rao said, “Introducing 100 newcomers through a single film is truly commendable. I’m happy to have been part of Azhar’s dream. I hope audiences wholeheartedly support Kotha Cinema.”

Producer Yadandla Satish Yadav said, “Thank you to everyone who attended our song launch. Azhar has created a fresh and entertaining film with unique content using local talent. We are looking forward to releasing the film very soon.”

Lead actor Rakesh said, “I am from Ramagundam and work as a Singareni employee. Since childhood, I wanted to become an actor, but being from a middle-class family, I never had the opportunity to move to Hyderabad and chase my dream. When I heard that Azhar anna was conducting auditions in our hometown, I participated and was selected as one of the lead actors. I feel fortunate to have received this opportunity while staying in my hometown and enjoying my mother’s home-cooked food. We are all newcomers, and we request everyone to encourage our film.”

Composer and lyricist Charan Arjun said, “Although I am busy as a music director, Azar approached me to compose this promotional song. His father admired my music and suggested my name. I felt happy that my music had reached a place like Godavarikhani, and that’s why I agreed to do this song. The lyrics reflect the dreams and struggles of countless aspiring filmmakers who could never make it to Hyderabad to pursue cinema. Azhar is the real hero for making an entire film locally with local talent. I thank everyone who came forward to support this team.”

Director Azhar said, “People often say they came from humble beginnings. We came from even deeper from the coal mines beneath the earth. We belong to Ramagundam, a place that brings light to the world through coal extracted from darkness. Many legendary Telugu filmmakers inspired us and brought cinema closer to audiences. I wanted to take cinema even closer to the people. As the song says, art doesn’t belong only to cities—it exists in every street and every village. With this film, I have proved that you can stay in your hometown and still make a feature film with local talent. I’m proud to introduce 100 new artists through this project. I sincerely thank Madhura Sreedhar garu, our MLA Makkan Singh Raj Thakur garu, Charan Arjun garu, and Sagar garu for supporting me.”

Actor R K Sagar Naidu said, “Azar has been talking about this film for nearly three years. Every time we met, I would ask him how the project was progressing. He has worked incredibly hard to make this dream a reality. Introducing 100 newcomers is not an easy task. His father Hussain garu made a tremendous sacrifice by investing his 40 years of savings from his career as a Singareni employee, including his provident fund, into this film. I thank Madhura Sreedhar garu, Charan Arjun, Sailu garu, and everyone supporting this project.”

Producer Madhura Sreedhar Reddy said, “I have watched Kotha Cinema, and I thoroughly enjoyed it. The film is genuinely fresh and different. Azhar has broken many conventional filmmaking rules. Just as Ram Gopal Varma once said ‘Made in Karimnagar,’ Azhar has proved ‘Made in Godavarikhani.’ Charan Arjun has extended tremendous support to this project. I will also support the film’s theatrical release and its OTT release.”

Director Saailu Kampati said, “More than Azhar, his father Hussain garu is the real hero behind this film. He believed in his son’s dream and took a huge financial risk to make it happen. I congratulate him wholeheartedly. No matter how difficult filmmaking is, good cinema eventually rewards those who put in sincere effort. I wish Kotha Cinema becomes a big success. My thanks to Madhura Sreedhar garu and everyone supporting this film.”

Ramagundam MLA Makkan Singh Raj Thakur said, “Azar once came to me and shared his dream of making a film. Since a few people from our region had previously suffered losses after producing films, I initially advised him against entering production. However, his father Hussain and the entire family made tremendous sacrifices to fulfill Azhar’s dream. Our region has many talented artists who deserve opportunities, and I urge filmmakers and producers to encourage them. As a representative of the government, I assure all possible support for local filmmakers. I request everyone to encourage these newcomers and support Kotha Cinema.”

Cast:
Suresh, Rakesh, and others.

Technical Crew:

* Director of Photography: Johnny Basha
* Background Score: Peddapalli Rohith
* Choreography: Moin Master
* Producers: Mohammed Wasim Akram, Sagi Sudheer Rao, Yadandla Satish Yadav
* Story, Screenplay, Dialogues, Editing & Direction: Azhar
* Marketing: Star Circle
* PRO: Gandla Sreenivas (GS Media)

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

Next Post

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

Next Post
సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌  డ్రామా  ‘డ్యూ డేట్‌’  చిత్రం ప్రారంభం!

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' చిత్రం ప్రారంభం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌  డ్రామా  ‘డ్యూ డేట్‌’  చిత్రం ప్రారంభం!

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

by Maari
July 8, 2026
0

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

by Maari
July 8, 2026
0

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

by Maari
July 7, 2026
0

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

by Maari
July 6, 2026
0

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

by Maari
July 6, 2026
0

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

by Maari
July 6, 2026
0

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

by Maari
July 6, 2026
0

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

by Maari
July 6, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.