గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాటను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తనయుడు నంద వనమాలి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తుండగా, మేరుo భాస్కర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహావీర్ యేలేందర్ సంగీతం అందించిన ఈ పాటను ప్రముఖ గాయని సునీత ఉపద్రస్త ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, శ్రష్టి వర్మ డ్యాన్స్, కొరియోగ్రఫీ చేశారు.
వారాహి మ్యూజిక్ ద్వారా విడుదలైన ‘న్యాయం చేయరా దేవుడా’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. భావోద్వేగభరితమైన ఈ పాట చిత్ర కథాంశానికి అనుగుణంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలిపింది.
సెప్టెంబర్ 4న థియేటర్లలో ‘ధర్మస్థల నియోజకవర్గం’ పివిఆర్ ఐనాక్స్ పిక్చర్ ద్వారా విడుదల కానుంది
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. విడుదలకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
సాంకేతిక బృందం:
🎬 బ్యానర్: మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
🎥 దర్శకుడు: జై జ్ఞాన ప్రభ తోట
🎪 నిర్మాత: మేరుo భాస్కర్
🎤 గాయని: సునీత ఉపద్రస్త
✍️ గేయ రచయిత: చంద్రబోస్
💃 డ్యాన్సర్ / కొరియోగ్రాఫర్: శ్రష్టి వర్మ
🎼 సంగీత దర్శకుడు: మహావీర్ యేలేందర్
🎼 మ్యూజిక్ లేబుల్: వారాహి మ్యూజిక్
పి ఆర్ ఓ: బి. వీరబాబు
Lyricist Chandrabose Launches ‘Nyayam Cheyara Devudaa’ Theatrical Version Song from ‘Dharmasthala Niyojakavargam’
The theatrical version of the song ‘Nyayam Cheyara Devudaa’ from the upcoming Telugu film ‘Dharmasthala Niyojakavargam’ was grandly launched by renowned lyricist Chandrabose. On the occasion, Chandrabose extended his best wishes to the entire team.chandra bose son Nanda Vanamali also participated in this event.
Produced under the banner of Moving Dream India Pvt. Ltd., the film is directed by Jai Jnana Prabha Thota, with Merum Bhaskar as the producer. The song features soulful vocals by popular singer Sunitha Upadrasta, with lyrics penned by Chandrabose. Shrasti Verma choreographed the song, while Mahavir Yelender composed the music.
Released through Varahi Music, ‘Nyayam Cheyara Devudaa’ is receiving a positive response from music lovers. The emotionally charged song, which complements the theme of the film, is expected to strike a chord with audiences.
The much-awaited ‘Dharmasthala Niyojakavargam’ is set for a grand worldwide theatrical release on September 4 th releasing by PVR inox pictures.The makers expressed confidence that the film, with its engaging storyline and compelling elements, will appeal to audiences across all sections.
Technical Crew
🎬 Banner: Moving Dream India Pvt. Ltd.
🎥 Director: Jai Jnana Prabha Thota
🎪 Producer: Merum Bhaskar
🎤 Singer: Sunitha Upadrasta
✍️ Lyricist: Chandrabose
💃 Dancer / Choreographer: Shrasti Verma
🎼 Music Director: Mahavir Yelender
🎼 Music Label: Varahi Music
P R O : veerababu









