• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, September 4, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

Maari by Maari
September 4, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

Share and Enjoy !

Shares
Twitter

“టార్టాయిస్” ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్ లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది – ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్”. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. ఈ రోజు ఈ చిత్రంలోని ‘నీ పరిచయం..’ పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ – ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న పాట ఇది. ఈ పాటను అత్యద్భుతంగా కంపోజ్ చేసిన అనూప్ గారికి, అంతే అద్భుతంగా పాడిన చిన్మయి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ చిత్ర దర్శకుడు రిత్విక్ కుమార్, నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబుకు నా అభినందనలు చెబుతున్నా. ఈ పాట మీ అందరినీ అలరిస్తుంది, ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ విజయ్ చౌదరి మాట్లాడుతూ – నీ పరిచయం సాంగ్ మా మూవీకి పిల్లర్ లాంటిది. ఎమోషనల్ గా సాగే ఈ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటను ఇంత బాగా వచ్చేలా చేసిన అనూప్ గారికి, చిన్మయి గారికి హార్ట్ పుల్ థ్యాంక్స్ చెబుతున్నా. నాతో పాటు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన మిత్రులు శశి, రాంబాబు నాకు చాలా సపోర్ట్ అందించారు. ఈ పాటలో రాజ్ తరుణ్, అమృత పర్ ఫార్మెన్స్ ఆకర్షణగా నిలుస్తుంది. మా చిత్రాన్ని బడ్జెట్ లో చెప్పిన డేట్స్ లో ఎంతో క్లారిటీగా మా డైరెక్టర్ రిత్విక్ గారు చేశారు. త్వరలోనే మా మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ – మా మూవీని అనుకున్న టైమ్ కు ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేశాం. అందుకు మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ చిత్రానికి రాత్రిళ్లు, వర్షం పడుతున్నప్పుడు, చలిలో ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు వచ్చిన మా హీరో రాజ్ తరుణ్ కు థ్యాంక్స్. ఈ పాట ఇంత బాగా వచ్చేందుకు అనూప్ , చిన్మయి గారే కారణం. మా మూవీకి మెయిన్ పిల్లర్ మా డైరెక్టర్ రిత్విక్. మా మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ – మా సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించాం. ఈ పాట మంచి లవ్ ఫీల్ తో సాగుతూ మీరు రిపీటెడ్ గా వినేలా చేస్తుంది. త్వరలోనే మా చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం. మా హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అమృత, అవసరాల శ్రీనివాస్, ధన్య…ఇలా ఈ జర్నీలో సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ – చిన్మయి గారి గాత్రం, అనూప్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే సినిమాలో ఈ సాంగ్ కు ఉండే ఇంపార్టెన్స్ తెలిసింది. ఇంతమంచి సాంగ్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మూవీ ప్లాన్ చేశాక చాలా మంది ఆర్టిస్టులు మారారు కానీ నన్ను మాత్రం మార్చలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ నాకు మరిన్ని రావాలని కోరుకుంటున్నా. ఈ ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని మంచి మూవీస్ చేయాలి. అమృత పర్ ఫార్మెన్స్ చూస్తుంటే కొత్త అమ్మాయిలా అనిపించలేదు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ధన్యతో నేను కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నా తమ్ముడిగా కనిపిస్తాడు. రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీకి థియేటర్స్ లో మీరు ఇచ్చే రెస్పాన్స్ చూడాలనే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాను. అన్నారు.

నటి ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – ఇదే ప్లేస్ లో పూజా కార్యక్రమాలతో మా సినిమా ప్రారంభించాం. ఈ రోజు సక్సెస్ ఫుల్ గా మా మూవీ కంప్లీట్ చేసి కాన్ఫిడెంట్ గా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రమోషన్ గట్టిగా స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ఈ చిత్రానికి మేము చేసిన జర్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ కంప్లీట్ చేశాం. చిన్మయి గారు నా ఫేవరేట్ సింగర్. సింపుల్ లుక్స్ లో రాజ్ తరుణ్, అమృత ఫ్యూర్ ఇన్నోసెన్స్ తో చేసిన ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. టార్టాయిస్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ. మీకు బాగా నచ్చుతుంది. అది మా ప్రామిస్. అన్నారు.

సింగర్ చిన్మయి మాట్లాడుతూ – అనూప్ గారి మ్యూజిక్ లో ఈ పాట పాడే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్న. అలాగే చంద్రబోస్ గారు ఈ పాటకు బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. ఈ పాట మీ అందరినీ ఎలా అలరిస్తుందో సినిమా కూడా అంతగానే ఎంగేజ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ – నీ పరిచయం సాంగ్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సాంగ్ షూటింగ్ చేసేప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం. అలాగే మీరూ ఈ పాటను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. రావులపాలెంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. అక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు స్థానిక ప్రజలు ఎంతో ప్రేమను చూపించారు. బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారు. వాళ్ల నిస్వార్థ ప్రేమను చూశాం. అనూప్ గారు మాకు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. చిన్మయి గారంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించవచ్చు కదా సార్ అని మా ప్రొడ్యూసర్స్ ను అడిగాను. నీకు తెలుగు వచ్చు కదా అని వాళ్లు చెప్పేవారు. ఇలాగే మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – మీ అందరికీ ఆ పాట నచ్చిందని నమ్ముతున్నా. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చూశా అమృత ఈ పాటలో చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు. ఆమెకు ఇది మొదటి సినిమా అయినా ఎక్సిపీరియన్స్ ఉన్నట్లు నటించారు. అమృతకు కంగ్రాట్స్ చెబుతున్నా. నా బ్రదర్ రాజ్ తరుణ్ ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయరు. రాజ్ తరుణ్, అమృత, అవసరాల శ్రీనివాస్, ధన్య ..ఈ నలుగురి పాత్రల కాంబినేషన్ మూవీలో చాలా బాగుంది. ఈ సినిమాను మీరంతా చూసి ఎంజాయ్ చేస్తారన కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ – నీ పరిచయం అంటూ ఈ పాటను చంద్రబోస్ గారు ఏ ఇంటెన్షన్ తో రాశారో గానీ మేమంతా ఇండస్ట్రీకి తొలి పరిచయాలే. ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్న థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెంట్ తీసుకొచ్చి దాన్ని టర్న్ చేస్తూ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ చేశారు రాజ్ తరుణ్. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ఫ్లస్ పాయింట్. ఈ జానర్ లో చూస్తే రాజ్ తరుణ్ గారికి ఈ సినిమా తొలి పరిచయం. హీరోయిన్ అమృతకు తొలి పరిచయం. ఈ సినిమాలో 80 సీన్స్ ఉంటే 70 సీన్స్ లో శ్రీనివాస్ అవసరాల ఉంటారు. ఆయనది అంత ఫుల్ లెంగ్త్ రోల్. వదిన అంటే తల్లి. అలాంటి పాత్రను ధన్య గారు చేశారు. వీళ్లంతా సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేశారు. సినిమా వేరే లెవెల్లో వచ్చింది. పాట ఎంత బాగుందో చూశారు కదా సినిమా అంతకు మించి ఉంటుంది. ‘ఊపిరి అందని నాకు నువ్వే చిరుగాలి..’ వంటి అందమైన లైన్స్ తో చంద్రబోస్ గారు ఈ పాటను రాశారు. ఈ పాట హీరోయిన్ క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తుంది. మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకు త్రిమూర్తులు. మూడు రోజుల క్రితం ఈ సినిమా చూసి నాకు హగ్ ఇచ్చి హిట్ కొడుతున్నామని అన్నారు. అయితే హౌస్ ఫుల్ బోర్డ్స్ రెడీ చేయండి సార్ అని చెప్పాను. బొమ్మరిల్లు, మజిలీ లాంటి చిత్రాలను థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో మా టార్టాయిస్ సినిమా అలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. ఈ కథలో ఐదు ట్విస్టులు ఉంటాయి. ప్రతి 25 నిమిషాలకు ఒక బాంబ్ లా ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ఐదు ట్విస్ట్ లు ఎవరూ కనుక్కోలేరు. అందరూ ఫుల్ ఎగ్జైట్ అవుతారు. ఇది హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్, నెక్ట్స్ హీరో క్యారెక్టర్ సాంగ్ రిలీజ్ చేస్తాం. మా సినిమాలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. మూడు పాటలు ఎవరెస్ట్ లా ఉంటాయని అనుకోవచ్చు. అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్. థియేటర్స్ లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో మంచి మెలొడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ గారు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను అందంగా పాడిన చిన్మయి గారికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్. ఈ పాటకు మా డైరెక్టర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎంతో బాగా తెరకెక్కించాడు. అమృత చాలా తక్కువ టైమ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతుంది. అవసరాల శ్రీనివాస్, ధన్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే థియేటర్స్ లోకి మా మూవీ రాబోతోంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.

నటీనటులు – రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు

టెక్నీషియన్స్
————————–
యాక్షన్ – బెమనొల శ్రీకాంత్
కొరియోగ్రఫీ – రాజ్ కృష్ణ, వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ – దేవర మధుకర్
ఎడిటర్ – గుళ్లపల్లి మాధవ్ కుమార్
డీవోపీ – శబరి విగ్నేష్
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
కో ప్రొడ్యూసర్స్ – మానస కుమార్, సంతోష్ ఇమ్మడి
ప్రొడ్యూసర్స్ – విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – రిత్విక్ కుమార్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి. ఎస్. మీడియా)
మార్కెటింగ్ : వంశీ కిృష్ణ (సినీ డిజిటల్)

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

Next Post

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

Next Post
ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా - లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

by Maari
September 4, 2026
0

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

by Maari
September 4, 2026
0

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

by Maari
September 4, 2026
0

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

by Maari
September 4, 2026
0

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

by Maari
September 4, 2026
0

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

by Maari
September 4, 2026
0

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..  ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

by Maari
September 3, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

by Maari
September 3, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.