అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’ త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్టోబర్ 2న చిత్రం థ్రియేటికల్ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అర్జున్ కోలా పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
‘తత్వం’ ఎలాంటి కథ
ప్రారంభంలో గ్రామ పంచాయితీ నేపథ్యంలో కథతో సినిమా అనుకున్నాను. కానీ ఇలాంటి కథకు మర్డర్.. మిస్టరీ అంశాలు, కోర్టు అంశాలు యాడ్‌చేద్దామని అనుకున్నాం. అందుకే పల్లెటూరి నేపథ్యంలో కేసులు, మర్డర్ మిస్టరీతో కథను అల్లుకుని దీనికి .కమర్షియల్ అంశాలు, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ మైండ్‌లో పెట్టుకుని కథ రాసుకున్నాను. బడ్జెడ్‌లో తీద్దామని అనుకున్నాను. అనుకున్న సమయంలో అనుకున్న బడ్టెట్‌లో ఈ సినిమా కంప్లీట్ చేశాను.
ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
తత్వం అనే టైటిల్ ఈ స్టోరీకి పెట్టానికి ఓ రీజన్ ఉంది. మర్డర్ మిస్టరీ వెనుక నిజాలు, అబద్దాలు అన్నీ ఉంటాయి. ఓ మనిషి ఏది నమ్మాలి.. ఏది నమ్మకూడదో అనే కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ పాయింట్‌లో స్టోరీ నడుస్తుంటుంది. .. కాబట్టి ఏది నిజమో.. అబద్దమో తెలుసుకున్నప్పుడు ఓ మనిషి తత్వం బయటపడుతుంది. మర్డర్ మిస్టరీతో పాటు క్యారెక్టర్స్‌లోని సైకాలజీని కూడా ఈ సినిమాలో చూపెట్టాను.. హీరో పాత్ర చివరిలో ఎలా మారింది అనే దానిపై కూడా ఈ టైటిల్ ముడిపడి ఉంది. టైటిల్ చాలా బాగుంది అన్నారు.
ఈ సినిమా జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా అన్నారు?
ఈ సినిమా ప్రయాణంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. ఈ సినిమా సమయంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌కు మళ్లీ మేము వచ్చి సినిమా విడుదల చేస్తాం అని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన సమయంలో హీరో, హీరోయిన్‌కు కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. మళ్లీ వాళ్లు కోలుకునే సరికి టైమ్ పట్టింది. అందుకే మళ్లీ డిలే అయ్యింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అక్టోబర్ 2న విడుదల తేది ప్రకటించాం. ఇప్పుడు సడన్ మా టైమ్‌కి దాదాపు డజను సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో అక్టోబర్ 2న విడుదల చేస్తున్నాం. అందరం ఇక కథ మీద నమ్మకంతో అన్నీ విల్ పవర్‌తో ఫేస్ చేశాం. కష్టపడటమే కాదు సినిమాను కంప్లీట్ చేయడం కూడా పెద్ద టాస్క్..
ఈ సమయంలో మీ మానసిక పరిస్థతి ఎలా ఉండేది?
నాలో కూడా కాన్ఫిడెన్స్ తగ్గుతుండేది .. కానీ నా బాధ్యత గుర్తొచ్చేది.. ఈ సమయంలోనే అందరి సపోర్ట్‌తో ముందుకెళ్లాం..
సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఈ సినిమా చేయడానికి రీజన్?
జాబ్ గ్యాప్ తీసుకని షూట్ చేశాం. చిన్పప్పటి నుంచి ఇంట్రెస్ట్ అందుకే నా శాటిస్‌ఫాక్షన్ కోసం దర్శకత్వం చేశాను. ఫైనాన్షియల్‌గా సెటిల్ అయిన తరువాత దర్శకత్వం చేశాను.
అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేయకుండా సినిమాను తెరకెక్కించడం కష్టంగా అనిపించలేదా?
కైవల్య అనే డెమో ఫిలిం చేశాను. అప్పుడు కాన్ఫిడెన్ష్ వచ్చింది. టైమ్ డీలే అవుతున్న కొద్ది పాషన్ కూడా డీలే అవుతుంది. అందుకే ఎవరి దగ్గర ఏడీగా పనిచేయలేదు. కాకపోతే ఈ సినిమా కోసం టెక్నికల్ అందరూ బాగా సపొర్ట్ చేశారు. అందుకే మంచి అవుట్‌పుట్ వచ్చింది.
ఇప్పుడు ఫైనల్‌గా సినిమా చూసిన తరువాత మీ నిర్మాతల స్పందన?
ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తరువాత అనుకున్న దాని కంటే బాగా తీశావు అని మెచ్చుకున్నారు.
ఇలాంటి మర్డర్ మిస్టరీ సినిమాలకు ఆర్‌ఆర్ కీలకంగా ఉంటుంది? చేతన్ భరద్వాజ్ ఆర్‌ఆర్ ఎలా ఉండబోతుంది?
చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్.. ఈ మిస్టరీని ఆ సౌండింగ్‌తో చూస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే మిస్టరీ అందరిని ఎంతో థ్రిలింగ్‌గా ఉంటుంది.
దర్శకత్వం కంటిన్యూ చేస్తరా?
ఇంకా తెలియదు. ఓ సినిమా చేద్దామని అనుకున్నాను చేశాను. మాల్గుడి డేస్ లా ద్వారపుడి డేస్ అని గోదావరి నేపథ్యంలో ఓ సినిమా చేద్దామని అనుకున్నాను. అది కంప్లీట్ ఓ ఎమోషనల్ మూవీ.










