• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, June 19, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

Maari by Maari
May 29, 2026
in Cinema, Latest News, Movies, special
0
భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

Share and Enjoy !

Shares
Twitter

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘మీర్జాపురంరాణి – కృష్ణవేణి ‘ పుస్తకానికి వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డును
ప్రదానం చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు.
హైదరాబాద్ శ్రీత్యాగరాయ గాన సభలో వంశీ సంస్థ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది .
బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొని జర్నలిస్ట్ భగీరథ , నిర్మాత ఎన్ .ఆర్ . కృష్ణవేణి ని సత్కరించి…అవార్డును ప్రదానం చేశారు .
ఈ సందర్భగా నరసింహారావు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు 103వ జయతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ గారిని ఎంపిక చేసిన వంశీ రామరాజును అభినందించారు . రామారావు గారితో అనేక ఇంటర్వ్యూ లు చేసిన భగీరథ గారు , వారి శతాబ్ది సందర్భగా ‘శకపురుషుడు ‘, ‘తారకరామం ‘ అనే అద్భుతమైన పుస్తకాలు వెలువరించారని నరసింహారావు చెప్పారు . రామారావు గారిని మనదేశం సినిమాతో పరిచయం చేసిన శ్రీమతి కృష్ణవేణి గారి జీవిత చరిత్రను కూడా భగీరథ రాశారని , ఆ గ్రంధమే ‘మీర్జాపురంరాణి -కృషవేణి ‘ అని చెప్పారు .
కృష్ణవేణమ్మ కుమార్తె నిర్మాత అనురాధ గారిని ఎంపిక చెయ్యడం కూడా ఎంతో సముచితంగా ఉందని , ఈ సినిమాను ఎమ్ .ఆర్ .ఏ. అనే సంస్థ నిర్మించింది . ఎమ్ .ఆర్ .ఏ . అంటే మేకా రాజ్యలక్ష్మి అనురాధ . అలా రామారావు గారిని పరిచయం చెయ్యడంలో శ్రీమతి అనురాధాదేవి గారి పాత్ర కూడా ఉందని నరసింహారావు తెలిపారు .
వంశీ రామరాజు మాట్లాడుతూ .. భగీరథ గారితో ఐదు దశాబ్దాల నుంచి పరిచయం ఉంది , ఆయన జర్నలిజం , సాహిత్యంలో ఎంతో పేరు సంపాదించారని చెప్పారు .
భగీరథ మాట్లాడుతూ .. 1980 జూన్ 1వ తేదీన అశోక్ నగర్ గ్రంధాలయంలో నేను రచించిన ‘మానవత ‘ పుస్తకాన్ని మహాకవి శ్రీ శ్రీ గారు ఆవిష్కరించారు .అప్పటి నుంచి నా సాహిత్య ప్రస్థానం ప్రారంభమయ్యింది . ఇప్పటికి 19 పుస్తకాలు వ్రాశాను , 29 అవార్డులు వచ్చాయి , నంది , గద్దర్ , నేషనల్ అవార్డ్స్ , ఆస్కార్ అవార్డుల కమిటీల్లో పనిచేశానని చెప్పారు .
తాను వ్రాసిన ‘నాగలాదేవి ‘ పుస్తకాన్ని బళ్లారిలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉందని , తన సాహిత్య జీవితంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పరిశోధన జరుగుతుందని భగీరథ తెలిపారు .

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

Trikala Movie Review: ఆకట్టుకునే డార్క్ ఫాంటసీ చిత్రం… త్రికాల

Next Post

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

Next Post
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

by Maari
June 15, 2026
0

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

by Maari
June 15, 2026
0

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”- హీరో హర్షిత్ రెడ్డి

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”- హీరో హర్షిత్ రెడ్డి

by Maari
June 15, 2026
0

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

by Maari
June 13, 2026
0

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్

by Maari
June 13, 2026
0

రివ్యూ: పోలీస్ కంప్లైంట్ – కర్మ సిద్ధాంతంతో సాగే హారర్ యాక్షన్ థ్రిల్లర్!

రివ్యూ: పోలీస్ కంప్లైంట్ – కర్మ సిద్ధాంతంతో సాగే హారర్ యాక్షన్ థ్రిల్లర్!

by Maari
June 12, 2026
0

రివ్యూ: కొత్త మలుపు – గోదావరి అందాలు… ప్రేమలో మలుపులు!

రివ్యూ: కొత్త మలుపు – గోదావరి అందాలు… ప్రేమలో మలుపులు!

by Maari
June 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.