హారర్ చిత్రాలకు మంచి ఆదరణ వుంది. సరైన ప్లాట్ ను ఎంచుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను సెల్యులాయిడ్ పై ఆవిష్కరిస్తే… ఇలాంటి జోనర్స్ బాగా క్లిక్ అవుతాయని చాలా మంది దర్శకులు, నిర్మాతలు నమ్ముతారు. అలాంటి కోవకు చెందిన సినిమానే ‘ఈషా’. ఈ చిత్రం ప్రమోషన్స్ ను మేకర్స్… మరోవైపు పంపిణీదారులైన బన్ని వాసు, వంశీ నందిపాటి చాలా అగ్రెస్సివ్ గా చేశారు. సినిమాలో వున్న కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందే ప్రీమిర్ షోను వేశారు. భయంకరమైన హారర్ థ్రిల్లర్ గా ప్రచాచం పొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం భయపెట్టిందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: చిన్నప్పటి నుంచి మంచి మిత్రులుగా పెరిగిన నయన, కల్యాణ్, అపర్ణ, వినయ్(హెబ్బా పటేల్, అదిత్ అరుణ్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్)లు మూఢనమ్మకాల అస్సలు నమ్మరు. ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తరువాత ఆత్మలు వుండవని… వీటి పేరుతో సామాన్యుల ప్రాణాలతో ఆటలాడే స్వామీజీలను చట్టం ముందు దోషులుగా నిలబెడతారు. ఆ తరువాత ఇలాంటి స్వామీజీనే అయిన ఆదిదేవ్(బబ్లూ పృథ్వీ)ని టార్గెట్ చేస్తారు. ఎక్కడో అడవుల్లో వుండే ఆయనను కలుస్తారు. ఆత్మలున్నాయని ఆయన చేస్తున్న చర్యలను ఈ నలుగురు వ్యతిరేకిస్తారు. అయితే ఆత్మలు లేవని నమ్మే మీ నలుగురు కలిసి ఈ ఇంట్లో ఓ మూడు రోజుల పాటు వుండండి… అప్పుడు మీ వాదనతో ఏకీభవిస్తానని… తన ఆశ్రమం పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లాలో ఆశ్రయమిస్తాడు ఆదిదేవ్. ఈ మూడు రోజుల్లో ఆ నలుగురు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఆదిదేవ్ వర్సెస్ ఈ నలుగురు వాదనల్లో ఎవరిది పై చేయి అయింది? ఫైనల్ గా టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే ‘ఈషా’ మూవీని చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: స్పైన్ చిల్లింగ్ హారర్ మూవీస్ అని ప్రతి హారర్ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా మూవీ మేకర్స్ చెబుతుంటారు. అయితే ‘ఈషా’ మూవీ మాత్రం నిర్మాతలు మొదటి నుంచి చెబుతున్నట్లు ఇది నిజంగా స్పైన్ చిల్లింగ్ హారర్ మూవీనే అని చెప్పొచ్చు. సినిమాలో చాలా చోట్ల హారర్ సన్నివేశాలు ఆడియన్స్ ను భయపెడతాయి. కేవలం హారర్ నేపథ్య సంగీతంతోనే భయపెట్టకుండా స్టోరీలో భాగంగా వచ్చే హారర్ సన్నివేశాలు… ఆడియన్స్ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టిస్తాయి. జీవితంలో సంపూర్ణంగా ఆశలు తీరని వారి ఆత్మలు అలాగే తిరుగుతూ వుంటాయని చెప్పడం మనం చాలా సందర్భాల్లో వింటుంటాం. అయితే అలాంటి ఆత్మల చుట్టూ అల్లుకున్న కథ… కథనాలు చివరి వరకూ సస్పెన్షన్ ను కొనసాగించేలా తెరమీద దర్శకుడు చూపించిన విధానం ఆడియన్స్ ను క్లైమాక్స్ లో ఆకట్టుకుంటుంది. మెయిన్ పాయింట్ ను క్లైమాక్స్ లో రివీల్ చేసి థ్రిల్ గురిచేద్దామని దర్శకుడు భావించి… ఈ మధ్యలో సాగించిన కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి… కానీ ఓవరాల్ గా ‘ఈషా’ మూవీ ఆడియన్స్ భయంకరంగా భయపెడుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి జోనర్లు ఇష్టపడేవారికి ఇదొక మాంచి స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్. చివర్లో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఆడియన్స్ కు ఇచ్చారు మేకర్స్. అది బాగా కనెక్ట్ అవుతుంది.
బబ్లూ పృథ్వీ పోషించిన ఆదిదేవ్ పాత్ర… చివర్లో శివతత్వం బోధించడాన్ని బట్టి చూస్తే… ‘ఈషా’ ఫౌండేషన్ జగ్గీవాసుదేవ్ ను పోలివుందని చెప్పొచ్చు. యుగపురుషులైన కృష్ణుడు, రాముని అంతటి వాళ్లే మరణాన్ని అంగీకరించారు… సామాన్యులమైన మనం ఎంత… పుట్టిన ప్రతి జీవి మరణాన్ని అంగీకరించాల్సిందే… అది ప్రకృతి ధర్మం.. ఇలాంటి మాటలన్నింటినీ ఆ పాత్రద్వారా చెప్పించడం చాలా కన్వెన్సింగ్ గా అనిపిస్తుంది. నలుగురు మిత్రులుగా చేసిన హెబ్బా పటేల్, అదిత్ అరుణ్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్… తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మైమ్ మధు కూడా హారర్ సీన్స్ లో ఆకట్టుకుంటాడు. పుణ్యవతి పాత్ర చేసిన నటి కూడా ఒక్క చూపుతోనే ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రలన్నీ ఓకే అనేలా వున్నాయి.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె రాసుకున్న మెయిన్ ప్లాట్… దాన్ని నడిపించడానికి రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే… ఆడియన్స్ కు మంచి ఎంగేజింగ్ నిస్తాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాను ఆది నుంచి అంతం వరకూ ఎంతో ఎగ్జైటింగ్ గా రన్ చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ… గ్రాఫిక్స్ చాలా నాచురల్ గా వుంది. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. ఆర్.ఆర్.ధృవన్ ప్రాణం పెట్టి చేశాడని చెప్పొచ్చు. సంతోష్ షనమోని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హారర్ మూడ్ ను ఎక్కడా మిస్పవకుండా విజువల్స్ ను చిత్రీకరించారు. ముఖ్యంగా పుణ్యవతి చనిపోయినప్పుడు కనిపించే విజువల్స్… మైమ్ మధు చేసే కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. నిర్మాత పోతుల హేమ వెంటేశ్వరరావు ఎక్కడా రాజీపడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3










