నటుడు చైతన్యరావు… ఇటీవల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఓ వైపు వెండితెరమీద వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ అతని సినిమాలు విడుదలవుతూ… ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజగా అతను నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. అతనికి జోడీగా హెబ్బాపటేల్ నటించింది. ఎన్.ఆర్.ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం చైతన్యరావు గత చిత్రాల్లాగే ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది తెలుసుకుందాం పదండి.
కథ: ఈషాన్(చైతన్య రావు) చాలా సాఫ్ట్ అండ్ స్లో గాయ్. సోనాలి(హెబ్బా పటేల్) చాలా ఫాస్ట్ అండ్ పోర్ష్ గాళ్. ఓ సారి ఆమె సైక్లింగ్ చేస్తూ… ఓ చిన్న యాక్సిడెంట్ కు గురై… ఈషాన్ కు పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త… ప్రేమ, పెళ్లికి దారితీస్తుంది. ఇద్దరి అభిరుచులు కూడా వేరే. అయినా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. అయితే వీరి దాంపత్య జీవితం అంత సాఫల్యంగా సాగదు. దాంతో వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. ఇలాంటి వారి జీవితం… చివరకు ఎలా సుఖవంతమైన జీవితం అయిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా వుందంటే…
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఒకరి మీద ఒకరికి ఉండే అంచనాలు, అవి అందుకోలేకపోవడంతో వచ్చే కష్టాలు.. ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకొని ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ని తెరకెక్కించారు. అయితే రిసార్ట్ లోకి వెళ్లేంతవరకు బాగానే సాగినా ఆ తర్వాత జరిగేది ఊహ లేక నిజమా అనే భ్రాంతిలో ప్రేక్షకులని పడేస్తారు.
స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. రొమాంటిక్ సీన్స్ మాత్రం హీరో -హీరోయిన్స్ మధ్య బాగానే పెట్టారు. ఇక ఇలాంటి కథాంశంతో వచ్చే సినిమాల్లో క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది కాబట్టి అన్ని సినిమాల్లో లాగే ఇక్కడ కూడా అదే భార్యాభర్తల క్లైమాక్స్ ఉంటుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంటతో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కథ అంతా రెండు క్యారెక్టర్స్ మధ్యే సాగడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది.
చైతన్య రావు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలోని రెండు వేరియేషన్స్ తో మరోసారి మెప్పించాడు. ఇక హెబ్బా పటేల్ అయితే తన అందాలతో అలరిస్తుంది. నటన, అందం రెండింటితో ప్రేక్షకులని మెప్పిస్తుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంట కాసేపు నవ్విస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ నలుగురి మధ్యే సాగుతుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు బాగున్నాయి. పిక్చరైజేషన్ బాగుంది. అందంగా ఉంది జోడీ. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. ఎక్కడా బోరింగ్ అనిపించదు. ఓ సింపుల్ స్టోరీని రాసుకుని… అందుకు తగ్గట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అలరిస్తుంది. దర్శకుడిగా బాల రాజశేఖరుని విజయం సాధించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3