• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, September 30, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

Maari by Maari
September 10, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

Share and Enjoy !

Shares
Twitter

బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం హైదరాబాద్ లో “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

అతిథిగా వచ్చిన నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ – “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ బాగుంది. ఈ రోజు సమాజంలో జరుగుతున్నదే కథగా చూపించారు. ఈ చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. చిన్న చిత్రాల నిర్మాతలకు క్యూబ్ యూఎఫ్ వో ఛార్జీలు భారంగా మారుతున్నాయి. నిర్మాతల మండలికి కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం తరుపున ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం. అన్నారు.

అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజా మాట్లాడుతూ – నేను వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మించిన తర్వాత డైరెక్టర్ విజయ్ నా దగ్గరకు వచ్చి కలిశాడు. రెండు మూడు స్క్రిప్ట్స్ కూడా చెప్పాడు. మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు విజయ్. ఐ బొమ్మ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయ్ తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. అన్నారు.

మూవీ ప్రొడ్యూసర్ కురువ జమన్న మాట్లాడుతూ – మా వృత్తి వ్యవసాయం. సినిమాల మీద ఇష్టంతో చిత్ర నిర్మాణంలోకి వచ్చాను. దర్శకుడు విజయ్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనే నమ్మకం ఉంది. మా చిత్రానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. అన్నారు

డైరెక్టర్ విజయ్ రఘునాథభట్ల మాట్లాడుతూ – గతేడాది అంతా ఐ బొమ్మ గురించే న్యూస్ వైరల్ అయ్యింది. మనలో చాలా మంది ఐ బొమ్మ పైరసీ సినిమాలు చూసే ఉంటారు. ఈ సైట్ ఇప్పుడు లేదు కానీ అసలు ఆ సైట్ ప్రారంభించడం వెనక, నిర్వహించడం వెనక ఏం జరిగింది అనేది అందరికీ ఆసక్తికరమే. జీవితంలో కొన్ని సంఘర్షణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగువేశాడు. అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది. అతని ఆలోచన వెనక ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందించాం. ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 15 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. అన్నారు.

నటుడు బానోతు పవన్ మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. ఏదైనా లీడ్ రోల్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను. అలాంటి టైమ్ లో డైరెక్టర్ విజయ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం కల్పించారు. మా మూవీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు గౌతమ్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో డీఎస్ పీ విక్రమ్ పాత్రలో నటించాను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ విజయ్ లో ఒక మంచి విజన్ చూశాను. ఆయన ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా నటుడిగా నాతో పాటు మా టీమ్ అందరికీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

నటుడు సతీష్ మాట్లాడుతూ – సమాజంలో జరుగుతున్న ఒక వర్తమాన సమస్యను ప్రేక్షకులకు సినిమాగా చూపిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ రూపొందించారు. మా సినిమా వెనక ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంది. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – బానోతు పవన్, గౌతమ్, నర్మద, సతీష్, తదితరులు

టెక్నీషియన్స్
——————
ఎడిటర్ – డా.శ్యామ్ కుమార్
డీవోపీ – ఆనంద్ మరుకుర్తి
మ్యూజిక్ – హనుమ ప్రసాద్ యాళ్ల
ప్రొడ్యూసర్ – కురువ జమన్న
స్క్రిప్ట్, డైరెక్షన్ – విజయ్ రఘునాథభట్ల
పీఆర్ఓ – సతీష్.కె

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

Next Post

“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”

Next Post
“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”

“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

by Maari
September 25, 2026
0

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

by Maari
September 23, 2026
0

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

by Maari
September 23, 2026
0

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

by Maari
September 22, 2026
0

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by Maari
September 22, 2026
0

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

by Maari
September 22, 2026
0

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

by Maari
September 21, 2026
0

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

by Maari
September 18, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.