• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, May 8, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

Maari by Maari
February 5, 2026
in Cinema, Latest News
0
యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

Share and Enjoy !

Shares
Twitter

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్.ఎమ్‌. కీరవాణి మాట్లాడుతూ ‘ యంగ్‌ బ్లడ్‌ అంతా ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. అందరూ పుడుతూనే సెలబ్రెటీలు అవ్వరు. ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్‌ సింగర్‌ అవ్వాలని వచ్చాను. కానీ కొద్ది రోజులోనే అది కష్టమని తెలిసిపోయి సంగీత దర్శకుడిగా కొత్త ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత సంగీత దర్శకత్వం నా బ్రెడ్‌ అండ్‌ బటర్‌ అయితే సింగర్‌గా పాడటం అనేది నా హాబిగా మారిపోయింది.శ్రీ చిదంబరంలో నేను పాడిన పాటను నా చెల్లెలు రోజు సుప్రభాతంలా వింటుండేది. నేను దర్శకుడికి ఫోన్‌ చేయించి అభినందనలు చెప్పించాను. ఈ సినిమాలో పాట పాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాతో అందరికి విజయం అందించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ” తొలి సినిమా ఎంతో ఇంపార్టెంట్‌ నాకు తెలుసు. వాళ్ల కష్టం తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాను. మా సినిమా ఎడిట్‌లో ఉన్నప్పుడు ఆదిత్యహాసన్‌ నన్ను ఈ సినిమా ప్రీరిలీజ్‌కు వెళ్లమని చెప్పాడు. అనగానే వెంటనే వెళతా అని నేనే కాంటాక్ట్‌ అయ్యి ఈ ఫంక్షన్‌కు వచ్చాను. టీజర్‌ చూడగానే ఎంతో నచ్చింది. సంగీతం, విజువల్స్‌, పాత్రలు నాకు ఎంతగానో నచ్చాయి. ఎంతో నేచురల్‌గా అనిపించింది. ఇలాంటి పాత్రలతో సినిమా చేయడం చాలా అరుదు. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్‌ అదే. ఈ సినిమాలో హీరో పాత్రను చేయడం చాలా కష్టం. వంశీని ఆ పాత్రలో చూస్తే ఎంతో కన్వీన్సింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో నటించిన అందరికి, పనిచేసిన సాంకేతిక నిపుణులందరికి అభినందనలు. ఇలాంటి సినిమాలను మన ఆడియన్స్‌ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు.

నిహారిక కోణిదెల మాట్లాడుతూ ” నాకు దర్శకుడు వినయ్‌ మూడు సంవత్సరాల నుంచి తెలుసు. ఈ ఫంక్షన్‌కు వినయ్‌కు సపోర్ట్‌ చేయడానికి నేను వస్తానని చెప్పి మరీ వచ్చాను. వినయ్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ ఎంతో ఎనర్జీతో ఈ సినిమా చేశారు. ఈ మొదటి సినిమా ఫిలీంగ్‌ వీళ్లందరికి లైఫ్‌లాంగ్‌ గుర్తుంటుంది. ఎంతో కాన్పిడెంట్‌ ఉన్న యంగ్‌ టీమ్‌ ఇది. ఇలాంటి టీమ్‌ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. వినయ్‌తో పాటు ఈ సినిమా టీమ్‌ అందరికి మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. నిర్మాతగా ఉండే ఒత్తిడి నాకు తెలుసు. గోపాల కృష్టారెడ్డి, వంశీ నందిపాటిల నిర్మాతలు సినీ పరిశ్రమకు అవసరం. ఇలాంటి నిర్మాతలు గెలిస్తే మరెంతో మందికి అవకాశం ఇస్తారు.కీరవాణి లాంటి లెజెండ్‌ సంగీత దర్శకుడు ఈ సినిమాలో పాట పాడటం ఈ సినిమాకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. ఆయన ఇలాంటి యంగ్‌ టీమ్‌ను సపోర్ట్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అన్నారు.

నిర్మాత చింతా గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ” క్రౌడ్‌ ఫండింగ్‌తో ఈ టీమ్‌ను తిరుగుతుంటే కథ విని ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నిర్మాతగా ఎక్కడా రాజీపడకుండా చేశాను. ఈ సినిమాతో యంగ్‌ టీమ్‌ అంతా వెలుగులోకి వస్తే ఎంతో సంతోషం. ఈ రోజు టీమ్‌ ఆనందం చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా మంది వద్దని వారించారు. కానీ ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ యంగ్‌టీమ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని అనుకుంటున్నాను. ఈ టీమ్‌ కళ్లలో నేను ఆనందం చూడాలని అనుకున్నాను. వాళ్లు నా కళ్లలో ఆనందం చూడాలనుకున్నారు. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలను హత్తుకుటుంది’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఈ సినిమాలో టీమ్‌ అందరిలో హ్యపీనెస్‌ కనిపించడానికి నిర్మాత కారణం. ఈ కథ వినగానే మనం గురించి మనం వినట్లు ఉంటుంది. ఇన్‌సెక్యూరిటీని దాటి మన జీవితంలో ఎలా ఎదగాలి అనేది ఈ చిత్రకథ. ఇలాంటి కాన్పెప్ట్‌ సినిమాలతో చాలా మంది ఇన్‌స్పయిర్‌ అవుతారు. చాలా మంది అన్ని కోల్పోయాం అని అనుకునే వాళ్లకు ఎంతో ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చే సినిమా ఇది. వాళ్లలో ఎంతో ధైర్యం నింపే సినిమా ఇది. హీరో వంశీ ఈ సినిమాతో సాధిస్తే ఈయన్ని చూసి కొన్ని తరాలు ఇన్‌స్పయిర్‌ అవుతారు. జీవితంలో ఏమైనా సాధించగలం అనేది ఈసినిమా టీమ్‌ను చూస్తే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమాను ఆడియన్స్‌ను అలరిస్తుంది. ఇది కేవలం కమర్షియల్‌ సినిమానే కాదు నిజాయితీతో చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈసినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

దర్శకుడు వినయ్‌ రత్నం మాట్లాడుతూ ” ఈ రోజు నేను ఈ వేదికపై డైరెక్టర్‌గా మీ ముందుకు రావడానికి కారణం నా నిర్మాతలు. ఆయన నన్ను నమ్మి నా చేయి పట్టుకుని ఇప్పటి వరకు వదల్లేదు. మాది ఎంతో యూత్‌ఫుల్‌ టీమ్‌ మమ్ములను నమ్మి రిస్క్‌ చేశాడు. తప్పకుండా ఆయన ట్రస్ట్‌ను నిలబెట్టుకుంటాం. వంశీ ఈ సినిమాలో హీరోగా మెల్లకన్ను ఉండే యువకుడిగా చిదంబరం పాత్రలో చేశాడు. ఎంతో హార్ట్‌వర్క్‌తో, ఎంతో ప్రాక్టిస్ట్‌ చేసి ఈ పాత్రను చేశాడు. లీల పాత్రలో ఈ సినిమాలో ఎంతో స్ట్రాంగ్‌ పాత్ర. ఆ పాత్రకు సంధ్య ఎంతో బాగా నటించింది.సింక్‌ సౌండ్‌లో షూట్‌ చేసిన ఈ చిత్రంలో లోకేషన్స్‌తో పాటు ఆర్టిస్టులు కూడా ఎంతో నేచురాల్‌గా ఉంటారు. స్నేహితుల సహకారంతో నేను డైరెక్టర్‌గా ఈ రోజు సినిమా తీయగలిగాను. అందరి హృదయాలను హత్తుకునే సినిమా ఇది. నేను ఈ సినిమా ప్రతి ఒక్క ఫిల్మ్‌ క్రిటిక్‌ మా సినిమా చూసి తప్పకుండా రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే విమర్శలు సంతోషంగా స్వీకరిస్తాను. మీ రివ్యూలతో నా లోపాలను, ప్లస్‌లను తెలుసుకుంటాను’ అన్నారు.

కథానాయకుడు వంశీ తుమ్మల మాట్లాడుతూ ” హీరోగా ఇది నా తొలిచిత్ర. రాజమండ్రిలో బిలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు హీరో కావడం అనేది పెద్ద డ్రీమ్. కానీ హీరోగా అవ్వాలనే నా లక్ష్యాన్ని ఈ సినిమాతో అచీవ్‌ చేశాను. నా స్నేహితుడు వినయ్‌ రత్నం సపోర్ట్‌తో నేను ఈసినిమాతో హీరోగా మారాను. శ్రీచిదంబరం గారు ఎంతో బ్యూటిఫుల్‌ స్టోరీ. ఇది ఒకరినొకళ్లు అర్థం చేసుకునే ప్రేమకథ. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

Next Post

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

Next Post
ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ "కిల్లర్" నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

by Maari
May 7, 2026
0

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

by Maari
May 7, 2026
0

‘అగధ’ టీజర్ విడుదల

‘అగధ’ టీజర్ విడుదల

by Maari
May 7, 2026
0

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
May 6, 2026
0

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

by Maari
May 6, 2026
0

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

by Maari
May 6, 2026
0

అమెజాన్ ప్రైమ్ లో మరియు  ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

by Maari
May 4, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.