• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, August 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

Maari by Maari
July 17, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

Share and Enjoy !

Shares
Twitter

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ – “కళ్యాణం కమనీయం జీవితం” ఒక బ్యూటిఫుల్ ఫిలిం. అంతా ఫ్రెష్ టీమ్ ఈ మూవీకి వర్క్ చేశారు. ఆర్టిస్టులు కూడా చాలా మంది న్యూ యంగ్ టాలెంట్ నటించారు. మా సినిమా ప్లెజెంట్ గా ఉంటూనే చివరలో ఒక మంచి ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. మా కొత్త టీమ్ చేసిన ఈ సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ – మా ప్రొడ్యూసర్స్ గతంలో కొన్ని మంచి మూవీస్ చేశారు. నేను హీరోగా కొత్తవాడినైనా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. మా మూవీ టీజర్, సాంగ్స్ చూశారు కదా. మీ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం. సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి. శ్రీ మురళి మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ఒక కొత్త తరహా కథతో కథనంతో మీ అందరినీ ఆకట్టుకుంటుంది. మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ – నేను కంపోజర్ అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన మూవీ మనసంతా నువ్వే. ఆ చిత్ర దర్శకులు వీఎన్ ఆదిత్య గారు మా సినిమా ఈవెంట్ కు అతిథిగా రావడం, మా అందరికీ బెస్ట్ విశెస్ అందించడం సంతోషంగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – ఈ సినిమాకు దర్శక నిర్మాతలు “కళ్యాణం కమనీయం జీవితం” అనే మంచి టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగినట్లే మంచి సంగీతం, సాహిత్యం ఈ సినిమాకు కుదిరాయి. తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం చూస్తున్నాం. అలాంటి టైమ్ లో “కళ్యాణం కమనీయం జీవితం” అనే మంచి తెలుగు టైటిల్ ను పెట్టారు దర్శకుడు రవి లోకిరెడ్డి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే మూవీగా మిగిలిపోతుంది. అన్నారు.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – “కళ్యాణం కమనీయం జీవితం” టైటిల్ చూసి మీకు పెళ్లయ్యిందా అని డైరెక్టర్ ను అడిగాను. టీజర్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది. ఇంత భారీగా తెరకెక్కించారు. తన లైఫ్ నుంచి ఇన్స్ పైర్ అయ్యి చేసిన సినిమా ఇదని డైరెక్టర్ రవి చెప్పారు. చాలామంది కొత్త దర్శకులు రూపొందించే ప్రేమ కథలు వారి నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా కూడా మంచి విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ – మా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విజయేంద్రప్రసాద్ గారు చేశారు. అలాగే మా చిత్రంలో చంద్రబోస్ గారు పాట రాశారు. ఇప్పుడు వీఎన్ ఆదిత్య గారు అతిథిగా వచ్చారు. ఇంతమంది పెద్ద వాళ్ల సపోర్ట్ మా టీమ్ కు దక్కడం సంతోషంగా ఉంది. నేను కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాల మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చాను. యూఎస్ లో ఫిలింమేకింగ్ మీద కోర్స్ చేశాను. గతంలో 24 కిస్సెస్ సహా మరికొన్ని చిత్రాలు నిర్మించాము. ఇప్పుడు “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా చేస్తున్నాం. మరో సినిమా కూడా లైనప్ లో ఉంది. ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అన్నారు.

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ – నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ కు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ కథ రాసినప్పుడు రైటర్ అరవింద్ ఒక కొత్త పాయింట్ ను యాడ్ చేశాడు. ఆ పాయింట్ తో మూవీ స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మా ప్రొడ్యూసర్స్ ఎంతో సహకరించారు. మా టీమ్ చాలా ప్యాషన్ తో వర్క్ చేశారు. మంచి సాంగ్స్ కుదిరాయి. “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

నటీనటులు : ఖాన్ దురాని, సాహితీ అవంచ , ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు

బ్యానర్: వి వి ఫై మీడియా ఫిలిం ఫ్యాక్టరీ

రచయిత :ఎన్ సి అరవింద్ ఏకలవ్య
సంగీతం :శ్రీ మురళీ కార్తికేయ
డి ఓ పి. వెంకటరాజు డి
కో డైరెక్టర్: సతీష్ సిగిరెడ్డి
నిర్మాతలు: పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల
దర్శకుడు :రవి లోకి రెడ్డి
పి ఆర్ ఓ: సతీష్ కె

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా *ఎస్కే బషీద్‌ హారర్ మూవీ ‘అమెన్’ విడుదల!

Next Post

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

Next Post
గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

by Maari
August 6, 2026
0

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by Maari
August 6, 2026
0

వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ నటించిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు

వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ నటించిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు

by Maari
August 6, 2026
0

‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

by Maari
August 6, 2026
0

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

by Maari
August 3, 2026
0

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

by Maari
August 3, 2026
0

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–  అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం– అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

by Maari
August 1, 2026
0

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

by Maari
July 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.