▪️ “గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావద్దు”
– సంచలన ప్రకటన చేసిన మూవీమేకర్ ఎస్కే బషీద్
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ (AMEN) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
అభిరుచిగల దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్కే బషీద్ పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంచనాలకు అందని అనూహ్యమైన సబ్జెక్టులతో ప్రయోగాలు చేసే బషీద్.. ఇప్పుడు ‘అమెన్’ మూవీతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
*“గుండె జబ్బులు ఉన్నవాళ్లు రావద్దు!” – బషీద్ వార్నింగ్*
ఈ సినిమా గురించి ఎస్కే బషీద్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం… గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం,” అన్నారు.
*పోస్టర్‌తోనే భారీ అంచనాలు*
ఇటీవల విడుదలైన ‘అమెన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “హెచ్చరిక: మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి…” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. క్రూసేడర్ థీమ్, నీటిలో నుంచి వెలువడుతున్న భయానక హస్తాలు, మిస్టరీతో నిండిన విజువల్స్ హారర్ ప్రేమికులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.
త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో కొత్త హారర్ వేవ్‌ను సృష్టించేందుకు సిద్ధమైన ‘అమెన్’ జూలై 24న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో అనే ఆసక్తి ఇండస్ట్రీలో పెరుగుతోంది.
—
సినిమా: అమెన్ (AMEN)
సమర్పణ: రేగుల నీరజరాణి
బ్యానర్: ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్
నిర్మాత – దర్శకత్వం: ఎస్కే బషీద్
విడుదల: ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ (జూలై 24, 2026)
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
SK Basheed’s Horror Thriller ‘AMEN’ Set for a Grand Worldwide Release on July 24
*”People with heart conditions should avoid watching this film!” – Filmmaker SK Basheed’s sensational warning*
Acclaimed filmmaker SK Basheed, known for his distinctive storytelling and experimental approach to cinema, is all set to terrify audiences with his latest horror suspense thriller, AMEN. Produced under the SBK Film Corporation banner, presented by Regula Neerajarani, and released worldwide by RNR Distribution & Production, the film is scheduled for a grand global release on July 24, 2026.
Having established himself as a filmmaker who consistently delivers unique and unconventional subjects, SK Basheed has earned recognition across multiple languages for his creative vision. With AMEN, he is once again making headlines by promising an entirely new horror experience unlike anything audiences have seen before.
“People with heart conditions should stay away!” – SK Basheed
Speaking about the film, SK Basheed said:
“AMEN has been designed to redefine the horror genre. We’ve blended intense suspense with terrifying horror elements to deliver a truly unforgettable cinematic experience. Despite featuring a cast of newcomers, the film has been made with uncompromising technical excellence and high production values.
The film is so frightening that I sincerely advise people with heart conditions not to watch it. No one will dare to watch it alone inside a theatre. We have complete confidence in the film’s output, which is why we are releasing it worldwide on our own.”
Poster Creates Huge Buzz
The recently released official poster of AMEN has gone viral across social media platforms. The striking tagline, “Warning: Leave your parents safely at home before coming to watch this movie…”, has generated tremendous curiosity among movie lovers.
Featuring a haunting crusader-themed design, eerie hands emerging from water, and chilling visuals, the poster has significantly raised expectations among horror fans.
The film’s trailer, scheduled for release soon, is also creating considerable excitement. With its fresh concept and terrifying presentation, AMEN is expected to introduce a new wave of horror in Telugu cinema. Industry circles are eagerly waiting to see the impact the film will make when it hits theatres worldwide on July 24.
Film Details
Movie: AMEN
Presented by: Regula Neerajarani
Banner: SBK Film Corporation
Producer & Director: SK Basheed
Worldwide Release: RNR Distribution & Production – July 24, 2026
PRO: Ashok Dayyala
———–
—









