విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: ఈ మూవీ స్టార్టింగ్ అందమైన కాశ్మీరులో ఎంతో అందంగా మొదలవుతుంది. ఉద్యోగం కోసం విప్లవ్ ( విజయ్ దేవరకొండ) కాశ్మీర్లో వెళ్లి ఉండాల్సి వస్తుంది. అక్కడ అందరూ బేగం అని పిలిచే ఆరాధ్యను (సమంత) విప్లవ్ మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అంత సజావుగా సాగుతుంది అనుకునే సమయానికి ఆరాధ్య ముస్లిం అమ్మాయి కాదు ఒక బ్రహ్మిణ్ అనే విషయం బయటపడుతుంది. దీంతో స్టోరీ ఒక అనుప్యమైన ట్విస్ట్ తీసుకుంటుంది.
మరోపక్క విప్లవ్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. ఈ మతాంతర వివాహానికి పెద్దల్ని ఒప్పించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా…ఇంట్లో ఒప్పుకోరు. దాంతో వీళ్ళిద్దరూ పెద్దలని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అక్కడి వరకు అంతా సజావుగా సాగిన కథ వీళ్ళిద్దరి కాపురం మొదలయ్యాక మరిన్ని ట్విస్ట్ లతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. వీళ్ళిద్దరి కాపురంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి? ఇద్దరూ ఏ రకంగా తమ మధ్య మనస్పర్ధలను దూరం చేసుకున్నారు? చివరికి ఏమైంది తెలియాలి అంటే ఈ చిత్రం స్క్రీన్ పై చూడాల్సిందే..
విశ్లేషణ:
విజయ్ దేవరకొండ ఇందులో గీత గోవిందం మూవీ జలక్ కనిపించేలా ఉన్నాడు. సమంత కూడా ఎంతో అందంగా ఉంది. ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అవ్వడంతో చిత్రం ఎక్కడ ఓవర్గా అనిపించలేదు. ఇంతకుముందు ఇదే స్టోరీ లైన్ తో పలు రకాల సినిమాలు వచ్చినప్పటికీ ఈ మూవీ తీసిన విధానం చాలా డిఫరెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.
పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి.. చిన్న చిన్న విషయాలకు ఈగోలకు పోవడం వల్ల కాపురంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.. లాంటి విషయాలను ఎంతో అందంగా చూపించారు. నేటితరం యువతి యువకులకు పెళ్లి చేసుకుంటే బాధ్యతలు ఎలా వహించాలి అనే విషయాన్ని ఈ మూవీ ఎంతో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని సాంగ్స్ ముందే మంచి వ్యూస్ సంపాదించి హిట్ సాంగ్స్ గా నిలిచాయి. ఇక ఆన్ స్క్రీన్ ఆరాధ్య సాంగ్ మాత్రం ఈ చల్లని క్లైమేట్ కి స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడానికి ఎంతో హాయిగా ఉంటుంది. మొత్తానికి ఇది ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు. ఏ మూవీ తో ఇప్పటివరకు కెరియర్ లో తట పటాయిస్తున్న విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ అందుకున్నట్లే లెక్క. మరోపక్క సమంతకు కూడా ఇది మంచి సక్సెస్ కిందకే వస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఈ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత యాక్షన్ ఎంతో నాచురల్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
స్టోరీ ఎంతో గ్రిప్పింగ్ గా ఉంది.
మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది.
మైనస్ పాయింట్స్:
కొన్ని సీన్స్ లెంత్ తగ్గించి… కామెడీకి ఇంకొంచెం స్కోప్ ఇస్తే మరింత బాగుండేది.
రేటింగ్: 3