ప్రస్తుతం చాలామంది పిల్లలు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు .అలాంటి తల్లిదండ్రులు తమ మనసులో భావాలను పంచుకునేవారు లేకపోవడంతో సోషల్ మీడియాని ఒక ఎంటర్టైన్మెంట్గా ఆశ్రయిస్తున్నారు. అలా మన చుట్టూ జరుగుతున్న విషయాల్లో నుంచే ఎంతో చక్కగా కృష్ణారామా మూవీ కథను తెరకెక్కించారు . మరి ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ: కృష్ణా(గౌతమి) రామా(రాజేంద్ర ప్రసాద్).. ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. తమ పిల్లలకి ఎంతో చక్కని భవిష్యత్తు ఇప్పించడం కోసం పాటుపడ్డవారే. వాయిస్ శ్రమ ఫలితం పిల్లలు ఎంచక్కా ఫ్యామిలీలతో సహా విదేశాలలో బాగా సెటిల్ అయిపోయారు. పిల్లల సక్సెస్ తో బిజీగా ఉన్న వీళ్ళు తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే కేవలం ఒంటరితనం మిగిలింది. ఇక పిల్లలకి వీళ్ళకి మధ్య ఉన్న టెక్నాలజీ గ్యాప్ ని తగ్గిస్తూ వాళ్లకు దగ్గర అవడం కోసం సోషల్ మీడియాలోకి దూరడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సోషల్ మీడియా ప్రభావంతో జీవితంలో చోటు చేసుకున్న పెను మార్పులు ఎంతో ఆసక్తిగా సాగుతాయి. మరి ఇంతకీ వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి… ఫైనల్ గా ఏం జరిగింది తెలియాలి అంటే మూవీని చూసేయండి.
విశ్లేషణ: నిజానికి స్టోరీ మనకు కొత్తది ఏమీ కాదు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక పెద్దలను నిర్లక్ష్యం చేయడం ఈ కాన్సెప్ట్ తో ఇప్పటికే తెలుగులో ఎన్నో మూవీస్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఈ ఒంటరితనానికి సొల్యూషన్ గా తరు భావించే సోషల్ మీడియా ఎలా సమస్యగా మారుతుంది అనే విషయాన్ని భలే చూపించారు. సోషల్ మీడియా పెద్దలకే కాదు పిల్లలకి కూడా ఒక రంగుల ప్రపంచం గా కనిపిస్తుంది కానీ అది సాలిగూడు లాంటిది. వెళ్లి చెప్పుకుంటే బయటకు రావడం ఎంతో కష్టం. అయితే మొత్తానికి ఈ మూవీలో ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి ఒక వృద్ధ జంట తమ మనసులోని ఒంటరితనం బాధను పెయిన్ గెస్ట్ ద్వారా తగ్గించుకోవాలని చూడడం. 50 ఏళ్లు కలిసి బతికిన తర్వాత ఇద్దరి మనసుల్లో నిండిన నిరసనలు , వాటిని బయటపెట్టే విధానం.. ఈ మధ్యలో సోషల్ మీడియా వాళ్ల జీవితాల్లో తెచ్చే మార్పు. ఒకపక్క సోషల్ మీడియా వల్ల కలిగే మంచిని చూపిస్తూనే రెండో పక్క జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే నష్టాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక కృష్ణవేణి ,రామతీర్థ అనే పాత్రలు రాజేంద్రప్రసాద్ గౌతమి కోసమే రాశారా అనిపిస్తుంది. అంతగా వారు ఆ పాత్రలో ఇమిడిపోయారు. అనన్య చేసింది చిన్న పాత్ర అయినా సినిమాపై ఆమె ప్రభావం చాలా ఉంది. ఇక మిగిలిన నటీనటులు అందరూ తమ వంతు పాత్ర అద్భుతంగా పోషించారు. పాటలు కూడా జరుగుతున్న కథకు అనుగుణంగా ఎంతో బ్యాలెన్స్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సంభాషణలు.
కృష్ణా, రామా పాత్రలు
మూవీ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్ .
అక్కడక్కడ అనవసర సీన్లు
ఫైనల్ గా …. కృష్ణారామా అందరికీ నచ్చే కుటుంబ కథా చిత్రం.
రెటింగ్: 3