• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, August 25, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎమోషనల్… లవ్‌రెడ్డి

Maari by Maari
October 18, 2024
in Cinema, deccanfilm.com, Latest News, news, special
0
ఎమోషనల్… లవ్‌రెడ్డి

Share and Enjoy !

Shares
Twitter

కథ.. కథనం బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు ప్రేక్షకులు. స్క్రిప్ట్ లో దమ్ముంటే నటీనటులను ఎవరనేది కూడా చూడడం లేదు. అందుకే టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్స్‌ కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కించి హిట్‌ కొడుతున్నారు. అలా తాజాగా ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్‌ డైరెక్టర్‌ స్మరన్‌ రెడ్డి. అదే ‘లవ్‌రెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికితోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘లవ్‌రెడ్డి’ పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: నారాయణ రెడ్డి(అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా… ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ సారి బస్‌ లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్‌ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? ఆమె నిజంగానే నారాయణ రెడ్డిను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలా టర్న్‌ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది….

‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్‌ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌ స్మరన్‌ రెడ్డి. వినోదాత్మకంగా కథను ప్రారంభించి.. చివరిలో ప్రేక్షకుడి గుండెను బరవెక్కించి థియేటర్‌ నుంచి బయటకు పంపించేశాడు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని నడిపించాడు. కొత్త నటీనటులే అయినప్పటికీ వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్‌ని రాబట్టుకున్నాడు.

పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్‌ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్‌ మాత్రం అదిరిపోతుంది.

నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్‌ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్‌ అవుతాడు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్‌ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ మన గుండెను బరువెక్కిస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్‌ కొత్తదని చెప్పలేం. గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్‌ ఉంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్‌ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే.

ఈ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా నటించిన వ్యక్తి ఫెర్ఫార్మెన్స్‌ అయితే నెక్ట్స్‌ లెవన్‌. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా నటించిన తమ్ముడితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Tags: Entertainment newsLove ReddyLove Reddy Telugu movie Review
Previous Post

“లవ్ రెడ్డి” లాంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు – హీరో కిరణ్ అబ్బవరం

Next Post

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Next Post
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

by Maari
August 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.