ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలు చేసి… తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. హ్యాపీడేస్ తో మనకు పరిచయమై… వరుస సినిమా సినిమాలు చేశారు. తాజాగా ‘నింద’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగం చేస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుకున్న అమాయకులను శిక్షల బారి నుంచి తప్పించడానికి పనిచేస్తుంటాడు. మరోవైపు వివేక్ తండ్రి ఓ జడ్జ్ (తనికెళ్ల భరణి) ఓ కేసులో సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇచ్చినట్టు చెబుతాడు. కానీ ఆ కేసులో అతని నిర్ధోషి అంటూ బాధపడుతూ చనిపోతాడు. ఈ క్రమంలో ఆ కేసును టేకప్ చేసిన వివేక్.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు. అసలు ఈ కేసులో ఉన్న ముఖ్యులు ఎవరు.. ఎలా వివేక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దలను ఎలా ఎదిరించి పోరాడాడు.. చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ కథ ముఖ్యంగా ఓ కీలకమైపన విషయాన్ని చెబుతోంది. అందేంటంటే మన సమాజంలో ఒక సామెత.. వంద మంది దోషులు తప్పించుకున్నా.. ఒక నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు.. అనే న్యాయ సూత్రంపై నడుస్తుంది. అందులో భాగంగా ఒక వ్యక్తి చేయని తప్పుకు ఎలా శిక్షించబడ్డాడు. ఎలా అతన్ని హీరో రక్షించాడు.. అనేది ముఖ్యకథ. అయితే ఈ నేపథ్యంలో తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. నిందా కూడా అలాంటి సబ్జెక్టే.. అయితే కథ బాగున్నప్పటికీ.. ఇంక కొద్దిగా మెరుగులు దిద్దితే సినిమా అదిరిపోయేది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఇక ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగినా.. సెకండాఫ్ లో గ్రిప్పింగా ఉంటుంది స్క్రీన్ ప్లే. నటీనటులతో మంచి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు. కథ పాతదైనా.. తనదైన ట్విస్టులతో ఈ సినిమా సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగించాడు దర్శకుడు. నిర్మణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్టాఫ్‌లో కొంత సాగదీత ఉంటుంది. ఇక్కడ ఎడిటర్ కత్తెరకు మరింత పదును పెడితే ఇంకా బాగుండేది. మొత్తంగా తప్పు చేయని వాడికి శిక్ష పడకూడనే కాన్సెప్ట్ ఆకట్టుకుంది.
వరుణ్ సందేశ్‌లో ఈ సినిమాలో తన నటనతో వావ్ అనిపించాడనే చెప్పోచ్చు. కొన్ని సీన్స్‌లో వావ్ అనిపించాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3