స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారుల బయోపిక్ సినిమాలు ఇంట్రెస్టింగ్ తో పాటు… నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగానూ ఉంటాయి. ఎంతో ఎత్తుకు ఎదిగిన క్రీడాకారుల జీవితాల్లో ఎత్తు పల్లాలు నేటి తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అందులోనే అన్ని వర్గాల వారికి ఇష్టమైన క్రికెట్ ఆటగాళ్ల జీవితాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ధోనీ, సచిన్, అజారుద్దీన్ ఇలా ఫేమస్ ఆటగాళ్ల బయోపిక్ లు వచ్చాయి. ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా మన ముందుకు వచ్చింది. శ్రీలంకలోని కాఫీ తోటల్లో పనిచేయడానికి తమిళనాడు నుంచి వలస వెళ్లిన ముత్తయ్య మురళీధరన్ కుటుంబం… తొలి నాళ్లలో అక్కడ ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొంది… ఆ తరువాత కాలక్రమంలో వారి తల్లిదండ్రులు బిస్కెట్ ఫ్యాక్టరీని పెట్టడం… అక్కడ లోకల్ గా ఉన్న సింహళీయులకు అది కంటగింపుగా మారడం… దాని పర్యవాసానంగా… బిస్కెట్ ఫ్యాక్టరీ తగలబడిపోవడం… ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ముత్తయ్య మురళీధరన్ ఫ్యామిలీ గురించి సినిమాను ప్రారంభించి… అతను అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్లు తీయడానికి పడిన కఠోర శ్రమను ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా… కేవలం ఎమోషన్స్ తో కూడిన కథ… కథనాలను మాత్రమే వెండితెరపై ఆశిష్కరించి… నేటి యువత ఎంతో కొంత స్ఫూర్తి పొందేలా 800 మూవీ తెరకెక్కింది.
కథ విషయానికి వస్తే… మురళీ ధరన్(మధుర్ మిట్టల్) చిన్నతనంలో బాగా అల్లరి చేసే కుర్రాడు. చాలా చురుగ్గా ఉంటారు. తోటి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న బిస్కెట్ ఫ్యాక్టరీ దుండగుల దాడిలో ధ్వంసం అవుతుంది. దాంతో పాటు మురళీ కుటుంబం పైనా అటాక్ చేయాలని చూస్తారు. దాంతో మురళీని ఓ చర్చి ఆశ్రమంలో చేరుస్తారు తల్లిదండ్రులు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తాడు మురళీ. అయితే తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ లో రాణించడానికి చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు పడుతూ… అంచెలంచెలుగా అంత్జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఈ 800 కథ.
కథ… కథనం… ముత్తయ్య మురళీధరన్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన క్రికెట్ జీవితం ఎప్పుడు అంటే… 1998లో జరిగిన ఆస్ట్రేలియా టూర్. మురళీధరన్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా త్రో(చకింగ్) చేస్తున్నారని… అతని ఎల్పో యాక్షన్ సరిగా లేదని అంపైర్లు పదే పదే నోబ్ లు ఇస్తూ… అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారు. దాంతో మురళీ ధరన్ తన బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ కమిటీ ముందే ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ఎంతో ఎమోషనల్ గా చూపించారు. పుట్టకతోనే తన చేయి ఎల్బో అలా ఉండటాన్ని ఐసీసీ నిర్దారించడం… ఆ తరువాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటం… మిగతా క్రికెటర్ల కంటే ఎక్కువగా 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు సాధించిన ముత్తయ్య మురళీ ధరన్… తాను ఎన్నడూ ఇంటర్నేషనల్ క్రికెట్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసినట్టు లేదని ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు. తన బౌలింగ్ యాక్షన్ పై వచ్చిన అనేక వివాదాలనే ఇందులో ఎక్కువగా ప్రస్తావించారు. క్రికెట్ ఆడే తొలినాళ్లలో జాత్యాహంకారానికి గురై అవమానులు ఎదుర్కొన్నట్లు చూపించారు.
ఇందులో ముత్తయ్య మురళీధరన్ గా నటించిన మధుర్ మిట్టల్ చక్కగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో కొంత హవ భావాలను పలికించకపోయినా… మిగతా అన్ని కోణాల్లోనూ అచ్చం మురళీ ధరన్ లాగే కనిపించి మెప్పించాడు. స్కూల్, కాలేజీ, అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశం… మొదటి మ్యాచ్ లో స్టాండ్స్ కే పరిమితం కావడం… అప్పుడు అతని మనసులోని సంఘర్షణ, బంధువులు, మిత్రుల మధ్య అతడు ఎలా ఫీలయ్యారు… ఆ తరువాత ఎలా నిలదొక్కోవడానికి ట్రై చేశారు… తదితర లాంటి సీన్స్ అన్నీ బాగా చేశారు. అతనికి జోడీగా నటించిన మహిమా నంబియార్ కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. పత్రికాధిపతిగా నాజర్ నటన బాగుంది. అలాగే శ్రీలంక క్రికెట్ టీమ్ నాటి కెప్టెన్ అర్జున రణతుంగ పాత్రలో నటించిన వ్యక్తి పాత్ర చాలా బాగా పోట్రైట్ చేశారు. అతని పాత్రకు బాగా ఎలివేషన్ ఉంది. మిగతా పాత్రలన్నీ పర్వాలేదు.
చిత్ర దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి ఈ చిత్రానికి కావాల్సిన కథ… కథనాలను ఎంతో బ్యాలెన్సింగ్ గా సిద్ధం చేసుకుని తెరపైకి ఎక్కించిన విధానం బాగుంది. ఎక్కడా ఎలివేషన్స్ గానీ, ఓవర్ బిల్డప్ ల జోలికి వెళ్లకుండా… కేవలం ముత్తయ్య మురళీ ధరన్ లోని ఎమోషన్స్ ని మాత్రమే చూపించారు. అయితే మురళీధరన్ కి సచిన్, గంగూలి, ద్రావిడ్, అజహరుద్దీన్ లాంటి ఇండియన్ క్రికెటర్స్ తో ఎదురైన సవాళ్లను కూడా కొంచం చూపించి ఉంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీములతో పడిన ఇబ్బందులను మాత్రమే ఇందులో చూపించడం వల్ల ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు కొంత నిరాశే. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ ఉంది. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ముత్తయ్య మురళీ ధరన్ జీవితంలో ఎత్తు పల్లాలను ఎంతో నిజాయతీగా తీసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.25