• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, May 26, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

Maari by Maari
May 26, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

Share and Enjoy !

Shares
Twitter

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం తాజాగా రెండవ గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ఈ పాట తన భావోద్వేగ లోతు, హాయినిచ్చే అనుభూతితో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రేమ అనే భావన చుట్టూ అల్లుకున్న ఈ పాట, ఒక యువకుడు తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మనసులో దాచుకున్న మౌన భావాలను, ఆరాధనను, అనురాగాన్ని అందంగా ఆవిష్కరించింది.

గేయ రచయిత సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం సరళంగా ఉంటూనే, హృదయానికి హత్తుకునేలా ఉంది. ప్రతి పదం పాట భావానికి అద్భుతంగా సరిపోతూ, శ్రోతలను తక్షణమే ఆకట్టుకుంటుంది. ఈ స్వరకల్పనకు ప్రాణం పోస్తూ, గాయకుడు కె.ఎస్. హరిశంకర్ తన మృదువైన, భావయుక్తమైన గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సరికొత్తగా, ప్రశాంతంగా, భావోద్వేగభరితంగా ఉండే ఒక బాణీని సృష్టించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ పాటలో వాద్య సంగీతం మృదువుగా సాగుతూ, గాత్రాన్ని మించిపోకుండా భావాన్ని మరింత మెరుగుపరిచింది. ఈ పాట ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూనే, తెలియని భావోద్వేగాన్ని మిగులుస్తుంది. అందుకే ఈ గీతం ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.

లండన్ నేపథ్యంతో చిత్రీకరించిన ‘ప్రియసఖి’ పాట దృశ్యపరంగా అద్భుతంగా ఉంది. ఆ సుందరమైన దృశ్యాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. నాయకానాయికలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘బేబీ’ తర్వాత అత్యంత ప్రేమించబడిన వెండితెర యువ జంటలలో ఒకటిగా వారు ఎందుకు నిలిచారో, ఈ పాట మరోసారి గుర్తు చేస్తోంది.

’90s’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకొని, వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమా 2026 జూలైలో థియేటర్లలో అడుగు పెట్టనుంది.

‘ప్రియసఖి’ పాటతో ఈ చిత్రం భావోద్వేగం, అమాయకత్వం, హృద్యమైన క్షణాలతో నిండిన ఒక అందమైన ప్రేమకథను అందిస్తుందని హామీ ఇస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు త్వరలో వెలువడనున్నాయి.

తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్
కూర్పు: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఫణి కె వర్మ
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

Priyasakhi from EPIC – FIRST SEMESTER Wins Hearts with Its Soulful Melody* Hesham Abdul Wahab MusicL

The makers of EPIC – FIRST SEMESTER have unveiled the film’s second single “Priyasakhi” and the melody is already winning hearts with its emotional depth and soothing vibe. Centered around the feeling of love, the song beautifully expresses the silent emotions, admiration and affection a young man carries for someone special.

Lyricist Suresh Banisetti pens heartfelt lines that feel simple yet deeply relatable. Every word blends seamlessly with the mood of the song, making it instantly connect with listeners. Adding soul to the composition, singer K S Harisankar delivers a captivating performance with his soft and expressive vocals.

Composer Hesham Abdul Wahab once again proves his brilliance by creating a melody that feels fresh, calming, and emotionally rich. The instrumentation flows gently throughout the track, enhancing the mood without overpowering the vocals. The song carries a breezy feel while also leaving behind emotional warmth, making it a perfect repeat-listen melody.

Visually, “Priya Sakhi” stands out with its stunning London backdrop. The scenic visuals add elegance and freshness to the song, while Anand Deverakonda and Vaishnavi Chaitanya share charming chemistry on screen. Their pairing once again reminds audiences why they became one of the most loved young on-screen pairs after Baby.

Directed by debutant Aditya Haasan, EPIC – FIRST SEMESTER is backed by producers Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, with Srikara Studios presenting the film. Coming to theatres this July.

With “Priyasakhi” the film promises a youthful love story filled with emotion, innocence and heartfelt moments. More exciting updates about the film are expected soon.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

by Maari
May 26, 2026
0

ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

by Maari
May 25, 2026
0

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల

by Maari
May 25, 2026
0

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

by Maari
May 25, 2026
0

‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి

‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి

by Maari
May 23, 2026
0

ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్

ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్

by Maari
May 23, 2026
0

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

by Maari
May 22, 2026
0

‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ: కలియుగాంతం.. కొత్త సృష్టికి నాంది!

‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ: కలియుగాంతం.. కొత్త సృష్టికి నాంది!

by Maari
May 22, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.