• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

దేశభక్తిని చాటిచెప్పే రామ్…

admin by admin
January 26, 2024
in Cinema, Movies, news, Reviews
0
దేశభక్తిని చాటిచెప్పే రామ్…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈ మధ్య దేశభక్తి ప్రధాన చిత్రాలు రావడం తెలుగులో చాలా వరకూ తగ్గాయి. చాలా సినిమాలు హారర్, యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీస్, లవ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు లేదా అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. కానీ ఈ వారం మాత్రం విడుదలవుతున్న నాలుగైదు చిత్రాల్లో దేశ భక్తికి సంబంధించిన చిత్రం మాత్రం రామ్ (RAM Rapid Action Mission). ఈ చిత్రానికి కమర్షియల్ అంశాలను జోడించి… మన ముందుకు తీసుకొచ్చారు. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు లెక్కచేయకుండా దేశం కోసం వీర మరణం పొందుతాడు. తమ కోసం మరణించాడంటూ మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం దేశానికి సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు. దేశానికి సేవ చేస్తూ తన తండ్రి చనిపోతే దిక్కులేని వాళ్లం అయ్యామని, చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్. అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరకు డిపార్ట్మెంట్‌లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అసలే లేని రామ్.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ.

కథ… కథనం విశ్లేషణ: దేశభక్తి ప్రధాన చిత్రాలు అనగానే టెర్రరిజం… దాన్ని నిలువరించడానికి హీరో చేసే సాహస విన్యాసాలు ఇవే ప్రధాన అంశాలు. ఇలాంటివి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాకపోయినా… దానికి ఇచ్చే ట్రీట్ మెంట్… మాత్రం నవ్యంగా… వైవిధ్యంగా ఉంటే… ఆడియన్స్ ను ఎంగేజ్ చేయొచ్చు. రామ్… చిత్రంలో దర్శకుడు అదే చేశారు. పాయింట్ పాతదే అయినా… దాన్ని నడిపించడానికి రాసుకున్న కథనం మాత్రం చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. హీరోకి ఈ చిత్ర డబ్యూనే అయినా… అతనికి బలమైన సపోర్టింగ్ యాక్టర్స్ కూడా తోడు కావడంతో రామ్… ఎంతో కమర్షియల్ గా కనిపిస్తుంది. భానుచందర్, శుభలేఖ సుధాకర్, డైలాగ్ కింగ్ సాయికుమార్, రవి వర్మ ఇలా బలమైన ప్యాడింగ్ తోనే సినిమా రన్ అవుతుంది. ఈ చిత్రంలో గతంలో వచ్చిన అనేక పేట్రియాటిక్ జోనర్స్ లో కనిపించని పాయింట్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. అదేంటంటే బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే కొత్త పాయింట్‌ ను తీసుకుని… దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సిన్సియర్ ముస్లిం ఆఫీసర్ పాత్రను పోషించిన సాయికుమార్‌తో ఆ పాయింట్‌ను మరింత బలంగా చెప్పించి… ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ఇలాంటి పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మొదటి అర్ధ భాగంలో హీరోకి సంబంధించిన కొన్ని సీన్స్… అతని ఫ్రెండ్ గా నటించిన బాష… సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలా జాలీ జీవితం గడిపే హీరో పాత్ర… బాధ్యత గలిగిన ఓ అధికారిగా మారే క్రమాన్ని దర్శకుడు మలిచిన తీరు… సెకెండాఫ్ పై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుంది. సెకండాఫ్‌ మొత్తం ఫుల్ ఎమోషనల్‌గా… యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా పరుగులు పెడుతుంది. ధన్య బాలకృష్ణ చేసిన ఎమోషనల్ సీన్ సెకండాఫ్‌లో అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అలాగే శుభలేక సుధాకర్ పాత్రతో ఉగ్రవాదానికి, రాజకీయానికి ఉన్న కనెక్షన్, చరిత్రకి, రాజకీయానికి ఉన్న కనెక్షన్‌ను చక్కగా చూపించారు. సెకండాఫ్ పూర్తి సీరియస్ మోడ్‌లో దేశ భక్తి కోణంలో నడిపించాడు. మిహిరాం క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కళ్లలో త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్.. హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌… ఇలా అన్ని అంశాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. సో… దేశభక్తి చిత్రాలను చూడాలనుకునే వారు ఈ వారం రామ్ సినిమాని చూసేయొచ్చు.

రామ్ సినిమాలో టెక్నికల్ టీం కొండంత అండగా నిలబడింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. ధారన్ సుక్రి విజువల్స్, ఆయన టాలెంట్ చెప్పాలంటే క్లైమాక్స్ షాట్స్ చాలు. అద్భుతమైన కెమెరా వర్క్ కనిపిస్తుంది. మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని చాలా క్వాలిటీగా తీశారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

రామ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటిస్తాడు. దేశభక్తి అంటే గిట్టని, అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చూపించే వ్యత్యాసం ఆకట్టుకుంటుంది. ఆ రెండింటికీ చాలా వ్యత్యాసం చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త అల్లరి చిల్లరగా, పిచ్చి జుట్టు వేసుకున్నట్టుగా.. అమ్మాయి ప్రేమ కోసం తిరిగే ఓ సాధారణ కుర్రాడిలా కనిపిస్తాడు. ద్వితీయార్దంలో మాత్రం దేశం కోసం ప్రాణాలిచ్చే సిన్సియర్ ఆఫీసర్‌గా సీరియస్ పాత్రలోనూ అలరించారు. యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు. ఇక మొదటి సినిమా అన్న బెరుకు ఎక్కడా లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌ లోనూ చాలా బాగా పర్ ఫామ్ చేశాడు. రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు. భానుచందర్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. సాయి కుమార్, శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని చూపించారు. రియాజ్ పాత్రలో సాయి కుమార్ తన డైలాగ్ (మతం గురించి చెప్పే డైలాగ్) డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు.. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. భాషా కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవి వర్మ దేశానికి ద్రోహం చేసే టెర్రరిస్ట్ నాయకునిగా షరీఫ్ పాత్రలో రౌద్రం చూపించారు. చాలా భాగం అండర్ వరల్డ్ డాన్ గా కనిపించి మెప్పించారు. తల్లి పాత్రలో మీనా వాసు, విలన్ గ్యాంగ్ లో అమిత్ నటించి మెప్పించారు. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్ 3

Previous Post

ఎంగేజింగ్ ఎక్స్ పరిమెంట్ మూవీ… 105 మినిట్స్

Next Post

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం

Next Post
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

by admin
May 17, 2025
0

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
May 17, 2025
0

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

by admin
May 14, 2025
0

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

by admin
May 12, 2025
0

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.